భారతదేశంలోకి రాబోయే 2016 ఫార్చ్యూనర్ ను బహిర్గతం చేసిన టయోటా

టయోటా ఫార్చ్యూనర్ 2016-2021 కోసం anonymous ద్వారా జూలై 17, 2015 12:04 pm ప్రచురించబడింది

ఎన్నో చిత్రాలను రహస్యంగా తీసినప్పటికి, టయోటా 2016 ఫార్చ్యూనర్ ను అధికారికంగా బహిర్గతం చేయనుంది. అంతేకాకుండా రానున్న 2015 ఫోర్డ్ ఎండీవర్ తో గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది.

జైపూర్: టయోటా, థాయిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలు నేడు ఏకకాలంలోనే తదుపరి తరం ఫార్చ్యూనర్ ను బహిర్గతం చేశాయి. ఈ రెండు దేశాలలో, దీని ప్రత్యర్ధి అయిన 2015 ఫోర్డ్ ఎండీవర్ తరువాతి సంవత్సరం అమ్మకానికి వెళ్ళబోతుంది. భారతదేశం విషయానికి వస్తే, వచ్చే సంవత్సరం మొదటిలోనే అమ్మకానికి రాబోతుంది. థాయిలాండ్ లో, ఈ కొత్త ఫార్చ్యూనర్ యొక్క ధర సుమారు రూ. 1,199,000 నుండి 1,529,000 మద్య ఉంటుంది. బట్ లో ఐతే, సుమారు రూ. 22.25 లక్షల నుండి 29.69 లక్షల వరకు ఉండవచ్చు. భారతదేశం లో కూడా ఇలాంటి ధరలే రావచ్చునని ఆశిస్తున్నారు.

కొత్త ఫార్చ్యూనర్, ప్రస్తుత ఎస్యువి లో మాదిరిగా ఫ్రేమ్ నిర్మాణం మీద అదే శరీర అంశాలతో రాబోతుంది. కానీ, ఈ వాహనాల స్థాయిలు ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి. 2016 ఫార్చ్యూనర్ ను చూసిన మొదటి చూపులోనే మనకు అర్ధం అయ్యే విషయం ఏమిటంటే, అవుట్గోయింగ్ ఫార్చ్యూనర్ సౌందర్యం తో పోలిస్తే పూర్తిగా ఒక కొత్త రూపంతో రాబోతుంది. అంతేకాకుండా అనేక లక్షణాలతో రాబోతుంది. అయితే, అవుట్గోయింగ్ ఫార్చ్యూనర్ యొక్క పెద్ద బాడీ ను ప్రస్తుత ఫార్చ్యూనర్ లో గణనీయంగా తగ్గించారు. అంతేకాకుండా, పాత దానిలా కాకుండా మంచి లుక్ తో రాబోతుంది. 

2016 ఫార్చ్యూనర్ యొక్క బాహ్య భాగాలను చూసినట్లైతే, భారీ క్రోమ్ కలిగిన ట్విన్ స్లాట్ గ్రిల్ కి నవీకరించబడిన హెడ్ల్యాంస్ బిగించబడి ఉంటాయి. బి ఎల్ ఈ డి లైటింగ్ తో పాటు ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ హెడ్ ల్యాంప్స్ ఆప్షనల్ గా అందించబడతాయి. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 17 మరియు 18- అంగుళాల రేడియల్ తో కూడిన మెషీండ్ అల్లాయ్ వీల్స్ అమర్చబడి ఉంటాయి. దీని వీల్ ఆర్చులు, టైర్లతో కప్పబడి ఉంటాయి. అంతేకాక, 2016 ఫార్చ్యూనర్ లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, విండో చుట్టూ సి-పిల్లార్ తో కప్పబడి ఉంటుంది. డి పిల్లార్ విషయానికి వస్తే, అవుట్గోయింగ్ మోడల్ లో లాగే రాబోతుంది. ఎల్ ఈ డి ర్యాప్ రౌండ్ టైల్ ల్యాంప్స్ అందించబడతాయి. సూక్ష్మ మొత్తంలో  తగిన విధంగా, క్రోమ్ చేరికలు ఈ ఎస్యువి అంతటా అమర్చబడి ఉంటాయి. లైసెన్స్ ప్లేట్ పై మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోం చేరికలు చేర్చబడి ఉంటాయి.

2016 ఫార్చ్యూనర్ యొక్క అంతర్భాగాలను కొరిల్లా ఆల్టిస్ మాధిరిగా ఉండబోతుంది. డాష్బోర్డ్ ను గమనించినట్లైతే, కలర్ స్కీం మాత్రం ఎటువంటి మార్పు ను చోటు చేసుకోలేదు. ప్రస్తుత ఫార్చ్యూనర్ యొక్క ఇన్నోవా స్ఫూర్తితో మందకొడిగా మరియు వృద్ధాప్యం కలిగిన అంతర్భాగాలతో రాబోతుంది. అంతేకాకుండా, దీనిలో ఒక పెద్ద టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, ఒక కొత్త స్టీరింగ్ వీల్ మరియు సీట్లు ఉన్నాయి.

క్రింద ఇవ్వబడిన డీజిల్ వివరాలు కలిగిన చార్ట్ యొక్క ఫార్చ్యూనర్, భారతదేశంలో ప్రవేశించుటకు సిద్ధంగా ఉంది. ఇంతేకాకుండా, ఇతర మార్కెట్ లలో ఈ వాహనం, 2.7 లీటర్ డ్యూయల్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 5200 rpm వద్ద 166 bhp పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా, 4000 rpm వద్ద 245 Nm గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టయోటా ఫార్చ్యూనర్ 2016-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience