బహుశా భారతదేశంలో ప్రారంభం కానున్న కియా పికాంటో
హ్యుందాయ్ ఐ10 కోసం manish ద్వారా ఫిబ్రవరి 12, 2016 04:04 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కోరియన్ అనుభంద సంస్థ హ్యుందాయి కియా యొక్క ఉత్పత్తి కేంద్రాన్ని ఆంద్రప్రదేశ్ లో ప్రారంభించేందుకు సనాహాలు చేస్తుంది. సంస్థ కియా పికాంటో హ్యాచ్బ్యాక్ మరియు కియా స్పోర్టేజ్ కాంపాక్ట్ ఎస్యూవీ ని భారతదేశానికి తీసుకురానుంది. ఈ కర్మాగారం ద్వారా ఏడాదికి 200,000 యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం అందిచగలదని భావిస్తున్నారు. దీని యొక్క అనుబంధ సంస్థ ఆంద్రప్రదేశ్ లో శ్రీ సిటీ వద్ద ఉండే అవకాశం ఉందని ఉహిస్తున్నారు.
ఆటో కారు జనరల్ మేనేజర్ తో విదేశీ పిఆర్ టీం, కియా మోటర్స్ కార్పోరేషన్, మిస్టర్ మైఖేల్ చూ సంభాషిస్తూ " మేము నిరంతరం భవిష్య అభివృద్దికి కావలిసిన అదనపు ఇంజిన్లు ఏర్పాటు చేయాలని భారతదేశంతో సహా విదేశాలలో సమర్ధవంతమైన ప్రదేశాలు విస్తరిస్తూ ఉన్నాము. అయితే ఇంకా ఎటువంటి యత్నాలు ఖరారు కాలేదు." అని తెలిపారు.
కియా అందించబోయే ఈ వాహనాల యొక్క వివరాలు తెలియని వారికోసం ఈ సమాచారం, పికాంటో ఒక 5-డోర్ హ్యాచ్బ్యాక్ మరియు ఇది హ్యుందాయి ఐ10 కి అనుబంధ వాహనంగా చెప్పవచ్చు. తదుపరితరం పికాంటో ఇటీవలే 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శించబడింది. ఇది హ్యాచ్బ్యాక్ యొక్క నాల్గవ తరం మరియు హ్యుందాయి ఇయాన్ లో ఉన్నటువంటి అదే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని అందిస్తుంది మరియు గ్రాండ్ ఐ10 లో ఉన్నటువంటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. కానీ భారతమార్కెట్ ని పరిగణలోనికి తీసుకొని చూస్తే ఈ వాహనం రాబోయే ఒక హాట్ హాచ్ అని చెప్పవచ్చు. కియా పికాంటో స్పోర్ట్ వేరియంట్ కూడా భారతదేశంలోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ ప్రామాణిక పికాంటో లో ట్రాన్సిమిషన్ ఎంపికలు హ్యుందాయి ఐ10 లో ఉన్నటువంటి 5-స్పీడ్ MT మరియు 4 స్పీడ్ AT ని కలిగి ఉన్నాయి. కియా స్పోర్టేజ్ కి సంబంధించినంతవరకు, ఈ క్రాస్ఓవర్ కియా గా ఉంటుంది మరియు కాంపాక్ట్ ఎస్యూవీ మార్కెట్లో హ్యుందాయి యొక్క అగ్రగామి పోటీదారి మరియు రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటితో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful