• English
  • Login / Register

మారుతీ ఎస్- క్రాస్ యొక్క అధికారిక బుకింగ్స్ మొదలు అయ్యాయి

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం saad ద్వారా జూలై 09, 2015 11:53 am సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:   క్రాస్ ఓవర్లు మరియూ ఎస్ యూ వీ లు రోజు రోజుకి మార్కెట్లో పుంజుకుంటున్నయి. అందుకు తయారీదారులు ఈ విషయంలో ఎటువంటి అవకాశాన్నీ వదులుకోవట్లేదు.  ఈ సరైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో మారుతీ తన మొట్ట మొదటి క్రాస్ ఓవర్ ఎస్-క్రాస్ ని ప్రవేశ పెట్టనుంది.  ఈ విషయమై కథనాలు వినిపిస్తున్న తరుణంలోనే మారుతీ క్రాస్ ఓవర్ యొక్క అధికారిక బుకింగ్స్ కి శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.11,000 వేల కి గాను దేశ వ్యాప్తంగా డీలర్లు బుకింగ్స్ ని స్వీకరిస్తున్నరు.

రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్,నిస్సాన్ టెర్రనో లాటి దిగ్గజాలకే కాకుండ, ఈ క్రాస్ ఓవర్ ఇప్పుడు రాబోయే హ్యుండై క్రేటా కి పోటీగా నిలవనుంది. ఈ కారుకి ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్స్, ఎల్ ఈ డీ ల్యాంప్స్ మరియూ 16 అంగుళాల రేడియల్స్ ఉంటాయి. లోపలి భాగాలన్ని నలుపు వర్ణంలో తీర్చిదిద్ది ఉండటంతో పాటుగా ఏసీ వెంట్స్ కి క్రోము పూత ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ ఎయిర్ కండిషనర్ మరియూ బ్లూటూత్ కనెక్టివిటీ/యూ ఎస్ బీ ని కలిగిన 7 అంగుళాల స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము ఉంటాయి.

ఇంజను విషయానికి వస్తే కేవలం ఇది డీజిలు లో మాత్రమే లభ్యం అవుతుంది. 1.6 లీటరు ఇంజిను కలిగినవి దాదాపుగా 120పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తే ఫియట్ ఆధారితమైన 1.3 లీటరు డీజిలు ఇంజిను 90పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇవి 5 స్పీడు మరియూ 6 స్పీడ్ మాన్యూల్ ట్రాన్స్మిషన్లలో లభ్యం అవుతాయి. నిరుత్సాహ పరిచే విషయం ఎమిటంటే, మారుతీ ఈ క్రాస్ ఓవర్ ని ఆటోమాటిక్ లో కాని ఏడబ్ల్యూడీ మోడలులో కాని అందించకపోవడం.

was this article helpful ?

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience