Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అత్యంత శక్తివంతమైన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను పొందనున్న మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం dinesh ద్వారా మే 21, 2019 02:40 pm ప్రచురించబడింది

సియాజ్ తర్వాత, ఈ కొత్త అంతర్గత డీజిల్ ఇంజిన్ను అభివృద్ధి చేసిన రెండవ కారు, మారుతి ఎర్టిగా

  • మూడు వేరియంట్ రకాల్లో అందుబాటులో ఉంది: అవి వరుసగా విడిఐ, జెడ్డిఐ మరియు జెడ్డిఐ +.

  • 1.5 లీటర్ ఇంజిన్, 95 పిఎస్ శక్తిని మరియు 225 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

  • కొత్త ఇంజిన్, 6 ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.

  • 24.02 కెఎంపిఎల్ మైలేజ్ ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

  • దీని ధర రూ 9.86 లక్షల నుంచి రూ 11.20 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

  • 1.3 లీటర్ డీజిల్ వేరియంట్లు, స్టాక్స్ చివరి వరకు అందుబాటులో ఉంటాయి.

ఏప్రిల్ 2020 నుండి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయాలన్న తన ప్రణాళికలను ప్రకటించిన వెంటనే, మారుతి సుజుకి కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ను ఎర్టిగాలో ప్రవేశ పెట్టింది. ఈ ఎర్టిగా వాహనం, విడిఐ, జెడ్డిఐ మరియు జెడ్డిఐ + అను మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది రూ 9.86 లక్షల నుంచి రూ 11.20 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే లభిస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ తో 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పోల్చితే సంబంధిత రూట్లలో ఇది రూ. 30,000 ప్రీమియం ధరను కలిగి ఉంది. మారుతి సుజుకి ఎంపివి యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎల్డిఐ వేరియంట్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ను అందించడం లేదని గమనించాలి.

స్మార్ట్ హైబ్రిడ్ తో 1.3 లీటర్ డీజిల్

1.5 లీటర్ డీజిల్

ఎల్డిఐ

రూ 8.84 లక్షలు

నాట్ అవైలబుల్

విడిఐ

రూ. 9.56 లక్షలు

రూ 9.86 లక్షలు (+ 30 రూపాయలు)

జెడ్డిఐ

రూ. 10.39 లక్షలు

రూ 10.69 లక్షలు (+ 30 రూపాయలు)

జెడ్డిఐ +

రూ 10.90 లక్షలు

రూ 11.20 లక్షలు (+ 30 రూపాయలు)

* అన్ని ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీ

మన స్థానిక మారుతి సంస్థ, కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను తమ రెండవ కారు ఎర్టిగా లో అమర్చడం జరిగింది. సియాజ్ మార్చి 2019లో ఇటీవలే విడుదల అయిన మొదటి కారు. కొత్త ఇంజిన్ గరిష్టంగా 95 పిఎస్ శక్తిని మరియు 225 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇది, 1.3 లీటర్ యూనిట్ కంటే 5 పిఎస్ మరియు 25 ఎన్ఎమ్ ఎక్కువ పవర్ అవుట్పుట్ లను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఇంజన్ కొత్త 6 స్పీడ్ మాన్యువల్ టాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. పాత 1.3 లీటర్ ఇంజిన్, మరోవైపు 5 స్పీడ్ యూనిట్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంధన సామర్ధ్యానికి సంబంధించి, 1.5 లీటర్ యూనిట్ 24.20 కిలోమీటర్ల మైలేజ్ ను నిర్వహిస్తోంది, ఇది 1.3 లీటర్ యూనిట్ క్లెయిమ్ చేసిన దాని కంటే 1.27 కి.మీ తక్కువ మైలేజ్ ను అందిస్తుంది.

ఇంతలో, మారుతి సంస్థ- ఎర్టిగా యొక్క 1.3 లీటర్ డీజిల్ వెర్షన్ స్టాక్స్ ఉన్నంత వరకు అందించబడతాయని వివరించింది. డీజిల్ ఆధారిత ఎర్టిగా, 1.5 లీటర్ డీజిల్ యూనిట్ తో మాత్రమే అందుబాటులో ఉండనుంది, ఇది సుజుకి యొక్క స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ తో లభించదు.

ఇంజిన్ కాకుండా, ఎర్టిగా డీజిల్ లో వేరే ఏమీ మారలేదు. ఇది, 1.3 లీటర్ డీజిల్ వేరియంట్లతో దాని ఫీచర్ జాబితాను పంచుకుంటుంది మరియు భద్రతకు సంబంధించినంతవరకు ద్వంద్వ ఎయిర్బాగ్స్, ఎబిఎస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్, వెనుక పార్కింగ్ సెన్సార్స్ మరియు హై స్పీడ్ ఎలర్ట్ వ్యవస్థ వంటి అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లకు మద్దతిచ్చే 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పుష్ బటన్ స్టార్ట్ వంటి ఇతర ఫీచర్లు కూడా అందించబడ్డాయి.

ఎర్టిగా, కొత్త 1.5 లీటర్ డీజిల్ తో పరిమిత కాలంలో మాత్రమే లభ్యమవుతుంది. 1 ఏప్రిల్ 2020 నుండి అన్ని డీజిల్ ఆధారిత కార్లపై ప్లగ్ని తీసివేయాలని కార్ల తయారీదారు నిర్ణయించారు ఎందుకంటే ఇప్పుడు వాహనాలు బిఎస్6 ఎమిషన్ నిబంధనలను కలుసుకునేందుకు దాని ప్రస్తుత ఇంజిన్లను అప్గ్రేడ్ చేయడానికి అధిక వ్యయంతో కూడుకున్న పనిగా ఉంది, ఆర్థికంగా తక్కువగా ఉండటం. పెట్రోల్, డీజిల్ వేరియంట్ల మధ్య ధర వ్యత్యాసం రూ. 2.5 లక్షలకు చేరుకుంటుంది. దీంతో డీజిల్ కార్ల కోసం 2020 ఏప్రిల్లో డీజిల్ కార్లను తగ్గించాలని మారుతి సుజుకి భావిస్తున్నారు. అయితే, బిఎస్6 అవతార్ భవిష్యత్తులో ఒక బలమైన డిమాండ్ ఉండబోతుంది.

మరింత చదవండి: ఎర్టిగా డీజిల్

d
ద్వారా ప్రచురించబడినది

dinesh

  • 29 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి ఎర్టిగా 2015-2022

D
devrajan bhaskar
Sep 18, 2020, 10:29:41 AM

Has to have an option, diesel.

N
navgire somnath
Jun 30, 2020, 9:05:26 AM

Ertiga diesel model off nahi hone chahiye ,plz ,best family car hai ,no-1

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.10.44 - 13.73 లక్షలు*
Rs.10.52 - 19.67 లక్షలు*
Rs.2 - 2.50 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర