ల్యాండ్ రోవర్ వారు రేంజ్ రోవర్ ఇవోక్ పునరుద్దరణ ని నవంబరు 19న విడుదల చేయనున్నారు

ల్యాండ్ రోవర్ పరిధి rover evoque 2016-2020 కోసం raunak ద్వారా నవంబర్ 03, 2015 12:07 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Land Rover

టాటా వారి ల్యాండ్ రోవర్ ఇవోక్ పునరుద్దరణని భారతదేశంలో ఈ నెల 19న విడుదల చేయనున్నారు. దీనికి బుకింగ్స్ గత నెల 20న ప్రారంభించారు. ల్యాండ్ రోవర్ వారు స్థానికంగా సమీకరణని ఇవోక్ డీజిల్ కి ఈ ఏడాది ప్రారంభించారు మరియూ పునరుద్దరణ పొందిన డీజిల్ వెర్షన్ కూడా స్థానికంగా సమీకరించబడుతుంది.

మార్పుల విషయంలో, దీనికి కొత్తగా డిజైన్ చేసిన ముందు మరియూ వెనుక బంపర్లు తో పాటుగా పునరుద్దరించబడిన గ్రిల్లు ఉంటుంది. హెడ్‌లైట్స్ కి ఇప్పుడు పూర్తి ఎల్ఈడీ ప్రకాశం తో కొత్త డే టైం రన్నింగ్ ఎలీడీ పాటర్న్ కలిగి ఉంటాయి. టెయిల్ లైట్స్ ఎలీడీ మరియూ కొత్త గ్రాఫిక్ డిజైన్ కలిగి ఉంటుంది. పైగా, వాహనానికి కొత్తగా డిజైన్ చేయబడిన అల్లోయ్ వీల్స్ ని అందించడం జరిగింది.  లోపల, ఈ కారుకి ల్యాండ్ రోవర్ వారి కొత్త 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం మరియూ సౌండు కి 17 స్పీకర్లు తోడు తో పాటుగా, 825-వాట్ల మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టము కూడా ఉంటుంది.  హెడ్-అప్ డిస్ప్లే, సరౌండ్ క్యామెరా సిస్టం తో పాటుగా వెనుక సీట్ ఎంటర్టెయిన్‌మెంట్ కూడా అందించడం జరిగింది.  

ల్యాండ్ రోవర్ ప్రస్తుతానికి భారతదేశంలో 2.2-లీటర్ డీజిల్ ఇంజినుతో కొనసాగుతుంది. ఇది 190bhpశక్తి మరియూ 420Nm టార్క్ విడుదల చేస్తుంది. ఈ ఇంజినుకి 9-స్పీడ్ జెడ్ఎఫ్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన Land Rover పరిధి Rover Evoque 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience