• English
  • Login / Register

వెల్లడి: ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ మరియూ లక్షణాల వివరాలు

మారుతి ఎర్టిగా 2015-2022 కోసం manish ద్వారా సెప్టెంబర్ 30, 2015 01:47 pm ప్రచురించబడింది

  • 19 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: దేశం యొక్క అతి పెద్ద కారు తయారీదారి 2015 మారుతీ సుజూకీ ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ విడుదల అక్టోబరు 10న చేసేందుకై సిద్దం అయ్యారు. ఒక తయారీ వెర్షన్ గైకండో ఇండొనేషియా అంతర్జాతీయ ఆటో షో లో ఈ ఏడాది ఆగస్టులో ప్రదర్శితమైంది మరియూ భారతీయ వెర్షన్ దీనిని పోలి ఉంటుంది.

అసలైన ఎర్టిగా MPV 2012 లో విడుదల అయినప్పుడు, కొద్ది నెలలలోనే ఆకర్షణీయమైన బుకింగ్స్ ని పొందింది. ఈరోజు, ఆన్లైన్ లో కొత్త ఎర్టిగా వేరియంట్స్ మరియూ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి.

ఎర్టిగా L: పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, మాన్యువల్ AC, డ్రైవర్-సైడ్ ఎయిర్ బ్యాగ్ మరియూ సీట్ బెల్ట్ రిమైండర్ బజర్

ఎర్టిగా L (O) : L వేరియంట్ లక్షణాలు + ప్రిటెన్షనర్ , ఫోర్స్ లిమిటర్, ఫ్రంట్ ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగ్, ABS మరియూ EBD

ఎర్టిగా V : L (O) వేరియంట్ లక్షణాలు + ఆడియో సిస్టం తో బ్లూటూత్, USB, ఆగ్జ్-ఇన్ మరియూ CD, అనుసంధానం గల ఎంట్రీ, రేర్ AC, రివర్స్ పార్కింగ్ సెన్సర్, ఫ్రంట్ మరియూ రేర్ పవర్ విండోస్,50:50 స్ప్లిట్ మూడవ వరుస సీట్లకి మరియూ రెండవ వరుసకి పవర్ సాకెట్.

ఎర్టిగా Z : V వేరియంట్ లక్షణాలు + అల్లోయ్ వీల్స్, హైట్-అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, రేర్ వైపర్ మరియూ డీఫాగర్. 

ఎర్టిగా Z+ : Z వేరియంట్ లక్షణాలు + రివర్స్ పార్కింగ్ క్యామెరా, స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఎంటర్‌టెయిన్మెంట్ సిస్టం మరియూ స్మార్ట్ కీ తో ఇంజిను స్టార్టర్ బటన్

పెట్రోల్ V వేరియంట్ కి 4-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో పాటు 5-స్పీడ్ మాన్యువల్ కూడా అందిస్తారు. మారుతీ వారు SHVS (సుజూకీ వారి స్మార్ట్ హైబ్రీడ్ వెహికల్) మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ ని డీజిల్ వేరియంట్ లో అందిస్తారు. ఇది సియాజ్ సెడాన్ లో మొదటి సారిగా అందంచబడింది.

was this article helpful ?

Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience