Hyundai Creta And Alcazar Adventure Editions Launched: రూ.15.17 లక్షల ధరతో ప్రారంభం కానున్న హ్యుందాయ్ క్రెటా మరియు ఆల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్ؚలు

హ్యుందాయ్ క్రెటా 2020-2024 కోసం rohit ద్వారా ఆగష్టు 08, 2023 06:15 pm ప్రచురించబడింది

  • 100 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రెండూ ఇటీవల ప్రారంభించిన హ్యుందాయ్ ఎక్స్టర్ నుండి కొత్త 'రేంజర్ ఖాకీ' పెయింట్ ఎంపికను పొందుతాయి

Hyundai Creta and Alcazar Adventure editions

  • రెండు SUVల స్పెషన్ ఎడిషన్ؚల ధర రూ.36,000 అధికంగా ఉంటుంది.

  • ఇది వరుసగా క్రెటా మిడ్-స్పెక్ మరియు టాప్-స్పెక్ SX మరియు SX(O) వేరియెంట్ؚలపై ఆధారపడాయి. 

  • హ్యుందాయ్, దీన్ని మిడ్-స్పెక్ ప్లాటినం మరియు ఆల్కాజార్ సిగ్నేచర్ (O) వేరియెంట్ؚలపై అందిస్తోంది. 

  • వీటి ధరలు రూ. 15.17 లక్షల నుండి రూ.21.24 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటాయి.

  • లుక్ పరంగా చేసిన సవరణలలో నలుపు రంగు ORVMలు మరియు లోగోలు మరియు ‘అడ్వెంచర్’ బ్యాడ్జ్ؚలు ఉన్నాయి.

  • ఇంటీరియర్ మార్పులలో ఆకుపచ్చ ఇన్సర్ట్ؚలతో పూర్తి-నలుపు రంగు క్యాబిన్ మరియు కొత్త సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ ఉన్నాయి.

  • ఇందులో వస్తున్న ఏకైక ఫీచర్ జోడింపు, ఎక్స్టర్ నుండి డ్యూయల్-కెమెరా డ్యాష్ؚకామ్. 

  • క్రెటా ప్రత్యేక ఎడిషన్ను కేవలం పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే అందిస్తున్నారు, ఆల్కాజార్ؚను పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలతో పొందవచ్చు. 

హ్యుందాయ్ క్రెటా మరియు హ్యుందాయ్ ఆల్కాజార్ రెండూ ఇటీవల కొత్త ‘అడ్వెంచర్ ఎడిషన్’ను పొందాయి. క్రెటాؚకు ఇది రెండవ ప్రత్యేక ఎడిషన్ కాగా, ఇటువంటి ట్రీట్మెంట్ అందుకోవడం ఆల్కాజార్ؚకు ఇదే మొదటిసారి. క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ కేవలం పెట్రోల్ పవర్ؚట్రెయిన్ؚతో మాత్రమే లభిస్తుంది, 3-వరుసల అడ్వెంచర్ SUVను టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండిటితో అందిస్తున్నారు. 

వేరియెంట్-వారీ ధరలు

 

Hyundai Creta Adventure edition
Hyundai Alcazar Adventure edition

వేరియెంట్ 

సాధారణ ధర 

ప్రత్యేక ఎడిషన్ ధర 

తేడా 

క్రెటా 

 

 

 

SX MT

రూ. 14.81 లక్షలు

రూ. 15.17 లక్షలు 

+రూ. 36,000

SX(O) CVT

రూ. 17.53 లక్షలు

రూ. 17.89 లక్షలు

+రూ. 36,000

ఆల్కాజార్ 

 

 

 

ప్లాటినం 7-సీటర్ MT

రూ. 18.68 లక్షలు

రూ. 19.04 లక్షలు

+రూ. 36,000

సిగ్నేచర్ (O) 7-సీటర్ టర్బో DCT

రూ. 20.28 lakh

రూ. 20.64 లక్షలు

+రూ. 36,000

ప్లాటినం 7-సీటర్ డీజిల్ MT

రూ. 19.64 లక్షలు

రూ. 20 లక్షలు

+రూ. 36,000

సిగ్నేచర్ (O) 7-సీటర్ డీజిల్ AT

రూ. 20.88 లక్షలు

రూ. 21.24 లక్షలు

+రూ. 36,000

ఆల్కాజార్ టాప్-స్పెక్ సిగ్నేచర్ (O) వేరియెంట్ؚను హ్యుందాయ్ స్పెషల్ ఎడిషన్ؚతో, 6-సీటర్ؚల డిజైన్‌తో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚలు రెండిటితో అందిస్తుంది, 7-సీటర్ వర్షన్ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు. 

రెండు SUVల కొత్త ‘అడ్వెంచర్ ఎడిషన్’ అన్ని వేరియెంట్ؚల ధరలు రూ.36,000 అధికంగా ఉంటాయి. 

తేడా ఏమిటి?

Hyundai Creta-Alcazar Adventure edition red brake callipers
Hyundai Creta-Alcazar Adventure Edition black body cladding

స్పెషల్ ఎడిషన్ؚతో, కారు తయారీదారు ఎక్స్టర్ ‘రేంజర్ ఖాకీ’ రంగును రెండు మోడల్‌లలో పరిచయం చేశారు. క్రెటా మరియు ఆల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్ؚలు రెండిటినీ నలుపు రంగు గ్రిల్ మరియు హ్యుందాయ్ లోగోలు (ముందు మరియు వెనుక), ఎరుపు రంగు బ్రేక్ క్యాలిపర్ؚలతో నలుపు రంగు అలాయ్ వీల్స్ (క్రెటాలో 17-అంగుళాలు మరియు ఆల్కాజార్ؚతో 18-అంగుళాలు), నలుపు రంగు ORVMలు మరియు నలుపు రంగు డోర్ క్లాడింగ్ వంటి కొన్ని లుక్ పరంగా ఉమ్మడి సవరణలతో అందిస్తున్నారు. ఇతర ఎక్స్‌టిరియర్ అప్‌డేట్‌లలో ఫ్రంట్ ఫెండర్‌లపై ‘అడ్వెంచర్’ బ్యాడ్జ్‌లు, నలుపు రంగు రూఫ్ రైల్‌లు మరియు బ్లాక్ స్కిడ్ ప్లేట్‌లు కూడా ఉన్నాయి.

క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్, మరియు రేంజర్ ఖాకీ - నాలుగు మోనోటోన్ రంగులలో లభిస్తుంది –– కేవలం చివరి రెండు రంగులలో ఐచ్ఛిక నలుపు రంగు రూఫ్ ఉంటుంది. మరొక వైపు ఆల్కాజార్ ప్రత్యేక ఎడిషన్, క్రెటాలో ఉన్నట్లు గానే అదే మోనోటోన్ పెయింట్ ఎంపికలతో అందించబడుతుంది, అయితే నలుపు రంగు రూఫ్ ఎంపిక అన్నిటిలో లభిస్తుంది.

ఇది కూడా చదవండి: జూలై 2023లో అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలు

క్యాబిన్ కూడా నలుపు రంగును పొందింది

Hyundai Creta Adventure Edition seats

SUVలు రెండూ పూర్తి-నలుపు రంగు క్యాబిన్ థీమ్ మరియు ఎక్స్టర్ؚలో ఉన్నట్లుగానే సేజ్ గ్రీన్ ఇన్సర్ట్ؚలతో వస్తాయి. హ్యుందాయ్ వీటికి కొత్త నలుపు రంగు మరియు ఆకుపచ్చ సీట్ అప్ؚహోల్ؚస్ట్రీని కూడా అందించింది, దీన్ని “ఇల్లస్ట్రేషన్ ఆఫ్ మౌంటెన్స్” అని నామకరణం చేసింది. ఇతర ఇంటీరియర్ సవరణలలో 3D ఫ్లోర్ మాట్ؚలు మరియు మెటల్ పెడల్స్ ఉన్నాయి.

Hyundai Creta Adventure Edition cabin
Hyundai Creta-Alcazar Adventure Editions dual-dashcam camera

ఫీచర్ల విషయంలో, హ్యుందాయ్ SUVల ఎక్విప్మెంట్ జాబితాలో ఏకైక జోడింపుగా డ్యూయల్-కెమెరా డ్యాష్ؚకామ్ నిలుస్తుంది. దీనితో పాటుగా, క్రెటా అడ్వెంచర్ ఎడిషన్, దాని సంబంధిత వేరియెంట్ؚల నుండి ఆకర్షణీయమైన అన్ని ఫీచర్లను పొందుతుంది, వీటిలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్ؚరూఫ్, మరియు వెంటిలేటెడ్ ముందు సీట్లు ఉన్నాయి. దీని భద్రత ఫీచర్‌లలో, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.

ఆల్కాజార్ ప్రత్యేక ఎడిషన్ టాప్ స్పెసిఫికేషన్ؚలో, క్రెటా కంటే ఎక్కువగా 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు 360-డిగ్రీల కెమెరాను పొందింది. 

అందిస్తున్న ఇంజన్-గేర్ؚబాక్స్ ఎంపికలు

ప్రారంభంలో పేర్కొన్నట్లు, క్రెటా ప్రత్యేక ఎడిషన్ పెట్రోల్ ఇంజన్ ఎంపికకు మాత్రమే పరిమితం చేయబడింది, ఆల్కాజార్ؚను పెట్రోల్ మరియు డీజిల్ పవర్ؚట్రెయిన్ؚలు రెండిటితో పొందవచ్చు. వీటి సాంకేతిక వివరాలను క్రింద అందించబడింది. 

స్పెసిఫికేషన్

క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ 

ఆల్కాజార్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్

ఆల్కాజార్ 1.5-లీటర్ డీజిల్

పవర్ 

115PS

160PS

116PS

టార్క్ 

144Nm

253Nm

250Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్ MT, CVT

6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT

6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT

ఇది కూడా తనిఖీ చేయండి: హ్యుందాయ్ ఎక్స్టర్ Vs టాటా పంచ్: చిత్రాలతో పోలిక

పోటీదారులు

 

Hyundai Creta-Alcazar Adventure Editions

హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ؚ ప్రత్యక్ష పోటీదారులు స్కోడా కుషాక్ మరియు వోక్స్వాగన్ టైగూన్ మాట్ ఎడిషన్ؚలు, ఆల్కాజార్ ప్రత్యేక ఎడిషన్ టాటా సఫారి రెడ్ డార్క్ మరియు అడ్వెంచర్ ఎడిషన్ؚలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: క్రెటా ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2020-2024

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ క్రెటా 2020-2024

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience