Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి యొక్క ఆటో ఎక్స్‌పో 2020 లైనప్ వెల్లడి: ఫ్యూటురో-E కాన్సెప్ట్, ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జా & ఇగ్నిస్, స్విఫ్ట్ హైబ్రిడ్ & మరిన్ని

ఫిబ్రవరి 03, 2020 02:39 pm dhruv ద్వారా ప్రచురించబడింది
25 Views

ఎక్స్‌పోలో భారతీయ కార్ల తయారీసంస్థ పెవిలియన్ ఎక్సో వద్ద గో-గ్రీన్ నినాదం తో వెళుతుంది, భవిష్యత్తులో అలా చేయటానికి ఉపయోగపడే మొబిలిటీ టెక్‌ను కలిగి ఉంటుంది.

  • ఫ్యూటురో-E మారుతి యొక్క భవిష్యత్ యుటిలిటీ వాహనాల డిజైన్ లాంగ్వేజ్ ను నిర్వచిస్తుంది.
  • విటారా బ్రెజ్జా సమగ్ర నవీకరణను స్వీకరించడాన్ని మేము చూస్తాము.
  • ఫేస్‌లిఫ్టెడ్ ఇగ్నిస్ కూడా ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతుంది.
  • మారుతి యొక్క పూర్తి లైనప్ తో పాటు, జపాన్ నుండి కూడా స్విఫ్ట్ హైబ్రిడ్ ఉంటుంది.

భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి రాబోయే ఆటో ఎక్స్‌పో 2020 లో తన ఉనికిని ఎంతవరకు వెల్లడించింది. ఫ్యూటురో-E కాన్సెప్ట్‌ను చూస్తామని మనకు ఇప్పటికే తెలుసు, మారుతి ఇప్పుడు దాని మిగిలిన ఎక్స్‌పో లైనప్‌ ని కూడా మనకి తెలిపింది.

ఇంతకుముందు, కూపే లాంటి ఫ్యూటురో-E కాన్సెప్ట్ క్రెటాను ప్రతిభింబించేలా పరిమాణాన్ని కలిగి ఉంది. ఏదేమైనా, ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ యొక్క కొత్త టాప్ షాట్ ఇది నెక్సాన్ EV ప్రత్యర్థిగా ఉండబోతుందని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఫ్యూటురో-E గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మారుతి యొక్క భవిష్యత్ యుటిలిటీ వాహనాల డిజైన్ లాంగ్వేజ్ ని ఇది నిర్వచిస్తుంది.

ఇది కాకుండా, విటారా బ్రెజ్జా దాని మిడ్-లైఫ్ అప్‌డేట్ కోసం సిద్ధంగా ఉంది. మేము దీన్ని 2016 ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి చూశాము మరియు అప్పటి నుండి AMT ఎడిషన్ మినహా ఇది చాలావరకు అదే విధంగా ఉంది. అయితే, మారుతి ఆటో ఎక్స్‌పో 2020 లో ఫేస్‌లిఫ్టెడ్ విటారా బ్రెజ్జాను ప్రదర్శిస్తుంది. ఇది ఫేస్‌లిఫ్ట్ మాత్రమే కాదు, BS 6 పెట్రోల్ మోటారు కోసం డీజిల్ ఇంజిన్‌ ను కూడా మార్చుకుంటుంది.

మారుతి అప్‌డేట్ చేసిన ఇగ్నిస్‌ ను కూడా ప్రదర్శిస్తుంది. ఇది కొత్త ఫ్రంట్ గ్రిల్‌తో ఫేస్‌లిఫ్ట్ అవుతుంది. వీటితో పాటు, మారుతి తన ప్రస్తుత ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శిస్తుంది, ఇందులో సెలెరియో, ఎస్-ప్రెస్సో, వాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఎర్టిగా, ఎస్-క్రాస్, సియాజ్ మరియు XL 6 ఉన్నాయి.

జపనీస్ మార్కెట్ నుండి వచ్చిన స్విఫ్ట్ హైబ్రిడ్ కూడా ఎక్స్‌పోలో ఉంటుంది. మొత్తం మీద, మారుతి పెవిలియన్ వద్ద 17 వాహనాలు ఉంటాయి.

Share via

Write your Comment on Maruti ఫ్యూచర్-ఇ

explore similar కార్లు

మారుతి ఇగ్నిస్

4.4634 సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.5.85 - 8.12 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్20.89 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

మారుతి ఫ్యూచర్-ఇ

4.83 సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.15 లక్ష* Estimated Price
ఫిబ్రవరి 10, 2050 Expected Launch
ట్రాన్స్ మిషన్మాన్యువల్
ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 22.24 లక్షలు*
Rs.7 - 9.84 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర