ల్యాండ్ రోవర్ వారి చివరి డిఫెండర్ వాహనం వెలువడింది
published on ఫిబ్రవరి 02, 2016 09:43 am by sumit కోసం ల్యాండ్ రోవర్ డిఫెండర్
- 7 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జాగ్వార్ ల్యాండ్ రోవర్ మూడు సంవత్సరాల క్రితం 2013 లో అధికారికంగా ప్రకటించబడింది, ఇది సోలిహుల్ (ఇంగ్లాండ్ సెంట్రల్) దాని కారు ప్లాంట్లో డిఫెండర్ ఉత్పత్తిని నిలిపి వేస్తుంది. ఇప్పుడు కారు యొక్క చివరి యూనిట్ దాని ఉత్పత్తి కర్మాగారం నుండి వచ్చింది మరియు వినియోగదారులు ఇకపై డిఫెండర్ స్వంతం చేసుకొనేందుకు ఎక్కువ సమయం వేచి ఉండనవసరం లేదు. అయినప్పటికీ, కార్ల ఉత్పత్తి సంస్థ అదే నమూనా భర్తీ పైన పనిచేస్తుంది.
ఈ కఠినమైన నిర్ణయం ల్యాండ్ రోవర్ ఉద్గార మరియు భద్రతా ప్రమాణాలను అందుకునే సమయంలో వచ్చింది. ఈ కారు పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరగడం లేదు, ఇది తరువాత ల్యాండ్ రోవర్ ప్రమాణాలను నిర్వహించడానికి కష్టం అవుతుంది. " వారికి సురక్షిత వాహనాలు, ఎయిర్బ్యాగ్స్ తో ఉన్న వాహనాలు, తక్కువ ఇంధన ఉద్గారాలు ఉన్న వాహనాలు కావాలనుకుంటారు. ఈ వాహనం రైతుల కొరకు అని ఈ నిర్ణయాన్ని న్యూస్ నెట్వర్క్ వివరిస్తూ ల్యాండ్ రోవర్ మంత్లి మగజైన్ డిప్యూటీ ఎడిటర్"పాట్రిక్ క్యూరీవేగన్ తెలిపారు. ఈ పారంపర్య 4x4అభిమానులు నిరుత్సాహపడనవసరం లేదు, 70 శాతం ల్యాండ్రోవర్ వాహనాలు ఇంకా రోడ్ పైన ఉన్నాయి. అంటే వారు ఇప్పటికీ సెకెండ్ హ్యాండ్ డిఫెండర్ ని కలిగి ఉండవచ్చని నిర్ధారిస్తుంది.
" దాదాపు 70% ల్యాండ్ రోవర్లు తయారుచేయబడినవి, రోడ్లపైన మనకి కనిపిస్తున్నపటికీ డిఫెండర్ వాహనాన్ని నిలిపివేయడం పురస్కరించుకొని ఈ వాహన అభిమానులు కన్నీరు కారుస్తారు." అని క్వెటిన్ విల్సన్ ఒక ప్రఖ్యాత ఆటోమొబైల్ పాత్రికేయులు అన్నారు.
జాగ్వార్ వారు తమ మొట్టమొదటి డిఫెండర్ 1948 లో ప్రారంభించిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 2 మిలియన్ల వాహనాలు ఉత్పత్తి చేసారు. ఈ వాహనం తన యొక్క పేరు ప్రఖ్యాతలను హాలీవుడ్ చిత్రాలు అయిన స్కైఫాల్ మరియు ఎడ్జ్ ఆఫ్ టుమారో లలో కనిపించి తమ ఉనికిని చాటుతోంది. ఇంతేకాకుండా ఈ వాహనం క్వీన్ ఎలిజిబెత్ 1952 లో సిమ్హాసనాన్ని అధిష్టించినపుడు తమ ఎస్టేట్లలో తిరిగేందుకు వినియోగించి కారుని మరింత ప్రత్యేకం చేసారు.
ఇంకా చదవండి : రూ. 98,03 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన జాగ్వార్ XJ ఫేస్ లిఫ్ట్
- Renew Land Rover Defender Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful