రెనాల్ట్ డస్టర్ కు మరియు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కు ధడ పుట్టించేలా రాబోతున్న హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా జూన్ 29, 2015 11:32 am ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతీయులు, 5-సీటర్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ ఎస్యువి ల పట్ల బలమైన మక్కువ కనబర్చారు. అంతేకాకుండా, రెనాల్ట్ డస్టర్ తో ఈ ఎస్యువి ప్రారంభమైనది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. డస్టర్ తో పాటు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ లతో చాలా కాలంగా కొనుగోలుదారులు ఆనందించారు. కానీ, ఈ ఆనందాన్ని మరిన్ని రెట్లు చేయడానికి హ్యందాయ్ క్రెటా అనేక లక్షణాలతో మరియు ఎంపికలతో త్వరలోనే మన ముందుకు రాబోతుంది.
జైపూర్: హ్యుందాయ్ సంస్థ వారు కొత్త కార్లను ప్రవేశపెట్టడంలో చాలా ఆశక్తి చూపిస్తున్నారు. ఆ విభాగంలో ఎప్పుడూ విననటువంటి లక్షణాలతో శాంత్రో ను పరిచయం చేశారు. తర్వాత కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా క్రెటా తో రాబోతున్నారు. ఇప్పుడు ఈ క్రెటా అనేక లక్షణాలతో రాబోతుంది. అవి ఏమిటంటే, తల తిప్పలేఅని అందమైన డిజైన్ లతో రాబోతుంది. అంతేకాకుండా, ఒక పూర్తి ప్యాకేజ్ తో రాబోతుంది.
మిగిలిన రెండు కార్ల గురించి మాట్లాడటానికి వస్తే, ఈకోస్పోర్ట్ 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కారు, అంతేకాకుండా దీని యొక్క ప్రారంభ ధర తక్కువగా ఉన్నప్పటికి, క్రెటా అనేక లక్షణాలతో రెనాల్ట్ డస్టర్ తో పోలిస్తే, తక్కువ ధరను కలిగిన వాహనం. అంతేకాకుండా, ఈకోస్పోర్ట్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు భారీ లోడ్ ను కలిగి ఉంటాయి. రెనాల్ట్ డస్టర్ 4 మీటర్లు పొడవు కలిగిన వాహనం.
రెనాల్ట్ డస్టర్, ఒక ప్రధానమైన ఎస్యువి లుక్ ను కనబరుస్తుంది మరియు ఒక ఆకర్షణ ను కలిగి ఉంటుంది. అయితే, ఈకోస్పోర్ట్ యొక్క ప్రవేశం తరువాత ప్రజలు, డస్టర్ యొక్క అమ్మకాలను అధిగమించేలా, ఈ ఆడంబరమైన ఫోర్డ్ క్రాస్ఓవర్ ను ఇష్టపడ్డారు. లుక్స్ పరంగా చూసినట్లైతే, ఈ రాబోయే క్రెటా, సాంట ఫీ ను కలిగి ఉంటుంది. ఈ విభాగంలో ఒక ఉత్తమ ఎస్యువి గా కనబడుతుంది.
మిగిలిన రెండు కార్లతో పోలిస్తే, ఈ క్రెటా శక్తివంతమైన ఇంజన్ లను కలిగి ఉంటుంది. అయితే, ఈ శక్తివంతమైన ఇంజన్ లను హ్యుందాయ్ వెర్నా నుండి తీసుకొనబడింది. అంతేకాకుండా, వెర్నా లో ఉండే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, దీనిలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో రాబోతుంది. ఇంజన్ లు పరంగా చెప్పలంటే, ఈకోస్పోర్ట్, అత్యంత ఇంధన సామర్ధ్యం మరియు శక్తివంతమైన 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఈకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ అందించబడుతుంది. ఇది మాత్రమే డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ఎంపికను కలిగిన కార్.
హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనాల్ట్ డస్టర్ కార్ల గురించి తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు
లక్షణాలు పరం గా చెప్పాలంటే, వెర్నా మరియు ఎలైట్ ఐ20 లో ఉండే అనేక లక్షణాలతో ఈ హ్యుందాయ్ క్రెటా రాబోతుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మిగిలిన రెండిటి తో పోలిసే, తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా, అనేక లక్షణాలతో అందుభాటులో ఉంది.
రెనాల్ట్ డస్టర్, మరోవైపు, మిగిలిన రెండిటితో పోలిస్తే, తక్కువ లక్షణాలను అందిస్తుంది. డస్టర్ ఏడబ్ల్యూడి తో అందుబాటులో ఉంది. దీనితో పాటు, 210 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ముఖ్యమైన లక్షణాలు అయినటువంటి ఈ ఎస్ సి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఏఎస్ ఆర్ (యాంటీ స్లిప్ రెగ్యులేషన్) మరియు హిల్ అసెండ్. ఇప్పుడు రాబోయే క్రెటా కూడా ఏడబ్ల్యూడి సెటప్ తో తరువాత దశలలో ఎక్కువగా వస్తాయి అని భావిస్తున్నారు.
ఈ క్రెటా గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఈ క్రెటా మార్కెట్ లో అనేక లక్షణాలతో రాబోతుంది. అంతేకాకుండా, వస్తూవస్తూ మార్కెట్ లో ఉన్న ఈకోస్పోర్ట్ మరియు డస్టర్ యొక్క అమ్మకాలను దోచుకునేలా రాబోతుంది. రాబోయే నెలలో ఏ ఏ లక్షణాలతో రాబోతుందో చూద్దాం.
Hyundai Creta | Ford EcoSport | Renault Duster | |
Engine | 1.6L/1.4L Diesel & 1.6L Petrol | 1.5L Diesel & 1.0L Turbo and 1.5L Petrol | 1.5L Diesel & 1.6L Petrol |
Drivetrain | FWD/ AWD (Expected) | FWD | FWD/ AWD |
Transmission | 6-Speed MT (diesel)/ 5-Speed MT (Petrol) | 5-Speed MT (Petrol &Diesel)/ 6-Speed DCT Petrol | 5/6 - Speed MT diesel / 5-Speed MT Petrol |
LxWxH (mm) | 4,270 x 1,780 x 1,627 | 3,999 x 1765 x 1708 | 4,315 x 1,822 x 1,695 |
Wheelbase | 2590 | 2520 | 2673 |
Ground Clearance (mm) | 183 (Similar to ix25, Expected) | 200 | 205 (FWD)/ 210 (AWD) |