• English
  • Login / Register

#LiveFromFrankfurtMotorShow : ఆరంగేట్రం చేసిన కొత్త బిఎండబ్లు ఎక్స్1 మరియు 7 సిరీస్

బిఎండబ్ల్యూ ఎక్స్1 2015-2020 కోసం manish ద్వారా సెప్టెంబర్ 15, 2015 06:12 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఎంతగానో ఎదురు చూస్తున్న 2016 బిఎం డబ్లు ఎక్స్1 ఆటో మొబిల్ -ఆస్స్టిలాంగ్ అనగా ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ఆరంగేట్రం చేసింది. ఈ కొత్త ఎక్స్1 చూడడానికి ఎక్స్5 ఎస్యువి లా ఉంది.  ఈ సౌందర్య నవీకరణ బిఎండబ్లు మొదటి తరం ఎక్స్1  కోల్పోయిన వినియోగదారుల ఆకర్షణను గెలుచుకునేందుకు కీ కారకం లా పనిచేస్తుంది. ఈ కొత్త ఎక్స్1 ముందరి వీల్ డ్రైవ్ యుకె ఎల్ ఫ్లాట్ఫార్మ్ ని కలిగి ఉంటుంది. ఈ లక్షణాన్ని మినీ లైనప్ లో కూడా కనుగొనవచ్చు. ఈ ఎక్స్1 యొక్క బాహ్య స్వరూపాలు స్పోర్టీరియర్ బంపర్ మరియు డీఅర్ ఎల్ కరోనా రింగ్స్ తో ఎల్ ఇడి హెడ్లైట్స్ ని కలిగి ఉంటుంది.     

హుడ్ క్రింద, కొత్త ఎక్స్1 2.0 లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో రెండు వేరియంట్స్ లో అందించబడి 189.4bhp శక్తిని మరియు  227.9bhp శక్తిని అందిస్తుంది. దీని డీజిల్ వేరియంట్ 2.0 లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్ టర్బో డీజిల్ తో 3 వివిధ టార్క్ ఉద్గాతాలు  330 ఎన్ఎమ్ , 400 ఎన్ఎమ్ మరియు 450 ఎన్ఎమ్ లను అందిస్తుంది. దీని ప్రవేశ స్థాయి వేరియంట్స్ అయిన  ఎక్స్1 ఎస్ డ్రైవ్ 16డి (114.4bhp) మరియు ఎక్స్1 ఎస్ డ్రైవ్ 18ఐ (134.2 bhp) బహుశా 2016 లో భారతదేశంలోనికి రావచ్చు.      

 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో కొత్త 7 సిరీస్ కూడా అడుగు పెట్టింది. ఈ కారు చురుకైన  కిడ్నీ గ్రిల్ మరియు కనిపించే గాలి ఫ్లాప్ నియంత్రణ లక్షణాన్ని కలిగి ఉంది. దీని హెడ్లైట్స్ మరియు టెయిల్ లైట్స్ ఎల్ ఇడి యూనిట్ల లక్షణాన్ని కలిగి ఉంది. కారు ప్రక్కభాగంలో ఎల్-ఆకారపు క్రోం స్టిప్ ని కలిగి ఉంటుంది. కొత్త బిఎండబ్లు 7 సిరీస్ 4.4 లీటర్, ట్విన్-టర్బో వి8 శక్తితో 750ఐ లో  445bhp శక్తిని అందిస్తుంది. కారు  3.0 లీటర్, ట్విన్-టర్బో వి6 పెట్రోల్ ఎంపికతో 740ఐ లో  320hp శక్తిని మరియు  3.0-లీటర్, ట్విన్-టర్బో డీజిల్ 730డి కొరకు 261hp శక్తిని అందిస్తుంది. 740ఇ ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ గా వస్తుంది మరియు ఒక 2.0-లీటర్, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ శక్తితో మరియు ఒక విద్యుత్ డ్రైవ్ యునిట్ తో వస్తుంది. దీనిలో అన్ని వేరియంట్లు 8 స్పీడ్ స్పోర్ట్ ఆటోమేటిక్ స్టెప్ట్రోనిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.

was this article helpful ?

Write your Comment on BMW ఎక్స్1 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience