• English
  • Login / Register

BSVI, క్రాష్ టెస్ట్ నార్మ్స్ కి అనుగుణంగా మహీంద్రా బొలేరో

మహీంద్రా బోరోరో 2011-2019 కోసం sonny ద్వారా మార్చి 11, 2019 06:16 pm ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mahindra Bolero To Meet BSVI, Crash Test Norms

  • భద్రతా నిబంధనలతో కట్టుబడి ఉండటానికి, మహింద్రా EBD తో ABS,ఎయిర్‌బ్యాగ్స్,స్పీడ్ అలర్ట్ సిష్టం మరియు రేర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి లక్షణాలతో నవీకరించబడుతుంది.
  • ది ప్రస్తుతం రెండు BSVI డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది.ఒకటి 2.5 లీటర్ యూనిట్ మరియు పవర్ + మోడల్ కోసం మరింత శక్తివంతమైన 1.5 లీటర్ మోటర్.

  • ఇది స్కార్పియోతో పాటు మహీంద్రా యొక్క మరింత జనాధారణ పొందిన SUV లలో ఒకటిగా ఉంది.

మహింద్రా యొక్క ప్రొడక్ట్స్ లో చాలా SUV లు వివిధ సైజులు మరియు నిర్మాణాలతో డైవర్స్ మార్కెట్ కి అనుగుణంగా వాటి అవసరాలకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ SUV లు మధ్య మహింద్రా బొలేరో దగ్గర రెండు దశాబ్ధాల వయసు అయినా  కూడా, రాబోయే భద్రతా లక్షణాలతో మరియు ఎమిషన్ నార్మ్ తో భవిష్యత్తు మోడల్ గా దారితీస్తుంది. అయితే మహింద్రా సంస్థ BSVI ఇంజన్ అమర్చడానికి మరియు క్రాష్ టెస్ట్ నార్మ్ లో కూడా ఉత్తీర్ణత పొందే విధంగా తయారుచేసేందుకు దాని ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

 Mahindra Bolero To Meet BSVI, Crash Test Norms

ఇటీవల ఇంటర్వ్యూలో మహింద్రా MD డాక్టర్ పవన్ గొయెంకా మాట్లాడుతూ, బొలేరో యొక్క అమ్మకాల గురించి, ఖ్యాతి గురించి మరియు రాబోయే విధివిధానాలకు తగ్గట్టుగా దీనిని ఏ విధంగా నవీకరించాలి అనుకుంటున్నారో దానికి వారి ఆలోచలను తెలిపారు. ప్రస్తుతం బొలేరో BSVI 2.5 లీటర్ m2DiCR డీజిల్ ఇంజిన్ తో అమ్ముడుపోతుంది. ఈ ఇంజన్ 63Ps పవర్ ను మరియు 195Nm టార్క్ ని అందిస్తుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో అమర్చబడి ఉంది. బొలెరో పవర్+ మోడల్ కూడా ఉంది, ఇది 1.5 లీటర్ mHawkD70 ఇంజన్ తో అమర్చబడి ఉంటుంది మరియు ఇది 71Ps పవర్ ను మరియు 195Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.  

తయారీదారులు జనవరి 2020 లో BSVI మోడల్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. కానీ దానికంటే ముందు బొలేరో ని రాబోయే అక్టోబర్ 2019 లో అమలు చేయబోయే కార్ష్ టెస్ట్ నార్మ్ కి అనుగుణంగా నవీకరించాల్సి ఉంది. అయితే నార్మ్ కి అనుగుణంగా జులై 2019 లోపు దీనిలో ABS,రేర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు స్పీడ్ అలర్ట్ సిష్టం కలిగి ఉండాలి.

Mahindra Bolero Power+ Review

మహింద్రా బొలేరో ప్రస్తుతం రూ.7.37 లక్షల నుండి రూ.9.38 లక్షలు (ఎక్స్-షోరూం, డిల్లీ)ధరను కలిగి ఉంది. అయితే బొలేరో పవర్+ రూ.7.15 లక్షల నుండి రూ.8.51 లక్షలు(ఎక్స్-షోరూం, డిల్లీ) మధ్య ధరను కలిగి ఉంది. ఈ నవీకరణలతో బొలేరో మరింత ఖరీదు ఉంటుందని ఊహిస్తున్నాము.

was this article helpful ?

Write your Comment on Mahindra బోరోరో 2011-2019

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience