• English
  • Login / Register

మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ రూ. 5.99 లక్షల వద్ద విడుదల అయ్యింది

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం nabeel ద్వారా అక్టోబర్ 19, 2015 12:16 pm సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ (పునరుద్దరణ) ని రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూం) ధర వద్ద విడుదల చేయడం జరిగింది. ఇంతకు మునుపు ఈ కారుని గైకండో ఇండొనేషియా ఇంటర్‌నాషనల్ ఆటో షో లో ఆగస్టు లో ప్రదర్శించారు. హొండా మొబిలియో, రెనాల్ట్ లాడ్జీ వంటి వాటితో ఈ కారు పోటీని ఎదుర్కొంటుండగా, ఇంకా టొయోటా ఇన్నోవా ఈ విభాగంలో అమ్మకాల విషయంలో రాణిస్తోంది. దీనికి సాంకేతిక, రూప మరియూ లక్షణాల మార్పులతో మారుతీ వారు విడిదల చేస్తున్నారు. ఎస్‌హెచ్వీఎస్  DDiS200 (డీజిల్) లో ప్రామాణికంగా ఉంటుంది.

ఎస్‌హెచ్వీఎస్ స్ యొక్క ఇంధన సామర్ధ్యాన్ని 18% పెంచుతుంది. పెట్రోల్ K14B ఇంజిను కి కూడా మార్పులు అందడంతో ఇప్పుడు లీటరుకి 17.5 కిలోమీటర్లు అందిస్తుంది. ఇది మునుపటి కంటే 9 శాతం అధికం. ఈ ఎస్‌హెచ్వీఎస్ సిస్టం కి స్టార్ట్/స్టాప్ తో పాటు బ్రేక్ ఎనర్జీ పునరుత్పత్తి ఉంటుంది. డీజిలు ఇంజిను 90ps/200Nm ఇవ్వగా పెట్రోల్ వి 95ps/130Nm విడుదల చేస్తాయి. రెండిటికీ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియూ 4-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది. లక్షణాల పరంగా, ఇందులో 7 అంగుళాల స్మార్ట్ ప్లే ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం, ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ తో ఇంజిను పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, 50:50 మూడవ వరుస స్ప్లిట్, కొత్త అప్‌హోల్‌స్ట్రీ అందించడం జరిగింది.

ధరలు

వేరియంట్ (పెట్రోల్) (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

వేరియంట్ ధర
ఎల్ఎక్స్ఐ రూ. 5,99,907
ఎల్ఎక్స్అ (ఆప్షన్) రూ. 6,35,339
వీఎక్స్ఐ రూ. 7,26,257
జెడ్ఎక్స్ఐ రూ. 7,85,561
జెడ్ఎక్స్ఐ + రూ. 8,42,572
వీఎక్స్ఐ ఏటీ. రూ. 8,26,257

వేరియంట్ (డీజిల్) (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

వేరియంట్ ధర
స్మార్ట్ హైబ్రిడ్ ఎల్‌డీఐ రూ. 7,55,826
స్మార్ట్ హైబ్రిడ్ ఎల్‌డీఐ (ఆప్షన్) రూ. 7,62,778
స్మార్ట్ హైబ్రిడ్ వీడీఐ రూ. 8,26,300
స్మార్ట్ హైబ్రిడ్ జెడ్‌డీఐ రూ. 8,82,540
స్మార్ట్ హైబ్రిడ్ జెడ్‌డీఐ + రూ. 9,25,358
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience