బారతదేశంలో హ్యుందాయ్ "శాంటా-ఫీ" ఫేస్ లిఫ్ట్ వెర్షన్ బహిర్గతం

హ్యుందాయ్ శాంటా ఫి కోసం raunak ద్వారా జూన్ 06, 2015 04:02 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యుందాయ్ మోటార్స్, దక్షిణ కొరియా మార్కెట్లో 2016 సాంట ఫీ మిడ్ లైఫ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఎస్యువి మెకానికల్ నవీకరణలను తో పాటు కొన్ని కాస్మటిక్ లక్షణాలతో వచ్చింది. దక్షిణ కొరియా మార్కెట్ లో నవీకరణ చేయబడిన ఈ సాంట ఫీ "ద ప్రైమ్" అను పేరుతో పిలవబడుతుంది. భారతీయ ప్రవేశం గురించి మాట్లాడటానికి వస్తే, ఈ ఎస్యువి ను అయితే వచ్చే ఏడాది ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అయితే, హ్యుందాయ్ ఇండియా 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ఈ ఎస్యువి ను బహిర్గతం చేయనున్నారు. 

ఇప్పటికే, హ్యుందాయ్ యొక్క సాంట ఫీ ను తల తిప్పలేనంత ఆకర్షణీయంగా తయారు చేశారు. ఈ రాబోయే సాంట ఫీ ఫేస్లిఫ్ట్ వెర్షన్ ఇప్పుడు కొత్త రకమైన బంపర్ తో పాటు డే టైమ్ రన్నింగ్ ఎల్ ఈ డి మరియు ఫాగ్ ల్యాంప్స్ తో రాబోతున్నాయి. దీని యొక్క హెడ్ల్యాంప్స్ ఇప్పుడు బి జినాన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో పాటు ఎల్ ఈ డి గైడ్ లైట్స్ తో రాబోతున్నాయి. హ్యుందాయ్ ఇప్పుడు డైనమిక్ బేండింగ్ ఎంపికను మరియు హై బీమ్ సహాయంతో అందించబడుతుంది. మరియు నవీకరణ చేయబడిన రేడియేటర్ గ్రిల్ తో రాబోతుంది.  

 

రాబోయే సాంట ఫీ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, పాత దాని వలనే ఏ నవీకరణలు లేకుండా రాబోతుంది. మరియు న్యూ అల్లాయ్ వీల్స్ తో రాబోతుంది. కారు యొక్క వెనుక బాగం విషయానికి వస్తే, కొన్ని నవీకరణలతో వస్తుంది. దీని యొక్క టైల్ లైట్ ఎలా రాబోతుందంటే, న్యూ ఎల్ ఈ డి గ్రాఫిక్స్, నవీకరించబడిన బంపర్, కొత్త వెనుక ఫాగ్ ల్యాంప్స్ మరియు కొత్త డ్యూయల్ క్వాడ్-స్టైల్ ఎగ్సాస్ట్ టిప్స్ తో రాబోతుంది.

 

ఇంటీరియర్స్ గురించి మాట్లాడటానికి వస్తే, డాష్బోర్డ్ పెద్దగా ఏ మార్పులు చేయబడలేదు, చిన్న చిన్న నవీకరణలను పొందింది. అంతేకాకుండా హ్యుందాయ్ వారు నాణ్యతా అభివృద్ధి మరియు వివరాలపై దృష్టి సారిస్తారని చెప్పారు. వీటితో పాటు, క్రూజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఒక 360-డిగ్రీ కెమెరా మరియు ఒక కొత్త హై ఎండ్ జెబిఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి వాటితో రాబోతుంది. 

యాంత్రికంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యుందాయ్ 2.0 మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ లను కలిగి ఉన్నప్పటికి, ఈ హ్యుందాయ్ బారతదేశంలో 2.2-లీటర్ ఇంజెన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఇంజెన్ కొంచెం మార్పు చేయబడి రాబోతుంది, దీని వలన ఛో2 ఉద్గారాలను తగ్గించవచ్చు. అంతేకాక, దీని యొక్క నిర్దేశాలు పెద్దగా మార్పు చేయబడలేదు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ Santa Fe

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience