• English
  • Login / Register

ఆటో ఎక్స్‌పో 2020 లో కియా 4 కొత్త మోడళ్లను ప్రదర్శించనున్నది

కియా కార్నివాల్ 2020-2023 కోసం dhruv attri ద్వారా జనవరి 22, 2020 11:16 am ప్రచురించబడింది

  • 26 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కార్నివాల్ MPV తో పాటు, సబ్ -4m SUV మరియు ప్రీమియం సెడాన్‌ వాటిలో ఉండే అవకాశం ఉంది

Kia To Unveil 4 New Models At Auto Expo 2020

గత ఏడాది ఆటో ఎక్సో మనకి చేతులు నిండుగా కార్లని కలిగి ఉండేది, ముఖ్యంగా కియా మోటార్స్ తమ యొక్క ప్రొడక్ట్స్ ని పూర్తిస్థాయిలో ప్రదర్శించింది. కానీ వాటిలో కేవలం ఒక్కటి మాత్రమే ఇండియా కి సంబందించిన కారు అవ్వడం భాదాకరం అని చెప్పవచ్చు. కాని కియా ఈ సమస్యను పరిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.  ఆటో ఎక్స్‌పో 2020 కి కియా ఒకటి కంటే ఎక్కువ భారతదేశానికి కార్లను తీసుకువస్తుందని మేము ఆశిస్తున్నాము మరియు అవి ఏంటో ఇక్కడ చూద్దాము:   

Kia Carnival Launch Confirmed. Scheduled For 5 February

కియా కార్నివాల్

కార్నివాల్ ప్రీమియం పీపుల్ మూవర్, ఇది ఫిబ్రవరి 5 న ఆటో ఎక్స్‌పోలో ప్రారంభించబడుతుంది. దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు కాని ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా లేదా టాటా హెక్సా నుండి అప్‌గ్రేడ్ చేసే సౌకర్యం కోరుకునే కొనుగోలుదారులకు సహజమైన అప్‌డేట్ అవుతుంది. ఈ MPV కి కొనసాగింపు అయిన ఇది ఎలక్ట్రిక్ స్లైడింగ్ వెనుక డోర్స్, రెండవ వరుస కెప్టెన్ సీట్లు, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు ఫీల్-గుడ్ ఫీచర్లతో వస్తుంది. అంతర్జాతీయ-స్పెక్ మోడల్‌కు డ్యూయల్ పనోరమిక్ సన్‌రూఫ్, వెనుక సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లభిస్తాయి. దీని ధర రూ .27 లక్షల నుంచి రూ .36 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

Brezza-rival Kia QYI To Launch By August 2020

కియా QYI

సబ్ -4 m SUV సెగ్మెంట్ ప్రస్తుతం అత్యధికంగా కార్లు ఉండే సెగ్మెంట్ అని చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్ కి కియా దాని స్వంత QYI (కోడ్‌నేం) ని జోడిస్తుంది. దీనిని సోనెట్ అని పిలుస్తారని ఒక పుకారు ఉంది, ఇది హ్యుందాయ్ వెన్యూపై ఆధారపడి ఉంటుంది మరియు కియా లైనప్‌ లోని సెల్టోస్ క్రింద పేర్చబడుతుంది. ఇది వెన్యూ వలే అదే పరికరాలు మరియు ఇంజిన్ ఎంపికలను (1.2-లీటర్ మరియు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్) కలిగి ఉంటుందని భావిస్తున్నారు, అయితే దాని పెద్ద తోబుట్టువుల నుండి 1.5-లీటర్ డీజిల్ యొక్క కొద్దిగా తక్కువ ట్యూన్ వెర్షన్ తో ఉంటుంది. లాంచ్ కాలక్రమం మరియు ఇతర వివరాల కోసం ఇక్కడకి వెళ్ళండి.

కియా సెల్టోస్ X-లైన్

కియా సెల్టోస్ వివిధ కోణాల్లో ఒక తెలివైన SUV అని నిరూపించబడి ఉండవచ్చు, కాని ఇది ఇంకా కొన్ని హెవీ డ్యూటీ ఆఫ్-రోడింగ్ లో తిరగగలదని నిరూపించుకోలేదు. ఈ యొక్క అంశాన్ని సెల్టోస్ ద్వారా నిరూపించుకోవాలని చూస్తుంది, అది డర్ట్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో ఇంటి వద్దే కనిపిస్తుంది. సెల్టోస్ X-లైన్, మొదట 2019 LA ఆటో షోలో ప్రదర్శించబడింది మరియు దీనిని ఎక్స్‌పోలో చూడవచ్చు. ఇది వివిధ రకాల సౌందర్య మరియు యాంత్రిక నవీకరణలలో ఎత్తుగా ఉండే సస్పెన్షన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు సహాయక లైట్లను పొందుతుంది. ఈ పూర్తిగా మెరుగ్గా ఉండే సెల్టోస్ కియా స్టాల్‌కు కొంత అదనపు ఆకర్షణ అందించే అవకాశం ఉందని మేము ఆశిస్తున్నాము.

Kia To Unveil 4 New Models At Auto Expo 2020

కియా ఆప్టిమా K5

ప్రీమియం సెడాన్ విభాగం చనిపోతున్న జాతి కావచ్చు, కానీ కియా దాని ఉత్తమ ఉత్పత్తులలో ఒకదాన్ని మాకు చూపించకుండా ఆపకూడదు. కియా ఆప్టిమా K 5 స్కోడా సూపర్బ్, హోండా అకార్డ్ మరియు టయోటా కామ్రీలకు పోటీగా వెళుతుంది. ఇది DRL లతో LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్ప్లే, సౌండ్ మూడ్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు మరియు UVO కనెక్ట్ టెక్ వంటి లక్షణాలను పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా, ఇది 2.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ అలాగే 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ తో పనిచేస్తుంది.

వీటితో పాటు, కియా తన గ్లోబల్ ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తుంది. వీటిలో సోల్, స్పోర్టేజ్ మరియు టెల్లూరైడ్ కూడా ఉండవచ్చు.

was this article helpful ?

Write your Comment on Kia కార్నివాల్ 2020-2023

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience