రేపు ప్రారంభించబడుతున్న మెర్సిడెస్ - AMG GT- S
published on nov 23, 2015 05:46 pm by konark కోసం మెర్సిడెస్ ఏఎంజి జిటి
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: అత్యంత విజయవంతమైన SLS AMG స్థానంలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశంలో అత్యంత శక్తివంతమైన AMG అయిన AMG GT- S ని రేపు ప్రారంభించబోతున్నది. ఇది ఈ ఏడాది ప్రారంభించబడుతున్న 5 వ ఏఎంజి. ఇది పూర్తిగా మెర్సిడెస్ AMG శాఖ చే అభివృద్ధి చేయబడినది. ఈ సూపర్‌కారు కొత్త 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్ చే అమర్చబడి 510ps శక్తిని మరియు 650Nm టార్క్ ని అందిస్తుంది.
ఈ శక్తి యొక్క సంరక్షణ ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ యూనిట్ తీసుకొని వెనుక చక్రాలను తిప్పుతుంది. AMG GT S వాహనం SLS లో చూసిన విధంగా గల్-వింగ్ డోర్స్ ని కలిగి ఉంటుంది మరియు ఇంజిన్ కూడా ఎమిజన్ నియమాలకి తగ్గట్టుగా ఉంటుంది.
ఈ సూపర్‌కారు ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ సస్పెన్షన్ తో ఒక అల్యూమినియంతో చేసిన ఫ్రేమ్ ఆధారంగా ఉంటుంది. అలానే అడ్జస్టబుల్ డంపింగ్ ని ప్రామాణిక లక్షణంగా పొంది ఉంటుంది.
ఈ కారు ఒక సుదీర్ఘ హుడ్ మరియు ఒక చిన్న సీటింగ్ కాక్పిట్ తో క్లాసిక్ GT కారు రూపకల్పనని కలిగి ఉంటుంది. లోపలివైపు, AMG GT టెక్నాలజీ స్విచ్లు మరియు అల్యూమినియం ట్రింస్ తో ఫైటర్ జెట్ ని చాలా వరకూ పోలి ఉంటుంది.
అలానే ఈ వాహనం సిరామిక్ బ్రేకులు, ఫోర్జెడ్ వీల్స్, డ్రై సంప్ లూబ్రికేషన్, డైనమిక్ సర్దుబాటు గల ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ మౌంట్స్ ని కలిగి ఉంటుంది.
AMG GT S కేవలం 3.7 సెకన్లలో 100Kmph చేరుకోగలుగుతుంది మరియు 310kmph గరిష్ట వేగం వరకూ వెళ్ళగలదు. అద్భుతమైన ఏక్జిలరేషన్ తో ఇది చాలా అద్భుతమైన కారు.
దీని ధర రూ. 2-2.5 కోట్లు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉండవచ్చని అంచనా. ఇది పోర్స్చే 911 టర్బో S, ఆడి R8 V10 మరియు జాగ్వార్ F- టైప్ R కూపే వంటి వాటితో పోటీ పడవచ్చు.
ఇంకా చదవండి
- మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ ఎస్యువి ని రూ.58.9 లక్షలు వద్ద ప్రారంభించింది
- మెర్సిడేజ్ ఎస్ఎల్ ఫేస్లిఫ్ట్ ని లాస్ ఏజిలిస్ మోటర్ షోలో బహిర్గతం చేశారు
- Renew Mercedes-Benz AMG GT Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful