హ్యుందాయ్ క్రెటా : త్వరిత వీక్షణ

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం arun ద్వారా జూన్ 29, 2015 01:48 pm ప్రచురించబడింది

ముంబై: హ్యుందాయ్ లో రాబోయే క్రాస్ఓవర్ క్రెటా ను ప్రదర్శించారు. క్రెటా ప్రదర్శన వద్ద, హెచ్ఎంఐఎల్ సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో అయిన మిస్టర్ బిఎస్ సియో మాట్లాడుతూ, "ఈ క్రెటా, ఈ సంవత్సరంలో చాలా ఎదురుచూస్తున్న మరియు ఏస్పిరేషనల్ ఎస్యువి మరియు హ్యుందాయ్ పోర్ట్ఫోలియో లో ఒక విప్లవాత్మక ఉత్పత్తి అవుతుందని వ్యాఖ్యానించారు. హ్యుందాయ్ మోటార్స్, భారతదేశం యొక్క విజయం కథనంలో ఒక కొత్త అధ్యాయం మరియు సరిపోలని సామర్థ్యాలతో భారతదేశం యొక్క ఎస్యువి విభాగంలో ఒక కొత్త బెంచ్ మార్కు ను సృష్టించడానికి త్వరలో రానుంది. అంతేకాకుండా, భారతదేశంలో హ్యుందాయ్ యొక్క బలమైన దృష్టి మరియు క్రెటా ప్రారంభంతో భారత మార్కెట్లో నిబద్ధత ను బలోపేతం చేస్తుంది అని ఆయన చెప్పారు."

హ్యుందాయ్ క్రెటా, ఎంతో ముఖ్యమైన వెర్నా స్కల్ప్చర్ 2.0 తత్వశాస్త్రం అనుసరించి రాబోతుంది. ఈ క్రెటా యొక్క ముందరి భాగం చూసినట్లైతే, ఒక ప్రముఖ క్రోమ్ గ్రిల్ తో పాటు ఉగ్రమైన స్వెప్ట్ బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు డేటైమ్ రన్నింగ్ లైట్లు తో రాబోతుంది. ఈ ఎస్యువి లుక్ ను మరింత పెంచడానికి, ముందు బంపర్ క్రింది భాగంలో ఒక ఫాక్స్ స్కిడ్ప్లేట్ ను కలిగి ఉంటుంది. ఈ క్రెటా యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, స్లోపింగ్ రూఫ్ లైన్, హై షోల్డర్ లైన్, రూఫ్ రైల్స్ మరియు 17 అంగుళాల డైమండ్ కట్ వీల్స్ తో విలక్షణంగా రాబోతుంది. ఈ వాహనం వెనుక భాగానికి వస్తే, బూట్ పై భాగం మొత్తం క్రోమ్ గార్నిష్ తో అలంకరించబడి ఉంటుంది. సామూహికంగా చుట్టబెట్టిన టైల్ ల్యాంప్స్ తో రాబోతుంది. దీని వలన షోల్డర్ లైన్ మరింత అందంగా కనబడుతుంది. ఈ హ్యుందాయ్ క్రెటా హైవ్ స్ట్రక్చర్ లక్షణాలను కలిగి రాబోతుంది. దీని వలన వాహనం సురక్షితంగా మరియు క్రాష్ లను తాట్టుకోవడంలోనే కాకుండా ఎన్ విహెచ్ లను తగ్గించడం లో దోహదపడుతుంది.

క్రెటా యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, ఈ హ్యుందాయ్ క్రెటా 7 అంగుళాల టచ్స్క్రీన్ ఆడియో వీడియో నావిగేషన్ (ఏవిఎన్) యూనిట్ తో రాబోతుంది. అంతేకాకుండా రేర్ ఏసి, పుష్ బటన్ టు స్టార్ట్ మరియు నియంత్రణలతో కూడిన స్టీరింగ్ వీల్ వంటి లక్షణాలతో రాబోతుంది. ముఖ్యమైన లక్షణాలు అయినటువంటి డ్యూయల్ ఎయిర్ బాగ్స్ తో పాటు సైడ్ అండ్ కర్టైన్ ఎయిర్ బాగ్స్, ఏబిఎస్ మరియు ఈ ఎస్ సి వంటి లక్షణాలతో రాబోతుంది.

హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లతో పాటు లభిస్తుంది. అవి వరుసగా, 1.6 లీటర్ డ్యూయల్ విటివిటి పెట్రోల్, 1.4 లీటర్ యూ2 సి ఆర్ డి ఐ డీజిల్, 1.6 లీటర్ల యూ2 సి ఆర్ డి ఐ డీజల్ ఇంజన్. ఈ మూడు ఇంజన్ లను హ్యుందాయ్ వెర్నా నుండి తీసుకొనబడినవి. వీటిలో అత్యంత శక్తివంతమైనది అయిన 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ ఎంపిక తో రాబోతుంది. అయితే, 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 123 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 1.6 డీజిల్ ఇంజన్ అత్యధికంగా 128 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ క్రెటా, డస్టర్, ఈకోస్పోర్ట్ మరియు నిస్సాన్ టెర్రనో వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది. అంతేకాకుండా, ఈ క్రెటా యొక్క ధరలు అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience