• English
  • Login / Register

జపాన్ నుండి హోండా బీఆర్-వీ యొక్క ప్రత్యేక వివరాలు

హోండా బిఆర్-వి కోసం raunak ద్వారా అక్టోబర్ 27, 2015 04:33 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దేశంలో హోండా బీఆర్-వీ సరైన మూడు వరుస సీట్లు కలిగిన మొదటి ఎస్‌యూవీ గా నిలుస్తుంది 

జైపూర్:

టోక్యో జపాన్ లో ఉన్న హెడ్‌క్వార్టర్స్ లో హోండా వారు వారి రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన బీఆర్-వీ యొక్క వివరాలు తెలిపారు. 2016 ఇండియన్ ఆటో ఎక్స్పోలో ఈ వాహనాన్ని అధికారికంగా ప్రదర్శించనున్నారు.  దేశంలో ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్‌మెంట్ జోరు బాగా నడుస్తోంది మరియూ తాజాగా క్రేటా దీని నిర్వచనాన్నే మార్చివేసింది.  ఈ విభాగంలో క్రేటా అమ్మకాలు ముందంజలో ఉండగా హ్యుండై నెలకి 7 యూనిట్ల అమ్మకాలను నమోదు చేస్తూ బీఆర్-వీ కి పోటీగా నిలువనుంది. రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రానో తో పాటుగా స్కార్పియో మరియూ సఫారీలతో కూడా పోటీ పడనుంది.

 

బీఆర్-వీ నమూనా అంతర్జాతీయంగా ఇండొనేషియా లో గత ఆగస్ట్ నెలలో ఆరంగ్రేటం చేసింది మరియూ కంపెనీ వారు దీనికి 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిను ఉంటుంది అని దృవీకరించారు. భారతీయ వెర్షన్ కి కూడా 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఎంపిక తో పాటుగాహోండా వారి డ్రీం టెక్నాలజీ అయిన  కొత్త డిజైన్ చేసిన సీవీటీ ట్రాన్స్మిషన్ ని జత చేయబడుతుంది అని తెలిపారు.  ఈ 1.5-లీటర్ i-VTEC ఇంజిను 118bhp శక్తి మరియూ 145Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ గురించి ఇంకా స్పష్టత లేదు కానీ, 1.5-లీటర్ i-DTEC డీజిల్ ఉండి, ఇది 100bhp శక్తి ఇంకా 200Nm టార్క్ ని విడుదల చేస్తుంది.  హోండా వారు ఈ ఇంజిను యొక్క పునరుద్దరణ వెర్షన్ ని లేదా యురోపియన్ మోడల్స్ యొక్క 1.6-లీటర్ i-DTEC ని అమర్చవచ్చు.

ఈ వాహనం బ్రైయో వేదికగా నిర్మించబడుతుంది. ఇదే వేదికను మేఅజ్ ఇంకా మిబిలియో కూడా పంచుకుంటున్నారు. కానీ మిగిలిన మూడిటి కంటే బీఆర్-వీ కి సరికొత్త రూపం అందించబడింది. ఇందులో హోండా సిటీ ఇంకా జాజ్ కి ఉన్నటువంటి ఒక కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్ ని కలిగి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Honda బిఆర్-వి

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience