• English
  • Login / Register

KUV100 మరియు స్కార్పియో మిశ్రమ అమ్మకాల సంఖ్య కంటే ఎక్కువ ఉన్న మహీంద్రా బొలెరో అమ్మకాలు

మహీంద్రా బోరోరో 2011-2019 కోసం dhruv attri ద్వారా మార్చి 11, 2019 06:03 pm ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mahindra Bolero Power+ Review

SUV లకు క్రేజ్ ఉన్నప్పటికీ ఇటీవలే వేగం పుంజుకుంది, మహీంద్రా బొలెరో 18 సంవత్సరాల క్రితం విడుదలైనా కూడా అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయింది.ఈ ప్రక్రియలో, అది ఒక మిలియన్ అమ్మకాల మైలురాయిని సాధించింది. వాస్తవానికి, ఇది 2005-06 నుండి ప్రారంభించి వరుసగా 10 సంవత్సరాలుగా ఉత్తమంగా అమ్ముడయ్యే ప్యాసింజర్ వాహనాల జాబితాలో ఉంది.

కఠినమైన మరియు భారీ లుక్ ఉన్నఈ SUV ప్రతీ సంవత్సరం 23 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది, మరియు అదే కాలంలో ఇతర కారుల SUV విభాగంలో 17 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి, మార్చి 2018 నాటికి బొలెరో అమ్మకాలు గణాంకాలు 9,104 యూనిట్లుగా ఉన్నాయి, ఇది KUV100 మరియు స్కార్పియో యొక్క మిశ్రమ అమ్మకాల సంఖ్య కంటే ఎక్కువ. ఈ KUV100 మరియు స్కార్పియో కారులు మహీంద్రా యొక్క ఉత్పత్తి జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన SUV లు. మారుతి సుజుకి విటారా బ్రెజా, హ్యుందాయ్ క్రెటా వంటి ప్రముఖ SUV మోడళ్లు మార్చి, 2018 లో 13,147 మరియు 10,011 యూనిట్లు విక్రయించబడ్డాయి.

Mahindra Bolero Power+ Review

అయితే బ్రెజ్జా మరియు క్రెటా మంచి లక్షణాలతో దాని ధరకు న్యాయం చేస్తాయి మరియు దాని గొప్ప లక్షణాల కారణంగా అత్యధిక అమ్మకాలను చోటు చేసుకున్నాయి. అయితే బొలేరో దాని సరళత్వం మరియు సులభమైన నిర్వహణ ఉండడం వలన అన్ని అమ్మకాలను చోటు చేసుకోగలిగింది. ఈ అమ్మకాలకు కారణం సేల్స్ మరియు మార్కెటింగ్ యొక్క కారు తయారీదారుల నిపుణుడు విజయ్ రామ్ నక్రా వివరించిన విధంగా మహింద్రా భారతదేశంలో గ్రామీణ మరియు పాక్షిక పట్టణ వాసుల ఉనికిని సంగ్రహించింది. విజయ్ రామ్ నక్రా ఏమాన్నారంటే "ఈ బొలేరో భారతదేశంలో టాప్ 10 ప్రయాణీకుల వాహనాల్లో తన స్థానాన్ని తిరిగి పొందింది, దీనివలన భారతదేశంలో పాక్షిక పట్టణ ప్రాంతాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో ఈ బ్రాండ్ ని ఎంతగా ఆధరిస్తున్నారో తెలుస్తుంది తద్వారా మాకు విశ్వాసం పెరిగింది.అంతేకాక, SUV విభాగంలో అనేక కొత్త ప్రారంభాలు ఉన్నప్పటికీ, బొలెరో పవర్+ యొక్క విజయవంతమైన ప్రయోగం బ్రాండ్ ని క్రమంగా పెరుగుతూ ఉండేందుకు సహాయపడింది." ఈ విధంగా విజయ్ రామ్ నక్రా తెలిపారు.


మహీంద్రా బోలెరో పవర్ + ను సృష్టించేందుకు 2016 లో అత్యధికంగా అమ్ముడుపోయిన SUV ను తగ్గించింది, ఇది ఒక చిన్న 1.5-లీటర్  BSIV- కంప్లైంట్ డీజిల్ ఇంజన్ కలిగిన ఒక సబ్ -4 మీటర్ వెర్షన్ మరింత శక్తితో (70Ps) మరియు రూ.6.85 లక్షల రూపాయల నుంచి ప్రారంభమైన పోటీ ధరని కలిగి ఉంది. ఇది సంబంధిత బోలెరో మోడల్ కంటే దాదాపు లక్ష రూపాయలు తక్కువ.

పాక్షిక పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలుగా ప్రాధమిక మార్కెట్ ఉన్నప్పటికీ, సిటీ కాంపాక్ట్ బడ్జెట్ SUV కోసం చూస్తున్నవారికి బోలోరో మంచి ఎంపిక మరియు ఫ్యామిలీ తో రోడ్ ట్రిప్ లు అవి వెళ్ళడానికి బాగుంటుంది.

was this article helpful ?

Write your Comment on Mahindra బోరోరో 2011-2019

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience