• English
  • Login / Register

హ్యుండై క్రేటా మరియూ ఐ20 ధరలు పెరిగాయి, కంపెనీ కి ఫేస్‌బుక్ లో 6 మిలియన్ ఫాలోవర్లు చేరారు

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం manish ద్వారా అక్టోబర్ 15, 2015 12:39 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

హ్యుండై వారు క్రేటా ఎస్‌యూవీ ని విడుదల చేసినప్పుడు దాదాపుగా 10,000 బుకిగ్స్ ని అందుకుంది. పైగా, డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా కంపెనీ వారు ఎగుమతులను కూడా నిలిపివేశారు. ఇప్పుడు, ఈ ఘన విజయం తరువాత కంపెనీ వారు క్రేటా ధరని రూ. 25,000 పెంచారు. కేవలం ఈ ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్‌యూవీ కే కాదు ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కి కూడా వర్తిస్తాయి. హ్యుండై ఎలీట్ ఐ20 యొక్క ధర రూ. 9,000 పెంచారు. ఈ ధర పెంపు ఇప్పటి నుండే వర్తిస్తుంది. హోండా జాజ్ వంటి వాహనాల నుండి పెరుగుతున్న పోటీ ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ వారు హ్యుండై ఎలీట్ ఐ20 కి కొత్త టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము వంటి లక్షణాలను ధరలో మార్పు లేకుండానే అందిస్తోంది.

"హ్యుండై: అ మెస్సేజ్ టు స్పేస్" అనే శీర్షికతో చేసిన ప్రకటన కార్యక్రమాలతో హ్యుండై వారు కుర్రకారుని సైతం ఆకట్టుకుని ఆ సంఖ్యతో గిన్నిస్ వరల్డ్ రికార్డుని అందుకున్నారు. సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, పిన్ఇంటరెస్ట్ మరియూ ఫేస్‌బుక్ ల ద్వారా కనెక్ట్ అవుతారు.  

హ్యుండై వారు సోషల్ మీడియలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ని అందుకున్నారు. ఆరు మిలియన్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ని ఫేస్‌బుక్ లో అందుకున్నారు. వార్తల ప్రకారం, మంచి కంటెంట్, మార్కెటింగ్ ఇంకా నిరంతర ప్రకటనల ద్వారా ఇది సాధ్యపడింది అని అభిప్రాయం. ఈ ఫేస్‌బుక్ పేజ్ ని హ్యుండై వారు అధికారికంగా అక్టోబర్ 2011 లో విడుదల చేశారు.

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience