Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

AMG SL 55ను భారతదేశంలో ప్రవేశపెడుతున్న మెర్సిడెస్

జూన్ 23, 2023 06:02 pm tarun ద్వారా ప్రచురించబడింది
75 Views

ఐకానిక్ SL పేరుగల పర్ఫార్మెన్స్-స్పెక్ AMG అవతారంలో టాప్ؚడౌన్ మోటరింగ్ కోసం కొత్త స్టైల్‌లో అందిస్తున్నారు

మెర్సిడెస్-AMG SL 55 రోడ్ؚస్టర్ రూ.2.35 కోట్ల (పాన్ ఇండియా ఎక్స్-షోరూమ్) ధరతో విడుదలైంది. ఐకానిక్ SL పేరుతో ఈ మాడెల్‌ను 2012 వరకు మార్కెట్‌లో విక్రయించారు, దాని తరువాత ఆరవ-జనరేషన్ మోడల్ భారతదేశంలో ప్రవేశపెట్టలేదు. ఈ కారు తయారీదారు దాదాపు 11 సంవత్సరాల తరువాత, భారతదేశంలో రెండు-డోర్‌ల SL కాబ్రియోలెట్ కోసం బుకింగ్ؚలను ప్రారంభించింది.

మెర్సిడెస్ అందిస్తున్న ఏకైక రెండు-డోర్‌ల కాబ్రియోలెట్

E-క్లాస్ కాబ్రియోలెట్ తరువాత, అఫాల్టర్‌బాచ్ నుండి భారతదేశంలోకి వచ్చిన రెండవ కన్వర్టబుల్‌గా AMG SL 55 రోడ్ؚస్టర్ నిలుస్తుంది. ఈ సరికొత్త SL 55, మెర్సిడెస్ ప్రస్తుత డిజైన్ లాంగ్వేజ్ؚకు అనుగుణంగా మృదువైన మరియు వంపులు తిరిగిన లైన్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు, షార్ప్ LED టెయిల్ؚలైట్‌లతో స్లాటెడ్ AMG-ప్రత్యేక గ్రిల్ؚను కలిగి ఉంటుంది, ఇది ఈ వాహనానికి ‘ఫోకస్డ్’ లుక్ؚను ఇస్తుంది, మరియు పనితీరు భావనను చూపుతుంది.

ఈ రోడ్‌స్టర్ 21-అంగుళాల AMG-స్పెక్ అలాయ్ వీల్స్‌తో హై-పర్ఫార్మెన్స్ టైర్‌లను కలిగి ఉంది. ఇది సాఫ్ట్-టాప్ అవతార్ؚలో లభిస్తుంది, ఇతర కాబ్రియోలెట్ؚల విధంగానే 15 సెకన్‌లలో 60kmph వరకు వేగాన్ని చేరుతుంది. ముందు వైపు ఎలాగ్నేటెడ్ ప్రొఫైల్ ఉండగా, వెనుక వైపు దృఢంగా ఉంటుంది. నాజూకైన టెయిల్ ల్యాంప్ డిజైన్ మరియు క్వాడ్ ఎగ్జాస్ట్స్ దీనికి అగ్రెసివ్ రూపాన్ని ఇస్తాయి.

విలాసవంతమైన క్యాబిన్

ఇతర మెర్సిడెస్-AMG ఆఫరింగ్‌ల విధంగానే, SL 55 స్పోర్టీ లుక్‌తో విలాసాన్ని కలగలిసి ఉంటుంది. హీటింగ్ ఫంక్షన్ؚతో మృదువైన మూడు-స్పోక్ؚల AMG స్టీరింగ్ వీల్, స్పోర్టీ అల్యూమినియం పెడల్స్, టర్బైన్ నుండి ప్రేరణ పొందిన AC వెంట్ؚలు, సెంటర్ కన్సోల్‌పై కార్బన్ ఫైబర్ ఇన్ؚసర్ట్ؚలు, ఆప్షనల్ నప్పా లెదర్ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ ఉన్నాయి. ఇటువంటి లగ్జరీ స్పోర్ట్స్ డిజైన్ వాహనాలలో సాధరణంగా ఉండే 2+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ SLలో కూడా ఉంది.

ఫీచర్‌లకు కొదువ లేదు

ఈ సంపన్నమైన SL 55 రోడ్‌స్టర్‌లో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హీటెడ్, వెంటిలేటెడ్ మరియు మసాజ్ ఫంక్షన్‌లతో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 64-రంగుల ఆంబియెంట్ లైటింగ్ ఉన్నాయి. 1220W 17-స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పోర్ؚట్రెయిట్ స్టైల్ 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్ MBUX-పవర్డ్ ఇన్ఫోటైన్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

బ్లైండ్ స్పాట్ అసిస్ట్, సరౌండ్ వ్యూ సిస్టమ్, పార్కింగ్ అసిస్ట్, ఎనిమిది ఎయిర్ బ్యాగ్‌లు, ESP, మరియు ఆప్షనల్ రాడార్-ఆధారిత ADASలు వంటి భద్రతా ఫీచర్‌లను కలిగి ఉంది. 240 లీటర్‌ల స్టోరేజ్‌తో ఉపయోగించగలిగిన బూట్‌ను కలిగి ఉంది, కానీ సాధారణ కార్‌ల విధంగా ఉండదు కానీ రెండు ట్రావెల్ బ్యాగులు లేదా గోల్ఫ్ బ్యాగ్ؚను ఉంచవచ్చు.

బోనెట్ క్రింద చేతితో తయారుచేసిన V8!

ఈ బ్రాండ్ సిగ్నేచర్ అయిన చేతితో-చేసిన 4-లీటర్‌ల ట్విన్-టర్బో V8 ఇంజన్ మెర్సిడెస్-AMG SL 55కు శక్తిని అందిస్తుంది. ఈ ఇంజన్ 476PS పవర్ మరియు 700Nm టార్క్‌ను అందిస్తుంది, మరియు సున్నా నుండి 100kmph వేగాన్ని 3.9 సెకన్‌లలో చేరగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ట్రాన్స్ؚమిషన్ డ్యూటీలను 9-స్పీడ్‌ల MCT ఆటోమ్యాటిక్ యూనిట్ నిర్వహిస్తుంది.

రేర్-వీల్ స్టీరింగ్ మరియు రేర్ లిమిటెడ్ స్లీప్ డిఫరెన్షియల్‌తో మెర్సిడెస్ 4MATIC + (AWD) డ్రైవ్ట్రెయిన్ప్రామాణికం, హై-స్పీడ్ కార్నరింగ్ సమయంలో తగిన గ్రిప్ మరియు స్థిరత్వాన్ని ఇది నిర్ధారిస్తుంది. డైనమిక్ సామర్ధ్యాలతో యాక్టివ్ సస్పెషన్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది, ఇది కంఫర్ట్ నుండి డైనమిక్ వరకు డ్రైవింగ్ అనుభవాల ఎంపికను అందిస్తాయి. భారతదేశంలో రోడ్డులకు అనుగుణంగా కార్ క్లియరెన్స్ؚను 30mm వరకు పెంచారు.

పోటీ

ఈ ధరలో, AMG SL 55, ఇదే ధరకు అందుబాటులో ఉన్న దిగువ వేరియెంట్ؚలు అయిన పోష్ 911 కాబ్రియోలెట్ؚలతో నేరుగా పోటీ పడుతుంది. ఓపెన్-టాప్ మోటరింగ్ భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించారు, కానీ SL లాంటివి దేశంలో మరిన్ని కాబ్రియోలెట్ؚలను ప్రోత్సహిస్తాయి.

Share via
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కన్వర్టిబుల్ కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర