మారుతి సుజుకి యొక్క కాంపాక్ట్ ఎస్యువి అయిన వైబిఏ వాహన అంతర్గతభాగం బహిర్గతం!
నవంబర్ 27, 2015 12:46 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఈ మారుతి సుజుకి వైబిఏ వాహనం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు మహింద్రా టియువి300 వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఈ విభాగం లో ఈ వాహనం, ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్ లతో మరియు 7 అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ వంటి అంశాలతో మొదటిసారిగా రాబోతుంది.
మారుతి సుజుకి వైబిఏ వాహనం మొదటిసారిగా, హిమాచల్ ప్రదేశ్ లో, సిమ్లా వద్ద అంతర్గత భాగాలతో బహిర్గతం అయ్యింది. ఈ వాహనం యొక్క అధికారిక నామం ఇంకా బహిర్గతం కాలేదు మరియు దీని యొక్క కోడ్ నామం వైబిఏ గా ఉంది. ఈ వాహనం యొక్క ప్రారంభం, రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద జరిగే అవకాశం ఉంది మరియు ఈ వైబిఏ వాహనం, సబ్ 4 మీటర్ల ఎస్యువి విభాగం లో ఉన్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు ఇటీవల విడుదల అయిన మహింద్రా టియువి 300 వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది.
క్యాబిన్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహనంలో ఉండే సెంట్రల్ కన్సోల్ ను గనుక చూసినటైతే, ఎస్ క్రాస్ ప్రేరణ కనిపిస్తుంది. 7- అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ ను, ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో చూడవచ్చు. ఇటీవల విడుదల అయిన బాలెనో వాహనం లో ఉండే ఆపిల్ కార్ప్లే, వైబిఏ మోడల్ యొక్క సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా వేరియంట్లు కూడా ఈ ఆపిల్ కార్ప్లే తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాహనం లో ఉండే స్టీరింగ్ వీల్ ను, స్విఫ్ట్ / సియాజ్ / బాలెనో వాహనాల నుండి తీసుకోబడింది మరియు బాలెనో వాహనం వలే కాకుండా, ఎస్ -క్రాస్ లో ఉండే క్రూజ్ కంట్రోల్ స్విచ్చు ఈ విభాగం లో మొదటి సారిగా ఈ వాహనం తో రాబోతుంది. క్యాబిన్ లో ఉండే సెంట్రల్ కన్సోల్, ఒక కప్ హోల్డర్ ను కలిగి ఉంటుంది అలాగే ఆటో ఏసి కంట్రోల్ క్రింది భాగంలో ఒక నిల్వ స్థలం అందించబడుతుంది.
ఈ వాహనం యొక్క హెడ్ ల్యాంప్ల గురించి మాట్లాడటానికి వస్తే, ఎస్ క్రాస్ మరియు బాలెనో వాహనాలలో ఉండే బై జినాన్ ప్రొజక్టార్ ల్యాంప్ లను కలిగిన స్వెప్ట్ బేక్ హెడ్ ల్యాంప్లు ఈ వాహనానికి అందించబడతాయి. అంతేకాకుండా సైడ్ టర్న్ సూచికలు, ఫాగ్ ల్యాంప్ లతో అందించబడతాయి. గ్రిల్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహనం లో ఉండే గ్రిల్, కొత్త విటారా లో ఉండే గ్రిల్ ను పోలి ఉంటుంది. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ఈ వాహనానికి ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్ లు అందించబడతాయి అదే రిఫ్లెక్టార్ల విషయానికి వస్తే, వెనుక బంపర్ పై అందంగా పొందుపరచబడి ఉంటాయి. యాంత్రికంగా చెప్పాలంటే ఈ వాహనం, ప్రస్తుతం ఉన్న 1.3 లీటర్ డి డి ఐ ఎస్ 200 డీజిల్ ఇంజన్ తో ఎస్ హెచ్ వి ఎస్ అలాగే 1.2 లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.