భారతదేశానికి ప్రత్యేకమైన జిఎల్ఎస్ గా పేరు మార్చబడిన జిఎల్-క్లాస్ ఫేస్లిఫ్ట్ బహిర్గతం

మెర్సిడెస్ జిఎలెస్ 2016-2020 కోసం raunak ద్వారా నవంబర్ 04, 2015 04:52 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

http://images.cardekho.com/images/carNewsimages/carnews/Mercedes%20Benz/Mercedes_Benz_GLC_0411_2015_02.jpg

మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం సంస్థ యొక్క కొత్త పేరుతో జిఎల్ఎస్ మారు పేరు కలిగిన ఫేస్లిఫ్ట్ జిఎల్-క్లాస్ ని వెల్లడించింది. వాహనం యొక్క వివరాలు రోజుల క్రితం లీకయ్యాయి మరియు మెర్సిడెస్ అధికారికంగా వారి ఫ్లాగ్‌షిప్ ఎస్యువి ని ఆవిష్కరించింది. వాహనం యుఎస్ లో వచ్చే నెల నుండి ఆర్డర్ లో ఉంటుంది. అయితే డెలివరీస్ మాత్రం మార్చి 2016 నుండి ప్రారంభం అవుతాయి. భారతదేశం గురించి మాట్లాడితే, ఈ వాహనం వచ్చే ఏడాది రెండవ భాగంలో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. అయితే, ఇది ఫిబ్రవరి లో రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో రావచ్చు. అంతేకాక కొత్త జిఎల్ఎస్ 60 ఎఎంజి వాహనం, జర్మన్ వాహనం అయిన జిఎల్63 ఎఎంజి అందుబాటులో ఉన్న విదంగా భారతదేశంలో అందుబాటులో ఉంటుంది.  

మెర్సిడెస్ వారు ఎస్-క్లాస్ ని కొత్త జిఎల్ఇ వలే ఎస్యువి కోవకు చెందినట్టుగా ప్రచారం చేస్తున్నారు. కొత్త జిఎల్ఎస్ కూడా జిఎల్-క్లాస్ యొక్క స్వల్పంగా నవీకరించబడింది వెర్షన్. బాహ్యంగా, ఈ వాహనం పగటిపూట నడుస్తున్న ఎల్ఇడి తో అమర్చబడియున్న రిఫ్రెష్ ఎల్ఇడి హెడ్లైట్లు తో అమర్చబడి ఉంటుంది. దీని గ్రిల్ కొద్దిగా పెద్ద స్టార్ లోగోతో నవీకరించబడింది. ముందర భాగంలో దీని టెయిల్ ల్యాంప్స్ ఎల్ఇడి గ్రాఫిక్స్ ని కలిగి ఉంటాయి మరియు వెనుక బంపర్స్ పునరుద్ధరించబడి ఉంటాయి. ఈ వాహనం కొత్త అలాయ్ వీల్స్ సమితితో నడుపబడుతుంది. దీని అంతర్భాగాలు కూడా అవుట్గోయింగ్ మోడల్ కంటే కొద్దిగా నవీకరిచబడింది మరియు సెంటర్ కన్సోల్ కూడా అత్యధిక మార్పులను పొందింది. దీనిలో కొత్త టచ్ ప్యాడ్ తో పాటు మెర్సిడెస్ బెంజ్ తాజా 8 అంగుళాల కమాండ్ ఆన్‌లైన్ సమాచార వ్యవస్థను కలిగి ఉండడం ప్రధాన హైలైట్.

భద్రత పరంగా, కొత్త జిఎల్ఎస్ ప్రామాణిక కొలిజన్ ప్రివెన్షన్ అసిస్ట్ ప్లస్ తో, క్రాస్ విండ్ అసిస్ట్ మరియు ప్రీ సేఫ్ వ్యవస్థతో పాటు అటెన్షన్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ బిఎఎస్, ఎలక్ట్రానిక్ ఆల్ వీల్ డ్రైవ్ ట్రాక్షన్ వ్యవస్థ 4ఇటిఎస్ మరియు క్రూజ్ నియంత్రణ వంటి అంశాలను కలిగి ఉంది. ఎయిర్బ్యాగ్స్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవర్ మరియు ప్యాసింజర్ కొరకు రెండు-దశల ఎయిర్బ్యాగ్స్ అందించబడుతున్నాయి. అవి నీ ఎయిర్బ్యాగ్స్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ కొరకు(కంబైన్డ్ ఉరము / పొత్తికడుపు ఎయిర్బ్యాగ్స్) మరియు మూడు వరుస సీట్లకు విండో ఎయిర్బ్యాగ్స్ ప్రమాణంగా అందుబాటులో ఉన్నాయి.

యాంత్రికంగా మెర్సిడెస్ ప్రపంచవ్యాప్తంగా జిఎల్-క్లాస్ ఫేస్లిఫ్ట్ ఇంజిన్ లైనప్ ని నవీకరించింది. అయితే, వారు భారతదేశంలో మాత్రమే జిఎల్350 కి 3.0 లీటర్ v6 డీజిల్ ఇంజిన్ అందిస్తున్నారు మరియు ఈ ఇంజన్ ఎటువంటి నవీకరణలను పొందలేకపోయింది. వాహనతయారి సంస్థ దేశంలో ఇదే ఇంజిన్ ఎంపికను కొనసాగించాలని ఆశిస్తున్నారు. 2897cc స్థానభ్రంశన్ని అందించే v6 మోటారు 3600rpm వద్ద 255bhp శక్తిని మరియు 616Nm టార్క్ ని అందిస్తుంది. ఇంజిన్ మెర్సిడెస్ '9జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ని కలిగి ఉంటుంది. ఫ్లాగ్‌షిప్ ఎఎంజి వెర్షన్ జిఎల్ఎస్63 ఎఎంజి గురించి మాట్లాడుకుంటే, మెర్సెడీస్ సంస్థ 27bhp శక్తిని ఎక్కువగా ఇస్తుంది. ఈ మోటార్ ఇప్పుడు 577bhp శక్తిని మరియు 760Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. జిఎల్ఎస్ 63 ఎఎంజి, ఎఎంజి స్పీడ్ షిఫ్ట్ ప్లస్ 7జి-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వ్యవస్థతో జత చేయబడి ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మెర్సిడెస్ జిఎలెస్ 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience