హ్యుందాయ్ క్రెటా 2018 vs రెనాల్ట్ కాప్టర్: రియల్-వరల్డ్ పెర్ఫామెన్స్ పోలిక

ప్రచురించబడుట పైన Apr 20, 2019 12:49 PM ద్వారా Dhruv.A for హ్యుందాయ్ క్రెటా

  • 9 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Hyundai Creta 2018 వర్సెస్ Renault Captur: Real-World Performance Comparison

రెనాల్ట్ కాప్టర్ మరియు హ్యుందాయ్ క్రీటా కాంపాక్ట్ SUV లు రెండూ కూడా మే 2018 లో ఒక ఫేస్లిఫ్ట్ ను అందుకున్నంత వరకు లక్షణాల పరంగా చాలా దగ్గరగా ఉండేవి. కానీ ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చినప్పుడు, క్రెటా ఫేస్లిఫ్ట్ మారలేదు. ఇప్పుడు, ఈ రెండూ కూడా పేపర్ మీద ఉన్న సంఖ్యల పరంగా చాలా దగ్గరగా ఏమీ లేవు, కానీ నిజ ప్రపంచ పరీక్ష సంఖ్యలు మాత్రం కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలతో ఉండవచ్చు. అందువలన, టాప్ వేరియంట్ క్రెటా 1.6-లీటరు CRDi  డీజిల్ ఇంజిన్ తో రెనాల్ట్ కాప్చర్ యొక్క  1.5 లీటర్ K9K యూనిట్ ని పోల్చి చూద్దాము.

లక్షణాలు మరియు పరీక్షించిన ఇంధన సామర్ధ్యం

 

హ్యుందాయ్ క్రీటా 2018

రెనాల్ట్ కాప్టర్

ఇంజిన్

1582cc, 4-సిలెండర్

1461cc, 4-సిలెండర్

పవర్

128PS@4000rpm

110PS@3850rpm

టార్క్

265Nm@1500-3000rpm

240Nm@1750rpm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ మాన్యువల్

6-స్పీడ్ మాన్యువల్

పరీక్షించిన ఇంధన సామర్ధ్యం (సిటీ / హైవే)

13.99kmpl/21.84kmpl

15.50 kmpl/21.1kmpl

ఈ వివరాలు క్రెటా కారు కాప్టర్ కంటే వరుసగా 18Ps శక్తివంతమైనది మరియు 25Nm అత్యధిక టార్క్ ని అందిస్తుందని వెళ్ళడిస్తున్నాయి. కానీ దీని యొక్క సిటీ ఇంధన సామర్ధ్యం కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ఆక్సిలరేషన్ సంఖ్యలు చూద్దాము.

Reanult Captur

ఆక్సిలరేషన్ మరియు రోల్-ఆన్లు

 

0-100kmph

30-80kmph (3 వ గేర్)

40-100kmph (4 వ గేర్)

హ్యుందాయి క్రెటా

10.83s

7.93s

13.58s

రెనాల్ట్ కాప్టర్

13.24s

7.77s

11.56s

వ్యత్యాసం

2.41s (కాప్చర్ నెమ్మదిగా ఉంది)

0.16s (క్రెటా నెమ్మదిగా ఉంది)

2.02s (క్రెటా నెమ్మదిగా ఉంది)

క్రెటా యొక్క పెద్ద ఇంజిన్ కాప్టర్ యొక్క 1.5 లీటర్ యూనిట్ తో పోల్చినప్పుడు అధిక శక్తిని అందిస్తుంది మరియు ఇది 11s లో స్థిరమైన స్థానం నుండి 100 కిలోమీటర్ల మార్క్ ని చేరుకోగలదు. కానీ అది గేర్ ఆక్సిలరేషన్ విషయానికి వస్తే, ఇక్కడ కాప్చర్ బాగుంది. నాల్గవ గేర్ లో 40 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల వరకు నడిచేటప్పుడు, సాధారణంగా మీరు రహదారిపై ఎదుర్కునే పరిస్థితి, కాప్చర్ 2 సెకన్ల గణనీయమైన మార్జిన్ ద్వారా క్రెటాను ఓడిస్తుంది. అలాగే కాప్చర్ కారు మూడవ గేర్ లో 30Kmph నుండి వేగాన్ని పెంచడంలో కూడా చాలా వేగంగా ఉంటుంది.

2018 Hyundai Creta

బ్రేకింగ్

 

100-0kmph

80-0kmph

హ్యుందాయి క్రెటా

43.43m

26.75m

రెనాల్ట్ కాప్టర్

41.67m

26.26m

హ్యుందాయ్ క్రీటా మరియు రెనాల్ట్ కాప్టర్ రెండూ కూడా ముందు డిస్క్ బ్రేక్లు మరియు వెనుక భాగంలో డ్రమ్స్ బ్రేకులతో వస్తాయి. కానీ మళ్ళీ ఇక్కడ కూడా కాప్టర్  అతి తక్కువ దూరంతో ఉండి క్రెటా ని ఓడించింది. ఇక్కడ ఆగిపోయే డిస్టెన్స్ యొక్క రెండు కార్ల తేడా చూసుకుంటే  100Kmph – 0Kmph కి కేవలం 1.76 మీటర్స్ రెండు కార్ల మధ్య తేడా ఉంది. అయినప్పటికీ, అది ఘర్షణను నివారించడానికి సరిపోతుంది.

 

Get Latest Offers and Updates on your WhatsApp

హ్యుందాయ్ క్రెటా

1058 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
పెట్రోల్15.8 kmpl
డీజిల్20.5 kmpl
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
వీక్షించండి మే ఆఫర్లు
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
ద్వారా ప్రచురించబడినది

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే ఎస్యూవి కార్లు

* న్యూఢిల్లీ అంచనా ధర
×
మీ నగరం ఏది?