మెర్సిడేజ్-బెంజ్ ఎప్పుడూ నంబర్ వన్ గా ఉండటానికి కృషి చేస్తూనే ఉంటుంది, అని కొత్త సీఈఓ అంటున్నారు

మెర్సిడెస్ బెంజ్ 2015-2020 కోసం bala subramaniam ద్వారా అక్టోబర్ 19, 2015 10:31 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:

మెర్సిడేజ్-బెంజ్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది అని మిస్టర్.రోలాండ్ ఫోల్గర్ గారు అన్నారు. ఈయన మెర్సిడేజ్-బెంజ్ కి కొత్త నియమకం అయిన మ్యానేజింగ్ డైరెక్టర్ & సీఈఓ. చెన్నై లో సంభాషణలో భాగంగా, ఈ కంపెనీ ఎప్పుడూ కస్టమర్ల అంచనాలను నాణ్యత తగ్గకుండా చేరుకుంటూ ఉంటుంది అని అన్నారు. గత ఏడాది అమ్మకాల సంఖ్యను ఈ సెప్టెంబరుకే అందుకున్నందున, ఇకపై మిగితా ఏడాది అమ్మకాలతో కంపెనీ  రికార్డుసృష్టించనుంది. 

కొత్త జీఎల్ఈ  (మునుపు ఎం-క్లాస్) గురించి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా 1.6 మిలియన్ అమ్మకాల పైగా ఈ కారు1997 లో విడుదల అయినప్పటి నుండి అందుకుంది అని అన్నారు. ఎం-క్లాస్ భారతదేశంలో 2009 లో విడుదల అయ్యి ఇక్కడ 6000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. జీఎల్ఈ  కంపెనీ వారి నుండి వచ్చిన 13వ ఉత్పత్తి. ఇది 2015 లో విడుదల అయ్యింది మరియూ ఇంకో రెండు మోడల్స్ ఈ ఏడాది లో విడుదలకు ఉన్నాయి. మరొక 15 ఔట్‌లెట్ లు తెరిచి మొత్తం 39 నగరాలలో విస్థరించిన ఔట్‌లెట్ల సంఖ్యను 80 కి పెంచుతుంది.  

కొత్త మెర్సిడేజ్-బెంజ్ జీఎల్ఈ రెండు వేరియంట్స్ గా జీఎల్ఈ 250d మరియూ జీఎల్ఈ 350d లను రూ. 59.95 లక్షలు ఇంకా రూ. 71.14 లక్షల ధరకు అందిస్తున్నారు.  జీఎల్ఈ 250d కి 2143 ఇన్-లైన్ సిలిండర్ డీజిల్ ఇంజిను ఉండి అది 204bhp శక్తి ఇంకా 500Nm టార్క్ విడుదల చేస్తుంది.  జీఎల్ఈ 350d కి 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో చార్జడ్ డీజిల్ ఇంజిను కలిగి ఉండి ఇది 258bhp శక్తి ఇంకా 620Nm టార్క్ ని ఉత్పత్తి చేయగలదు. వీటి ట్రాన్స్మిషన్ బాద్యతలు 9-స్పీడ్ 9-ట్రానిక్ ట్రాన్స్మిషన్ చూసుకుంటుంది. 

ఇతర లక్షణాలు డైనమిక్ సెలెక్టివ్ తో ఐదు డ్రైవింగ్ మోడ్స్, ఎయిర్‌మాటిక్ సస్పెన్షన్, కమాండ్ ఆన్‌లైన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం మరియూ ఇతర ఆధునిక రక్షణ మరియూ అస్సిటెన్స్ వసతులు అందాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మెర్సిడెస్ బెంజ్ 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience