హోండా బిఆర్-వి అధికారిక చిత్రీకరణల విడుదల మరియు 2016 లో అరంగేట్రం చేయనున్న ఇండియన్ వెర్షన్
హోండా విజన్ ఎక్సెస్ 1 కోసం raunak ద్వారా జూన్ 30, 2015 11:29 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ హోండా 7-సీటర్ బిఆర్-వి క్రాస్ఓవర్, ఒక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది, కానీ ఇండియన్ వెర్షన్ మాత్రం 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇండియన్ వెర్షన్ ను 2016 ఆటో ఎక్స్ పో లో అరంగేట్రం చేయాలని ఆశిస్తున్నారు.
జైపూర్: హోండా, ఆసియా మార్కెట్లో రాబోయే వారి క్రాస్ఓవర్ యొక్క ఎస్యూవి చిత్రీకరణలను అధికారికంగా విడుదల చేసింది. జపనీస్ వాహన తయారీదారుడు, దీనిని బిఆర్-వి అని వ్యాఖ్యానించారు, ప్రముఖ సి ఆర్ -వి స్ఫూర్తితో గుడ్ మూవ్ వాహనంగా తయారయిందని , మరియు ఇటీవల ప్రారంభించింది హెచ్ ఆర్-వి అని ఆయన చెప్పారు. సంస్థ ప్రకారం, బిఆర్-వి అనగా బోల్డ్ రన్అబౌట్ వాహనం అని అర్థం . దీనిని ఆగస్ట్ 20 నుండి ఆగస్ట్ 30 2015 వరకు జరిగే వరల్డ్ ప్రీమియర్ గైకిండో ఇండోనేషియన్ ఇంటర్నేషనల్ ఆటో షో వద్ద ఆవిష్కరించనున్నారు. ఇండియన్ వెర్షన్ అరంగేట్రం మాత్రం తదుపరి సంవత్సరం ఆటో షోలో జరగవచ్చునని ఆశిస్తున్నారు.
డిజైన్ గురించి మాట్లాడటానికి వస్తే, ఈ క్రాస్ ఓవర్ ఒక బోల్డ్ వైఖరి ని కలిగి ఉంటుంది. ఈ 'కొత్త బిఆర్-వి అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద మరియు అందమైన అల్లాయ్ వీల్స్ మరియు సొగసైన రూఫ్ రైల్స్ తో పాటు టఫ్ అండ్ సోలిడ్ బాహ్య డిజైన్ కలిగి' రాబోతుంది అని హోండా సంస్థ చెప్పారు. ఈ సంస్థ, ప్రవేశం గురించి మాత్రం ఏ విషయం తెలియజేయలేదు. కానీ, ఈ బీఅర్-వి, అమేజ్ మరియు మొబిలియో యొక్క ప్లాట్ఫాం ఆధారంగా రాబోతుంది అని చెప్పారు. పైన చెప్పిన మూడు కార్లు తలపించే అవకాశాలు ఉన్నాయి కానీ, పోలి రావటం లేదు అని చెప్పారు. అంతేకాకుండా, మొబిలియో మరియు అమేజ్ కార్లలో ఉండే రెండు క్రీజ్ లైన్లతో రాబోతుంది.
ఈ వాహనం, కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో కి రాబోతుంది. ఈ బీఅర్-వి, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రనో మరియు రాబోయే హ్యుందాయ్ క్రెటా తో ప్రధానంగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, బిఆర్-వి ఏడు సీట్లను కలిగి రాబోతుంది మరియు 3 వరుసలతో రాబోతుంది. అంతేకాకుండా, సౌకర్యవంతమైన మరియు విశాలమైన క్యాబిన్ ను అందిస్తుంది అని చెప్పారు.
ఈ బిఆర్-వి, ఆసియా మార్కెట్ కోసం థాయిలాండ్ లో హోండా ఆసియా పసిఫిక్ ఆర్ & డి (హెచ్ ఆర్ ఏపి) ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. హెచ్ ఆర్ ఏపి చే అబివృద్ది చేయబడిన మూడవ కారు. ఇంజన్ పరంగా చెప్పాలంటే, ఈ బీఅర్-వి, 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. అంతేకాకుండా, 'స్పోర్టి ప్రదర్శన మరియు గొప్ప ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది'. ఈ ఇంజన్, రెండు ఆధునిక ట్రాన్స్మిషన్ చే జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం, 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ తో కూడా రాబోతుంది.