మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ ఎస్యువి ని రూ.58.9 లక్షలు వద్ద ప్రారంభించింది
మెర్సిడెస్ బెంజ్ 2015-2020 కోసం akshit ద్వారా అక్టోబర్ 14, 2015 02:20 pm సవరించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈ రోజు నవీకరించబడిన ఎంఎల్-క్లాస్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది జిఎల్ఇ క్లాస్ గా కొత్త పేరుతో నామకరణం చేయబడినది. ఈ ఎస్యువి ఇప్పుడు రెండు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది మరియు వోల్వో ఎక్స్ సి90, బిఎండబ్లు ఎక్స్5 మరియు ఆడీ క్యు7 వంటి వాటితో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది.
మెర్సిడెస్ నుండి తాజా లుక్ తో జిఎల్ఇ వాహనం కొత్త జిఎల్సి మరియు జిఎల్ఎ-క్లాస్ వంటి వాటితో బలమైన పోలికను కలిగి ఉంది. ఇది సెంటర్ లో త్రీ-పాయింటెడ్ స్టార్ తో ముద్రించబడిన ఒక కొత్త ట్విన్ స్లాటెడ్ రేడియేటర్ గ్రిల్ ని మరియు ఎల్ఇడి బ్రో ని కలిగియున్న కొత్త హెడ్ల్యాంప్స్ సమితిని కలిగి ఉన్నాయి. అంతర్భాగాలలో కూడా, జర్మన్ కార్ల తయారీ సంస్థ యొక్క తాజా తరం మోడళ్లు నుంచి అనేక అంశాలైనటువంటి సమాచార వ్యవస్థ ఇంటర్ఫేస్ ని కలిగి
ఉంది మరియు ఇది సి-క్లాస్ ని పోలి ఉంది. అంతేకాకుండా, టచ్ ప్యాడ్ తో అమర్చబడి ఉన్న ఒక కమాండ్ కంట్రోలర్ ని కలిగి ఉంది.
జిఎల్ఇ అంతర్జాతీయంగా విస్తృత ఇంజిన్ ఎంపికలతో అందించబడుతున్నది, కానీ భారతదేశ వెర్షన్ జిఎల్ఇ 250d లో 2.1 లీటర్ 4-సిలిండర్ మిల్లు మరియు జిఎల్ఇ 30d లో 3.0-లీటర్ వి6 తో మాత్రమే అందుబాటులో ఉంది. జిఎల్ఇ 250d ఇంజిన్ 201bhp శక్తిని మరియు 620Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. అయితే, జిఎల్ఇ 30d ఇంజిన్ 254bhp శక్తిని మరియు 620Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. అంతేకాకుండా, 7-స్పీడ్ ట్రాన్స్మిషన్ కొత్త 9జి-ట్రానిక్ ఆటో బాక్స్ తో విడదీయబడుతుంది.
ధర:
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ 250d: రూ. 59.9 లక్షలు
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ 350d: రూ. 69.9 లక్షలు