జిఎల్ ఈ 450 ఏఎంజి కూపే ను ప్రారంభించడానికి సిద్దపడుతున్న మెర్సిడెస్ బెంజ్
మెర్సిడెస్ బెంజ్ 2015-2020 కోసం abhishek ద్వారా జనవరి 12, 2016 12:44 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మెర్సిడెస్ బెంజ్ 2015 వ సంవత్సరంలో అనేక ప్రారంభాలతో ముందుకు వచ్చింది మరియు ఈ జర్మన్ దిగ్గజం, జిఎల్ ఈ 450 ఏఎంజి కూప్ తో 2016 లో మొదటి ప్రయోగానికి సిద్ధంగా ఉంది. పేరు ను చూసినట్లైతే, ఈ జిఎల్ ఈ వాహనం స్పోర్టీ గా ఉండటమే కాకుండా లుక్ పరంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది.
ఈ జిఎల్ ఈ కూపే స్టైలింగ్ తో ఉన్నది బిఎండబ్ల్యూ ఎక్స్6 ఎస్యువి వాహనం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా, ఈ జిఎల్ ఈ వాహనం రెండు వేరియంట్ లలో అమ్ముడుపోతుంది అవి వరుసగా, 450 ఏఎంజి మరియు మేడ్డర్ 63 ఎస్ ఏఎంజి వేరియంట్. భారతదేశంలో, ఈ వేరియంట్ లతో మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఉండే ఇంజన్ అత్యధికంగా 326 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 520 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 9- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.
ఈ వాహనం ప్రయాణ సమయంలో ఆహ్లదకరమైన డ్రైవింగ్ ను అందిస్తుంది. అంతేకాకుండా, కొనుగోలుదారులు ఎక్స్ 6 ను ఇష్టపడి ఉంటే ఈ జిఎల్ ఈ కూపే ను తప్పకుండా ఇష్టపడతారు. గత సంవత్సరం ఈ జిఎల్ ఈ ఎస్యువి వెర్షన్ ను విడుదల చేశారు కానీ, ఈ ఎస్యువి పెద్ద గ్రిల్, పదునైన క్యారెక్టర్ లైన్లు, స్వూపింగ్ రూఫ్ మరియు 22 అంగుళాల బారీ వీల్స్ వంటి అంశాలను కలిగి ఉంటుంది.
ఈ మెర్సిడెస్ జిఎల్ ఈ వాహనం యొక్క లోపలి భాగాన్ని చూసినట్లైతే, నప్పా లెధర్, విలాసవంతమైన క్రాఫ్టెడ్ క్యాబిన్ మరియు ఇతర అన్ని అంశాలు ప్రీమియం మెర్సిడెస్ బెంజ్ ఎస్యువి వాహనం నుండి అందించబడతాయి.
మెర్సిడెస్ బెంజ్ యొక్క ముందు అన్ని కార్లు కూడా, సిబియూ తో పాటు సికెడి యూనిట్ తో వస్తున్నాయి. ఈ కూపే వాహనం యొక్క ధర సుమారు రూ 75 లక్షల నుండి 1 కోటి మధ్య ఉండే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి.