Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

రానున్న FAME III స్కీమ్‌తో ప్రయోజనం పొందనున్న హైడ్రోజన్ కార్‌లు

జూలై 17, 2023 01:58 pm tarun ద్వారా ప్రచురించబడింది
997 Views

అయితే, కొత్త FAME III నిబంధనలలో ఎథనాల్-ఆధారిత కార్ؚలు చేర్చబడతాయో, లేదో చూడాలి

  • FAME స్కీమ్ మూడవ ఆవృతి ఇప్పుడు రూపొందుతోంది.

  • ఇందులో ప్రత్యామ్నాయ ఇంధన కార్‌లు కూడా చేర్చబడతాయి అని ప్రభుత్వ వర్గాల ప్రకటన.

  • హైడ్రోజన్-ఇంధన వాహనాలు కూడా చేర్చబడతాయని అంచనా; ఎథనాల్-ఆధారిత కార్‌లు కూడా చేర్చబడటం చూడవచ్చు.

  • కొత్త FAME III స్కీమ్ ఎలక్ట్రిక్ కార్‌లపై సబ్సిడీని కూడా పెంచవచ్చు.

  • ప్రస్తుతం, టయోటా మిరాయ్ మరియు హ్యుందాయ్ నెక్సో మాత్రమే భారతదేశంలో అందుబాటులో ఉన్న హైడ్రోజన్-ఆధారిత ఫ్యూయల్ సెల్ వాహనాలు.

భారత ప్రభుత్వం FAME (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) III స్కీమ్‌పై పని ప్రారంభించింది. హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలు కూడా ఈ స్కీమ్‌లో చేర్చబడతాయని తాజా నివేదికలు తెలుపుతున్నాయి.

ప్రస్తుత FAME II స్కీమ్ హైబ్రిడ్ؚలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే పరిమితం, అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ పక్షపాతం చూపుతుంది. హైడ్రోజన్ కార్‌ల సాంకేతికత ప్రస్తుతానికి అభివృద్ధి దశలో ఉంది, ఇది తయారీదారులు తమ ప్రయత్నాలను వేగవంతం చేసేలా ప్రేరేపించవచ్చు. టయోటా ప్రస్తుతం భారతదేశంలో మిరాయ్ؚని పరీక్షిస్తోంది, ఇది హైడ్రోజన్-ఆధారిత ఫ్యూయల్-సెల్ వాహనం, ఇది మార్కెట్ؚలోకి ప్రవేశించే మొదటి వాహనాలలో ఒకటి అవుతుందని విశ్వసిస్తున్నాము.

ఇది కూడా చదవండి: మారుతి మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు E85 ఇంధనంతో నడిచే ప్రోటోటైప్ వ్యాగన్ R

ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలు

హైడ్రోజన్ కంటే ముందుగా మార్కెట్ؚలోకి ప్రవేశించే మరొక ప్రత్యామ్నాయ ఇంధన ఎథనాల్ అని చెప్పవచ్చు. మారుతి ప్రస్తుతం వ్యాగన్ R ఫ్లెక్స్ వర్షన్ؚను పరీక్షిస్తోంది, ఇది 85 శాతం ఎథనాల్ మిశ్రమం ఆధారంగా నడుస్తుంది. ఈ కారు తయారీదారు 2025 నాటికి ఒక కొత్త కాంపాక్ట్ ఫ్లెక్స్ ఇంధన వాహనం అందించనున్నట్లు ఇప్పటికే ధృవీకరించారు.

భారతదేశంలో హైడ్రోజన్ కార్‌లు?

ప్రస్తుతానికి, కేవలం టయోటా మరియు హ్యుందాయ్ మాత్రమే భారతదేశంలో హైడ్రోజన్ కార్ తయారీలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నితిన్ గడ్కారీ రోజూ ప్రయాణించే వాహనం టయోటా మిరాయ్ ఫ్యూయల్ సెల్ అయితే, అనేక సందర్భాలలో ప్రదర్శించబడిన నెక్సో FCEVని హ్యుందాయ్ తీసుకువస్తుంది అని సమాచారం.

ఇది కూడా చదవండి: గ్రీన్ హైడ్రోజెన్ టార్గెటెడ్ ప్రైజింగ్ ప్రణాళికల వివరాలను తెలిపిన నితిన్ గడ్కారీ

సాధారణ EVలు మరొకసారి ప్రయోజనం పొందుతాయా?

ప్రస్తుత స్కీమ్, విస్తృతమైన కవరేజీ కలిగి ఉన్నప్పటికీ, అనేక ఎలక్ట్రిక్ కార్ؚలపై అవగాహన కల్పించదు. జూన్ 2021లో, ప్రారంభ సబ్సిడీ వాహన ధరపై 20 శాతం లేదా రూ.15,000/kWh, ఏది తక్కువ అయితే దానికి పరిమితం చేయబడింది. అధిక ఆదాయ గ్రూపులకు అదనపు కారులాగా కాకుండా, ప్రధాన కారుగా ఉండేలా EVలను మరింత ఆకర్షణీయంగా చేయడం కొనసాగించడానికి, పరిమితి అలాగే సబ్సిడీ మొత్తాన్ని పెంచుతారని ఆశిస్తున్నాము.

మూలం

Share via

Write your Comment on Toyota మిరాయ్

మరిన్ని అన్వేషించండి on టయోటా మిరాయ్

టయోటా మిరాయ్

4.98 సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.60 లక్ష* Estimated Price
జనవరి 01, 2030 Expected Launch
ట్రాన్స్ మిషన్మాన్యువల్
ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 22.24 లక్షలు*
Rs.7 - 9.84 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర