• English
  • Login / Register

రూ. 24.79 లక్షల ధరతో విడుదలైన మారుతి ఇన్విక్టో

మారుతి ఇన్విక్టో కోసం tarun ద్వారా జూలై 07, 2023 10:41 am సవరించబడింది

  • 75 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మునుపెన్నడూ లేనంత అత్యంత ప్రీమియం ధర కలిగిన మారుతి, దృఢమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది

Maruti Invicto Frontగ్లోబల్ పార్టనర్‌షిప్ నుండి వచ్చిన సరికొత్త మోడల్- మారుతి ఇన్విక్టో, అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశించింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్, మారుతి నుండి విడుదలైన కొత్త ప్రీమియం MPV దాని సవరించిన గ్రిల్, టెయిల్‌ల్యాంప్‌లు మరియు కొత్త క్యాబిన్ థీమ్‌తో విభిన్నంగా కనిపిస్తుంది. దీని ధర రూ. 24.79 లక్షల నుండి రూ. 28.42 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది అలాగే దీనిని జీటా+ మరియు ఆల్ఫా+ వేరియంట్‌లలో ఎంచుకోవచ్చు. వేరియంట్ వారీగా ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

వేరియంట్స్

ధర

జీటా+ 7-సీటర్

రూ. 24.79 లక్షలు

జీటా+ 8-సీటర్

రూ. 24.84 లక్షలు

ఆల్ఫా+ 7-సీటర్

రూ. 28.42 లక్షలు

పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్

ఆల్ఫా+ మరియు జీటా+ వేరియంట్‌లు రూ. 3.63 లక్షల భారీ వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి.

ఏ ఏ అంశాలు అందించబడుతున్నాయి?

Maruti Invicto Interior

ఇన్నోవా హైక్రాస్ మూలాలను బట్టి, మారుతి ఇన్విక్టో కూడా అదే విధమైన ప్రీమియం లక్షణాలను పొందుతుంది, వీటిలో చాలా వరకు భారతీయ బ్రాండ్‌కు మొదటిసారిగా ఇవ్వబడ్డాయి. ఇందులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్‌లు మరియు 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్విక్టోలో పనోరమిక్ సన్‌రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు లెదర్ అప్‌హోల్స్టరీ వంటి అంశాలు కూడా అందించబడతాయి. హైక్రాస్‌తో పోలిస్తే, దీనిలో JBL సౌండ్ సిస్టమ్ మరియు పవర్‌తో కూడిన రెండవ వరుస ఒట్టోమన్ సీట్లు అందుబాటులో లేవు.

టయోటా ఎమ్‌పివితో పోలిస్తే ఇంటీరియర్ లేఅవుట్‌లో ఎటువంటి మార్పు లేదు, అయితే లోపలి రంగు చెస్ట్‌నట్ బ్రౌన్ నుండి బ్లాక్‌కి మారింది.

మెరుగైన భద్రత

Maruti Invicto Safety

ఇన్విక్టో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX ఎంకరేజ్‌లు, ముందు అలాగే వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి అంశాలను కలిగి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దాని తోటి వాహనం అయిన ఇన్నోవా హైక్రాస్‌లో అందించబడే ADAS ఫీచర్ దాటవేయబడింది.

కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్

Maruti Invicto Hybrid Powertrain

మారుతి యొక్క మొట్టమొదటి బలమైన హైబ్రిడ్ ఎంపిక ఏమిటంటే గ్రాండ్ విటారాలో ఉన్న ఎలక్ట్రిక్ మోటారుతో కూడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్. అదే ఇన్విక్టో విషయానికి వస్తే పెద్ద 2-లీటర్ ఇంజన్ యూనిట్‌తో వస్తుంది, ఈ ఇంజన్ 186PS మరియు 206Nm పవర్, టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇది e-CVT ఆటోమేటిక్‌తో మాత్రమే జత చేయబడింది. ఈ హైబ్రిడ్ సెటప్ 23.24kmpl ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది, ఇది అందరిని ఆకట్టుకునేలా చేస్తుంది.

ఇన్విక్టో కోసం ఇన్నోవా హైక్రాస్ నుండి నాన్-ఎలక్ట్రిఫైడ్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికను దాటవేయబడినట్లు కనిపిస్తోంది.

ప్రత్యర్థులు

మారుతి ఇన్విక్టో కూడా ఇప్పుడు, టయోటా ఇన్నోవాకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేకుండా తరతరాలుగా అదే స్థానంలో ఎలా అయితే కొనసాగుతుందో అదే విధంగా తన స్థానాన్ని కొనసాగిస్తుంది. టాటా సఫారిMG హెక్టర్ ప్లస్మహీంద్రా XUV700 మరియు హ్యుందాయ్ అల్కాజార్ వంటి మూడు-వరుసల SUVలకు ప్రత్యామ్నాయంగా ఉంది అలాగే కియా క్యారెన్స్ కి ప్రీమియం ప్రత్యామ్నాయంగా కొనసాగుతుంది. మారుతి ఎమ్‌పివికి దాని డోనర్ కారు అయిన ఇన్నోవా హైక్రాస్ మాత్రమే పోటీదారు.  

was this article helpful ?

Write your Comment on Maruti ఇన్విక్టో

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience