భారత ప్రత్యేక: 2016 టొయోటా ఫార్చునర్ ఆస్ట్రేలియాలో విడుదల అయ్యింది
టయోటా ఫార్చ్యూనర్ 2016-2021 కోసం raunak ద్వారా అక్టోబర్ 21, 2015 05:04 pm సవరించబడింది
- 21 Views
- 5 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
టొయోటా వారు వారి తరువాతి తరం ఫార్చునర్ ని ఆస్ట్రేలియా లో విడుదల చేశరు. ఈ రెండవ తరం $47,990 ఆస్ట్రేలియన్ డాలర్లకి విడుదల అయ్యింది. అంటే దాదాపు రూ. 22 లక్షలు ఉంటుంది. ఇది భారతదేశంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో లో వచ్చే ఏడాది ఫిబ్రవరీలో ప్రదర్శించనున్నారు. ఈ వాహనం షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్, రాబోయే ఫోర్డ్ ఎండెవర్ మరియూ మిత్సుబిషి పజెరో స్పోర్ట్ లతో పోటీ పడనుంది.
ఆస్ట్రేలియా లో రెండవ తరం ఫార్చునర్ కేవలం 2.8-లీటర్ డీజిల్ మోటర్ తో అందుబాటులో ఉంది. గత ఏడాది టొయోటా వారు విడుదల చేసిన రెండు కొత్త డీజిల్ ఇంజిన్లలో ఒకటి. ఈ 4-సిలిండర్ డైరెక్ట్-ఇంజెక్టెడ్ టర్బో డీజిల్ ఇది 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉన్నప్పుడు, దాదాపు 174.3bhp శక్తి ఇంకా 450Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అదే 6-స్పీడ్ మాన్యువల్ తో జత చేసినప్పుడు 420Nm టార్క్ విడుదల చేస్తుంది. పైగా, 2.8-లీటర్ మోటర్ కాకుండ, టొయోటా వారు 2.4-లీటర్ మోటర్ ని కూడా విడుదల చేసింది. భారతదేశంలో 2.8-లీటర్ మరియూ 2.4-లీటర్ రెండూ కొత్త ఫార్చునర్ లో ఫార్చునర్ అందుబాటులో ఉండబోతోంది.
సామర్ధ్యం విషయంలో టొయోటా ఆస్ట్రేలియా వారు ఈ 2.8-లీటర్ మోటర్ కి 100 కిలోమీటర్లు పూర్తి చేసేందుకు 7.8 లీటర్లు అవసరం అని, అనగా దాదాపు దీని ఇంధన సామర్ధ్యం లీటర్ కి 12 కిలోమీటర్లు అని తెలిపారు. మరియూ దీనికి 80 లీటర్ల ఫ్యుల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది.