eVX ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ ఇంటీరియర్ డిజైన్‌ను వెల్లడించిన Maruti Suzuki
మారుతి ఇ vitara కోసం rohit ద్వారా అక్టోబర్ 06, 2023 02:03 pm ప్రచురించబడింది
- 1K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో మారుతి సుజుకి నుండి వస్తున్న మొదటి EV, ఇది 2025లో విడుదల అవుతుందని అంచనా
-
ఇది ఆటో ఎక్స్ؚపో 2023లో భారతదేశంలో ఆవిష్కరించబడింది.
-
జపాన్ మొబిలిటీ షోలో మరింత అభివృద్ధి చేసిన వర్షన్ؚను ప్రదర్శించనున్నారు.
-
ఇంటీరియర్ؚ కొన్ని ఫీచర్‌లతో వస్తుంది; ఇందులో ప్రత్యేకంగా కనిపించే అంశాలలో ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే మరియు యోక్-వంటి స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
-
ఎక్స్‌టిరియర్‌లో ముందు మరియు వెనుక భాగంలో సవరించిన LED లైటింగ్ సెట్అప్ؚను పొందుతుంది.
-
క్లెయిమ్ చేసిన 550 కిమీ పరిధికి తగిన 60kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అంచనా.
-
భారతదేశంలో దిని ధరలు రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.
వచ్చే నెలలో జరగబోయే జపనీస్ మొబిలిటీ షో కంటే ముందే, కొత్త-జనరేషన్ సుజుకి స్విఫ్ట్ؚను కాన్సెప్ట్ రూపంలో ఇటీవలే చూశాము. ఈ కారు తయారీదారు మరింత మెరుగుపరచిన eVX ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ వర్షన్ؚను కూడా ప్రదర్శించనున్నారు. అయితే దీన్ని పూర్తి రూపాన్ని చూసే ముందే, దీని ఇంటీరియర్ ఫస్ట్‌లుక్ ఆన్‌లైన్‌లో కనిపించింది.
క్యాబిన్ؚలో చెప్పుకొదగిన అంశాలు
eVX కాన్సెప్ట్ క్యాబిన్ కొన్ని ఫీచర్‌లతో వస్తుంది, డ్యాష్ؚబోర్డు పైన ఉండే ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేలు (ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ మరియు ఇతర ఇన్ఫోటైన్మెంట్ కోసం మరొకటి) ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యాంశాలలో AC వెంట్ؚల కోసం ప్లేస్ హోల్డర్‌లు అయిన పొడవైన వర్టికల్ స్లాట్స్, యోక్ؚను తలపించే 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ మరియు డ్రైవ్ మోడ్ؚల కోసం సెంటర్ కన్సోల్ؚలో ఉన్న రోటరీ డయల్ నాబ్ కూడా ఉంది. అయితే, ఈ డిజైన్ ఎలిమెంట్ؚలు ఇలాగే ఉంటాయని ఆశించకూడదని తెలియచేస్తున్నాము, ఎందుకంటే ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమే మరియు ప్రొడక్షన్-స్పెక్ మోడల్ؚలో అనేక మార్పులు ఉండవచ్చు, ఇలాంటి మార్పులు ఇప్పటికే రహస్య చిత్రాలలో చుశాము.
వెలుపల ఏవైనా మార్పులు ఉన్నాయా?
దీని ఇటీవల మోడల్‌లో, ఈ ఎలక్ట్రిక్ SUVని నాజూకైన LED హెడ్‌లైట్ؚలు మరియు DRLలు, త్రికోణ ఎలిమెంట్‌లు మరియు ధృఢమైన బంపర్ؚలతో సవరించారు.
దీని ప్రొఫైల్ؚలో భారీ అలాయ్ వీల్స్ؚతో ధృఢమైన ఆర్చ్ؚలు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ؚ ఉన్నాయి. వెనుక వైపు, నవీకరించిన DRL లైట్ సిగ్నేచర్ؚను అనుకరించడం కోసం ఆకర్షణీయమైన 3-పీస్ లైటింగ్ ఎలిమెంట్ కనెక్టింగ్ టెయిల్‌లైట్ؚలను మరియు పెద్ద స్కిడ్ ప్లేట్ؚలను కలిగి ఉంది.
ఇది కూడా చూడండి: కొత్త Maruti స్విఫ్ట్ యొక్క నాల్గవ తరం ప్రివ్యూలు, కాన్సెప్ట్‌ను విడుదల చేసిన Suzuki Swift
ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ వివరాలు
ప్రొడక్షన్-స్పెక్ eVX మరియు దాని ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ వివరాలు ప్రస్తుతానికి తెలియదు. ఆటో ఎక్స్ؚపో 2023లో మారుతి సుజుకి, ఇది 550కిమీ వరకు క్లెయిమ్ చేసిన పరిధికి తగిన 60kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుందని వెల్లడించింది. eVX 4x4 డ్రైవ్ؚట్రెయిన్ కోసం డ్యూయల్-మోటార్ సెట్అప్ؚను కలిగి ఉంటుంది అని కూడా నిర్ధారించింది.
ఇది ఎప్పుడు విడుదల అవుతుంది?
సుజుకి eVXను భారతదేశంలో 2025 నాటికి ప్రవేశపెడుతుందని అంచన, దీని ప్రారంభ ధర సుమారు రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఇది MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి వాటితో పోటీ పడుతుంది, అలాగే ఖరీదైన మహీంద్రా XUV400 మరియు కొత్త టాటా నెక్సాన్ EVలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉన్న 10 అత్యంత చవకైన కార్‌లు: మారుతి బాలెనో, టాటా నెక్సాన్, కియా సెల్టోస్, మరియు ఇతరములు