• English
  • Login / Register

నటుడు రణ్‌బీర్ కపూర్ గ్యారేజ్‌లోకి Lexus LM

లెక్సస్ ఎలెం కోసం ansh ద్వారా జూన్ 05, 2024 08:57 pm ప్రచురించబడింది

  • 31 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

లెక్సస్ LM, 7-సీటర్ లగ్జరీ MPV, 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది మరియు మీరు కోరుకునే ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

Ranbir Kapoor Purchases A Lexus LM

బాలీవుడ్ నటుడు మరియు యానిమల్, బ్రహ్మాస్త్ర, మరియు యే జవానీ హై దీవానీ వంటి చిత్రాల స్టార్ రణ్‌బీర్ కపూర్ లెక్సస్ LM లగ్జరీ MPV కారును కొనుగోలు చేశారు. దీనికంటే ముందు, రణ్‌బీర్ కపూర్ 5 కోట్ల రూపాయల విలువైన బెంట్లీ కాంటినెంటల్ GT ని కూడా కొనుగోలు చేశారు. రణ్‌బీర్ లెక్సస్ LM సోనిక్ టైటానియం షేడ్‌లో ఉంది. ఈ లగ్జరీ ఎల్ఎమ్ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

A post shared by Rajkumar Pathak (@rajkumarpathak330)

పవర్ట్రైన్

Lexus LM e-CVT

LM 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ సెటప్‌తో పనిచేస్తుంది, ఇది 250 PS పవర్ అవుట్‌పుట్ కలిగి ఉంటుంది. హైబ్రిడ్ సిస్టమ్ e-CVT గేర్‌బాక్స్‌ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.

సీటింగ్ కెపాసిటీ

Lexus LM Seating Configurations

లెక్సస్ LM రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది: 4 సీటర్ మరియు 7 సీటర్. దీని 4 సీటర్ వెర్షన్‌లో వెనుకవైపు ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ మరియు 2-రో పార్టీషన్ ఉన్నాయి, అయితే 7-సీటర్ వెర్షన్‌లో రెండవ రోలో లాంజ్ సీటు మరియు మూడవ రోలో బెంచ్ సీటు ఉన్నాయి. ప్రస్తుతానికి రణ్‌బీర్ కపూర్ 4 సీటర్ వెర్షన్ కొన్నారా లేక 7 సీటర్ వెర్షన్ కొన్నారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

ఫీచర్లు & భద్రత

Lexus LM Rear Seat Entertainment

ఈ లగ్జరీ MPV కారులో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 23-స్పీకర్ మార్క్ లెవిన్‌సన్ సౌండ్ సిస్టమ్, 48-అంగుళాల రేర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ మరియు రేర్ సీట్లు ఉన్నాయి. స్టీరింగ్ వీల్ వంటి హీటెడ్ ఫ్రంట్ మరియు రేర్ సీట్లు అందించబడ్డాయి.

ఇది కూడా చదవండి: రూ.71.17 లక్షలకు లెక్సస్ NX 350h ఓవర్ట్రైల్ విడుదల

ప్రయాణీకుల భద్రత కోసం, Lexus LMలో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు అందించబడ్డాయి. అంతే కాక ఇందులో, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్డ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ధర & ప్రత్యర్థులు

Lexus LM

లెక్సస్ LM ధర రూ. 2 కోట్ల నుండి రూ. 2.5 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీనిని BMW X7 మరియు మెర్సిడెస్ బెంజ్ GLS వంటి త్రీ-రో SUVలకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.

మరింత చదవండి: లెక్సస్ LM ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Lexus ఎలెం

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience