• English
  • Login / Register

హ్యుందాయ్ ఇండియా, క్రీటా (అంతర్గత మరియు బాహ్య) యొక్క నమూనాలు అధికారికంగా బహిర్గతం

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా జూన్ 09, 2015 03:21 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

క్రిటా యొక్క ఇంజెన్, హ్యుందాయ్ వెర్నా ఆధారిత 2.0 ఇంజెన్. దీని డిజైన్ పరంగా చెప్పాలంటే, చూడటానికి బేబి సాంట ఫీ లా కనిపిస్తుంది.

జైపూర్: హ్యుందాయ్ మోటార్ ఇండియా, రాబోయే కాంపాక్ట్ ఎస్యువి అయిన క్రిటాను అధికారికంగా బహిర్గతం చేసింది. ఈ క్రిటా ను భారతదేశంలో వచ్చే నెల 21న తొలిపరిచయం చేయబోతున్నారు. దీనికి ముందే ఈ మోడల్ ను ఐఎక్స్25 అను పేరుతో చైనాలో ప్రవేశపెట్టడం జరిగింది. దీని ఆధారంగా భారతదేశంలో వచ్చే నెల ప్రవేశపెట్టబోతున్నారు. అంటే, 2015 మధ్యలో ప్రవేశపెడుతున్నారు. కాని, ఇది జూలై లో రాబోయే మారుతి సుజుకి ఎస్-క్రాస్ తో పోటీ పడటానికి రాబోతుంది. హ్యుందాయ్ క్రిటా ఆధునీకరించబడి రాబోతుంది.     


ఇది ఎలా కనిపిస్తుంది అంటే, ప్రస్తుతం హ్యుందాయ్ లో ఉన్న మోడల్స్ వరుసగా కొత్త ఎలైట్ ఐ 20, సాంట ఫీ మరియు ఇతర కార్లు లా ఉంటుంది. ఈ క్రిటా, కొరియన్ ఆటోమేకతో తయారుచేయబడిన హ్యుందాయ్ వెర్నా లో ఉండే 2.0 ఇంజెన్ తో రాబోతుంది. బాహ్య భాగాల విషయానికి వస్తే, హెక్సాగోనల్ త్రీ స్లాట్ గ్రిల్, ఫ్లాకెండ్ షార్పర్ లుక్కింగ్ హెడ్ల్యాంప్స్ మరియు డీఅరెలెస్ తో పాటు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ అందించబడతాయి. అంతేకాకుండా, ఆల్రౌండ్ బాడి క్లాడింగ్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో భారతదేశంలోకి రాబోతుంది.    
 

ఈ క్రిటా యొక్క అంతర్భాగాలు డ్యూయల్ టోన్ తో, ఎలైట్ ఐ 20 లో ఉన్న మాదిరిగా రాబోతుంది. అంతేకాకుండా, వెర్నా, ఎలైట్ ఐ 20 లలో ఉన్న లక్షణాలతో రాబోతుంది. చైనా లో ఈ ఐఎక్స్25 అనేక రంగుల డాష్బోర్డ్ ఎంపికతో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఈ క్రిటా, హ్యుందాయ్ ఐ20 ను పోలి మరియు అనేక లక్షణాలతో అందించే అవకాశం ఉంది.  అధికారికంగా విడుదలైన డిజైన్ లో, టచ్ స్క్రీన్ లేని ఆడియో యూనిట్ ను వెల్లడించింది. అంతేకాక, దీని స్టీరింగ్ వీల్ ను చూసినట్లైతే, భారతదేశంలో ఉన్న క్రొత్త హ్యందాయ్ వెర్నా స్టీరింగ్ వీల్ ను పోలి ఉంటుంది. ఇంతేకాకుండా,  రేర్ ఏసి వెంట్ లు, హ్యాండ్ బ్రేక్ లివర్ చుట్టూ రెండు కప్ హోల్డర్స్ తో పాటు అనేక నిల్వ ప్రదేశాలు పుష్కలంగా ఉన్నాయి.       

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience