హ్యుందాయ్ భారతదేశం క్రేటాని రేపు విడుదల చేయనుంది
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా జూలై 20, 2015 04:11 pm ప్రచురించబడింది
- 13 Views
- 4 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: హ్యుందాయ్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న 'క్రేటా' ని రేపు ప్రపంచ ప్రీమియర్ చేస్తుంది. ఇది కాంపాక్ట్ ఎస్యూవీలు అయిన రెనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్, నిస్సాన్ టెర్రనొ మరియూ రాబోయే మారుతి సుజుకి ఎస్-క్రాస్ లకు పోటీగా నిలువనుంది. మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టార్మ్ ధర పరిధిలోకి వస్తుంది. ధరలు గురించి మాట్లాడుతూ, ఇది రెనాల్ట్ డస్టర్ ధరకు సమీపంలో ఉండవచ్చు.
హ్యుండై క్రేటా మూడు ఇంజన్ ఎంపికలుతో వస్తుంది - రెండు డీజిల్, ఒక పెట్రోల్ మరియూ అన్ని ఇంజిన్లు వెర్నా నుండి పునికి పుచ్చుకున్నవి. పెట్రోల్ ట్రిం కి 6,400 ఆర్పీఎం వద్ద 123పీఎస్ ని మరియూ 4,850ఆర్పీఎం వద్ద 151ఎనెం ని వెలువడింపజేసే 1.6-లీటరు ద్వంద్వ వీటీవీటీ ఇంజిను అమర్చబడి ఉంది. డీజిలు ట్రింస్ లకు 1.4-లీటరు ఇంజిను 4000ఆర్పీఎం వద్ద 90పీఎస్ ని, 1500-2750ఆర్పీఎం వద్ద 220ఎనెం ఒకటి మరియూ 1.6-లీటరు ఇంజిను 4000ఆర్పీఎం వద్ద 128పీఎస్ ని ఇంకా 1900-2750ఆర్పీఎం వద్ద 260ఎనెం ని ఉత్పత్తి చేసె సామర్ధ్యం గల మోటర్లు ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఎంపికలు - ఒక ప్రామాణిక 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ మరియూ 1.6-లీటరు డీజిల్ ఐచ్ఛిక విభాగంలో మొదటి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్.
కొరియన్ ఆటోమేకర్ వారు క్రేటా ప్రపంచ అరంగేట్రం భారతదేశంలో చేస్తుంది అని అన్నారు. అయితే, అది హ్యుండై ఇప్పటికే 2014 లో చైనా లో ప్రత్యేకంగా ప్రారంభించిన ix25 ఆధారంగా నిర్మించబడింది. కాబట్టి సాంకేతికంగా, హ్యుండై భారతదేశంలో కొత్త పేరు తో దాని ప్రపంచ తొలి క్రేటా ని విడిదల చేస్తుంది మరియు తరువాత యూరోప్ సహా ఇతర మార్కెట్లలో ప్రారంభించనున్నట్లు సూచిస్తుంది.