బాలెనో లాగానే మారుతి సుజుకి వై బీ ఏ కూడా తన సెగ్మెంట్ ని అధిగమిస్తుందా
డిసెంబర్ 14, 2015 06:01 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మారుతి కంపెనీ దాని తొలి సబ్-4 ఎం ఎస్‌యువి ని ప్రారంభించటానికి మరియు రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించడానికి అన్ని అలంకరించబడి సిద్దంగా ఉన్నాయని వార్త పుకారు చేస్తోంది. దీనికి వై బీ ఏ అనే సంకేత పదం తో పిలుస్తున్నారని సమాచారం. వాహనం విస్తృతంగా లోడ్ చేయబడి మరియు దాదాపు అదే సెగ్‌మెంట్ లోని ఫోర్డ్ ఈకో-స్పోర్ట్ మరియు మహీంద్రా టీ యూ వీ 300 లను అధిగమిస్తుందని అనుకుంటున్నారు.
మారుతి, ఈ రోజుల్లో కొత్త కొత్త ఉత్పత్తులతో మార్కెట్ లో ఒక ఒరవడిని ఏర్పరస్తోంది. బాలెనో దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఇది స్విఫ్ట్ మోడల్ వంటి అదే యాంత్రిక రకాలను ఉపయోగిస్తూ ఉన్నప్పటికీ, వాహనం ఒక కొత్త తేలికైన వేదిక మీద ఆధారపడి ఉంటుంది. దానితో పాటు వాహనం యొక్క చివర అంచుల వరకు కూడా వివిధ ఫీచర్స్ ని జత చేస్తున్నారు. మరియు ఫలితంగా, బాలెనో గత నెల తన విభాగంలో నాయకుడు అయిన హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ల అమ్మకాలను అధిగమించింది. బాలెనో మోడల్ విజయం తర్వాత, మారుతి సుజుకి దాని వై బీ ఏ (మారు పేరు) కాంపాక్ట్ ఎస్‌యువి ని తయారుచేస్తుంది. దీనిని 2016 ఫిబ్రవరిలో జరగబోయే ఆటో ఎక్స్పో లో లాంచ్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. వాహనం యొక్క రహస్య చిత్రాలు మరియు షాట్లు చాలా వరకు కంటాపడ్డాయి. ఇటీవల నవంబర్ మరియు డిసెంబర్ నెల లలో ఇవి బహిర్గతం అయ్యాయి. వాహనం పరీక్ష దాని చివరి దశ లో ఉంది అని ఈ చిత్రాల ద్వారా తెలిసింది. దీనికి ఇది ఫోర్డ్ ఈకో-స్పోర్ట్ మరియు మహీంద్రా టీ యూ వీ 300 లను అధిగమించే సామర్ధ్యం ఎందుకు ఉందో తెలుసుకుందాం.
ఈ వాహనము బాలెనో లాగానే సుజుకి యొక్క కొత్త ప్లాట్-ఫాం పై ఆధారపడి తయారుచేయబడింది. ఈ కొత్త ప్లాట్-ఫాం యొక్క ఉపయోగం,ఇది చాలా తేలికగా ఉంటుంది. పూర్తిగా లోడ్ చేసిన బాలెనో బరువు దాదాపుగా 980 కిలోల సమీపంలో ఉంటుంది. ఈ వై బీ ఏ 1.3 డ్డిశ్ డీజిల్ తో తేలికపాటి హైబ్రిడ్ వెర్షన్ ని పొందుతుందని భావిస్తున్నారు. ఈ ప్లాట్-ఫాం తో పాటు - అది ఈ విభాగంలో ఉన్న ప్రముఖ కార్ల కంటే సమర్ధ్యమైన గణాంకాలు మరియు మైలెజ్ అందించే విధంగా ఉంటుందని ఆశిస్తున్నారు. మహీంద్రా టీ యూ వీ 300 దాని ఆర్ డబ్ల్యూ డీ అమరిక కారణంగా-18.49 కే ఎం పి ఎల్ తక్కువ ఇంధన సామర్ధ్యం తో బాధపడుతుంది. అదే, ఫోర్డ్ ఈకో-స్పోర్ట్ 22.27 కే ఎం పి ఎల్ ఇంధన సామర్ధ్యం తో తన సెగ్‌మెంట్ లో మొదటగా ఉంది. అంతే కాకుండా ప్రస్తుత ఎస్‌యువి లలో అత్యంత శక్తివంతమైనది గా పరిగణింపబడుతున్నది. మహీంద్రా టీ యూ వీ 300 ల కాకుండా, వై బీ ఏ కూడా పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉంటుంది. దీనితో పాటు పెట్రోల్ వర్షన్ లో సి వి టి ఇంజన్ తో కూడా వచ్చే అవకాశం ఉంది.
ఫీచర్స్ పరంగా కూడా చూస్తే, తన సెగ్‌మెంట్ లో మొదటి సారిగా ద్వి జినాన్ లెడ్ డి ఎల్ ఆర్ ఎస్ తో హెడ్ల్యాంప్స్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, న్యావిగేషన్ మరియు ఆపిల్ కార్ ప్లే వంటి అత్యాధునిక ఫీచర్స్ తో ఉంటుంది. ఈ సెగ్‌మెంట్ లో ఏ వాహనము కూడా న్యావిగేషన్ తో 7అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ ని మరియు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ని అందించలేదు. క్లుప్తంగా, మారుతి సుజుకి గనక ఈ వాహన ధరను సరిగా నిర్ణయిస్తే, వాహన అమ్మకాలలో ఒక రాకెట్ లాంటి ప్రారంభం ఉంటుంది !
ఇవి కూడా:
మారుతి సుజుకి యొక్క కాంపాక్ట్ ఎస్యువి అయిన వైబిఏ వాహన అంతర్గతభాగం బహిర్గతం!