రూ. 50.50 లక్షల ధర వద్ద విడుదలైన Mercedes-Benz GLA Facelift
2024 మెర్సిడెస్ బెంజ్ GLA, ఈ తేలికపాటి ఫేస్‌లిఫ్ట్‌లో సూక్ష్మ డిజైన్ మార్పులు మరియు కొన్ని ముఖ్యమైన ఫీచర్ అప్‌డేట్‌లను అందించింది
-
2024 GLA మూడు వేరియంట్‌లలో అందించబడుతోంది: అవి వరుసగా 200, 220d 4మాటిక్ మరియు 220d 4మాటిక్ AMG లైన్.
-
కొత్త GLA, అప్‌డేట్ చేయబడిన హెడ్‌లైట్ సెటప్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు అప్‌డేట్ చేయబడిన బంపర్‌ను పొందుతుంది.
-
ఇందులో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు (ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డ్రైవర్ డిస్‌ప్లే) మరియు టచ్ కంట్రోల్‌లతో సరికొత్త స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి.
-
ఇది ఇప్పుడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అలాగే 360-డిగ్రీ కెమెరాను కూడా పొందుతుంది.
-
మెర్సిడెస్ అవుట్‌గోయింగ్ GLA నుండి అదే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది.
మెర్సిడెస్ బెంజ్ GLA ఫేస్‌లిఫ్ట్, 2023 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది, ఇప్పుడు 2024లో, ఇది చివరకు మన భారత తీరాలకు చేరుకుంది, దీని ధరలు రూ. 50.50 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా). 2024 GLA సూక్ష్మమైన డిజైన్ మార్పులను పొందుతుంది మరియు మొత్తం సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి కీలకమైన లక్షణాలను జోడిస్తుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందించబడుతోంది.
ఫేస్‌లిఫ్టెడ్ GLA ధరలను చూద్దాం.
ధరలు
GLA 200 |
రూ.50.50 లక్షలు |
GLA 220డి 4మ్యాటిక్ |
రూ.54.75 లక్షలు |
GLA 220d 4మ్యాటిక్ AMG లైన్ |
రూ.56.90 లక్షలు |
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా
సూక్ష్మ డిజైన్ మార్పులు
మెర్సిడెస్ బెంజ్ GLA ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ మార్పులు చాలా సూక్ష్మమైనవి, దాని ముందు వాహనాల మాదిరిగానే ప్రొఫైల్‌ను కలిగి ఉన్నాయి. LED DRLలతో అప్‌డేట్ చేయబడిన LED హెడ్‌లైట్‌లు, నిలువు గీతలతో రిఫ్రెష్ చేయబడిన గ్రిల్ మరియు రివైజ్డ్ బంపర్ డిజైన్‌ను కలిగి ఉన్న అత్యంత గుర్తించదగిన మార్పులు ముందు భాగంలో ఉన్నాయి. SUV యొక్క AMG లైన్ వేరియంట్ పిన్ క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన విలక్షణమైన ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది.
ఇది కూడా చూడండి: ఫేస్‌లిఫ్టెడ్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ ప్రారంభించబడింది, దీని ధర రూ. 67.90 లక్షలు
సైడ్ ప్రొఫైల్‌లో, GLA ఫేస్‌లిఫ్ట్ యొక్క AMG లైన్ వేరియంట్ కొత్త 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది మరియు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ఉన్న క్లాడింగ్ ఇప్పుడు బాడీ పెయింట్‌తో ఫినిష్ చేయబడింది. నవీకరించబడిన LED టెయిల్‌ల్యాంప్‌లు మినహా వెనుక డిజైన్‌లో ఎటువంటి మార్పు లేదు. మెర్సిడెస్ ఫేస్‌లిఫ్టెడ్ GLAతో కొత్త స్పెక్ట్రల్ బ్లూ ఎక్స్‌టీరియర్ షేడ్‌ను కూడా పరిచయం చేసింది.
క్యాబిన్ నవీకరణలు
2024 మెర్సిడెస్ GLA SUV డ్యూయల్-టోన్ బ్లాక్, లేత గోధుమరంగు మరియు ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్ రెండింటి ఎంపికతో వస్తుంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉంది, అయితే ఇది అదనపు నిల్వ స్థలాన్ని అందించే రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్‌ను పొందుతుంది. GLA ఫేస్‌లిఫ్ట్ యొక్క సాధారణ వేరియంట్ ప్యాసింజర్ సైడ్ డ్యాష్‌బోర్డ్‌లో ఇల్యూమినేటెడ్ స్టార్ ప్యాటర్న్ ట్రిమ్‌ను పొందుతుంది, అయితే AMG లైన్ వేరియంట్ యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్ ద్వారా మెరుగుపరచబడిన విలక్షణమైన కార్బన్ స్ట్రక్చర్ ట్రిమ్‌ను కలిగి ఉంది.
అదనంగా, AMG లైన్ వేరియంట్ నప్పా లెదర్ తో చుట్టబడిన టచ్ కంట్రోల్‌లతో సరికొత్త AMG స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. 2024 GLA రెండు అప్హోల్స్టరీ ఎంపికలను అందిస్తుంది: అవి వరుసగా మకియాటో బీజ్ మరియు ఆర్టికో బ్లాక్.
ఇది కూడా చూడండి: 2024 మెర్సిడెస్ -AMG GLE 53 కూపే ప్రారంభించబడింది, దీని ధర రూ. 1.85 కోట్లు
ఫీచర్లు భద్రత
మెర్సిడెస్ GLA ఫేస్‌లిఫ్ట్‌ను డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలతో (ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఒకటి మరియు డ్రైవర్ కోసం ఒకటి) అమర్చింది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇప్పుడు సరికొత్త MBUX – NTG7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది మరియు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కి మద్దతు ఇస్తుంది. 2024 GLAలోని ఇతర ఫీచర్ల జాబితాలో మెమరీ ఫంక్షన్‌తో పాటు విద్యుత్‌తో సర్దుబాటు చేయగల ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లు, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, గెస్చర్ కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్ మరియు రెండు-భాగాల పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అంశాలు ఉన్నాయి.
ప్రయాణీకుల భద్రతను ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, యాక్టివ్ బ్రేక్ మరియు బ్లైండ్ స్పాట్ అసిస్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ద్వారా నిర్దారించబడుతుంది.
పవర్‌ట్రెయిన్ వివరాలు
GLA ఫేస్‌లిఫ్ట్ దాని ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో అందించబడిన అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది మరియు వాటి స్పెసిఫికేషన్‌లు పట్టికలో క్రింద వివరించబడ్డాయి:
స్పెసిఫికేషన్లు |
GLA 200 |
GLA 220d 4MATIC |
ఇంజిన్ |
1.3-లీటర్ టర్బో-పెట్రోల్ |
2-లీటర్ డీజిల్ |
డ్రైవ్ ట్రైన్ |
2WD |
AWD |
శక్తి |
163 PS |
190 PS |
టార్క్ |
270 Nm |
400 Nm |
ట్రాన్స్మిషన్ |
7-స్పీడ్ DCT |
8-స్పీడ్ DCT |
త్వరణం (0-100 kmph) |
8.9 సెకన్లు |
7.5 సెకన్లు |
క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్యం |
17.4 kmpl |
18.9 kmpl |
ఆఫ్ రోడ్ ఇంజనీరింగ్ ప్యాకేజీ
మెర్సిడెస్ బెంజ్ GLA ఫేస్‌లిఫ్ట్ యొక్క 220d AMG లైన్ డీజిల్ వేరియంట్, ఆల్-వీల్-డ్రైవ్ (AWD) డ్రైవ్‌ట్రైన్‌ను కలిగి ఉంది. మెర్సిడెస్ దీనిని ఆఫ్-రోడ్ ఇంజనీరింగ్ ప్యాకేజీతో కూడా అందిస్తుంది, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై గ్రేడియంట్ మరియు స్లోప్ యాంగిల్ వంటి పారామితుల కోసం నిజ-సమయ ప్రదర్శనను కలిగి ఉంటుంది. అదనంగా, ఆఫ్-రోడ్ ప్యాకేజీ డౌన్‌హిల్ స్పీడ్ రెగ్యులేషన్ (DSR)ను కలిగి ఉంటుంది, ఇది హిల్ డిసెంట్ కంట్రోల్ వలె పనిచేస్తుంది. అయితే, ఈ సిస్టమ్ 2 kmph మరియు 18 kmph మధ్య వేగ పరిధిని మాన్యువల్‌గా ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సహాయ వ్యవస్థ అవరోహణ సమయంలో ముందుగా ఎంచుకున్న వేగం ఆధారంగా బ్రేక్‌లను ఉపయోగిస్తుంది.
ప్రత్యర్థులు
2024 మెర్సిడెస్ బెంజ్ GLA- ఆడి Q3 మరియు BMW X1 లకు పోటీగా కొనసాగుతోంది. ఇది మినీ కూపర్ కంట్రీమ్యాన్‌కు సరసమైన ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది.