ఉత్పత్తి విస్తరణకై మహింద్ర మరియూ మహింద్ర వారు రూ.7500 కోట్లని వెచ్చించనున్నారు

మహీంద్రా క్వాంటో కోసం sourabh ద్వారా జూన్ 25, 2015 11:33 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఆటోమోటివ్ మరియు ట్రాక్టర్ రంగాల విస్తరణకై మహింద్ర గ్రూపు వారు వచ్చే మూడు సంవత్సరాలలో దాదాపు రూ.7,500 కోట్ల ను వెచ్చిస్తున్నట్టు సమాచారం.  మొస్తరుగా సంవత్సరానికి రూ.2,500 కోట్లు ఖర్చుతో ఎస్యూవీలు, టూ వీలర్స్, కమర్షియల్ వాహనాలు మరియూ ట్రాక్టర్లను కలిగిన వారి ఆటో మరియూ ఫార్మ్ సామాగ్రి వ్యాపారం లో పెట్టుబడి పెట్టనున్నారు. ఈ తాజా పెట్టూబడితో కంపెనీ వారు ఎన్నో విభాగాలకు గాను ఒక నూతన ఉత్పత్తి వేదికను ప్రవేశపెట్టనున్నారు. 

కొత్త ఇంటర్మీడియట్ కమర్షియల్ వాహనాలు మరియూ మధ్యస్థ కమర్షియల్ వాహనాల వేదికలపై ఈ కంపెనీ మొత్తం రూ.300 కోట్లను  పెట్టి 2017 సంవత్సరం కొరకు గాను ఎన్నో ఉత్పత్తులను అభివృద్ధి చేయనున్నారు. 

మహింద్ర మరియూ మహింద్ర గ్రూపు యొక్క ప్రెసిడెంట్ అయిన పవన్ గోయెంకా వారు " కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడంలో జాప్యం జరిగింది. అందుకు గాను మా అమ్మకాలు నెమ్మదించాయి అన్నది వాస్తవం. కాని ఇప్పుడు  మేము పుంజుకుని కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడంలో జోరు అందుకున్నము" అని అన్నారు.

ఈమధ్య కాలంలో కంపెనీ వారు వారి కొత్త కమర్షియల్ జెట్టో ని రూ.2.32 లక్షలకు విడుదల చేయడం జరిగింది. ఈ జెట్టా  ప్రాజెక్టులో ఇప్పటికే రూ.300 కోట్లు వేదికకై మరియూ యంత్ర సామాగ్రికై వెచ్చించడం అయ్యింది.

మిస్టర్ గొయెంకా మాట్లాడుతూ, "రూ.7500 కోట్ల  పెట్టుబడి రెండు కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ వేదికలే కాకుండా కొత్త ఇంటర్మీడియెట్ కమర్షియల్ వాహనాలను మరియూ మధ్యస్థ కమర్షియల్ వాహనాలను ఏర్పరుస్తుంది" అన్నారు.

ఎస్యూవీ విభాగాన్ని ఏలుతున్న ఈ కంపెనీ, ఇటీవల వారి  అత్యధిక అమ్మకాలు కలిగిన స్కార్పియో మరియూ  ఎక్స్ యూ వీ 500 ఎస్యూవీలకు గాను ఫేస్లిఫ్ట్ వెర్షన్ ని విడుదల చేసింది. గత మే నెలలో 37,869 యూనిట్ల  అమ్మకాలు అయితే, ఈ సంవత్సరం మే నెలలో 36,706 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా క్వాంటో

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience