బి ఆర్-వి ను 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతున్న హోండా
హోండా బిఆర్-వి కోసం manish ద్వారా జనవరి 18, 2016 11:05 am ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మోబిలియో ఆధారిత కాంపాక్ట్ ఎస్యువి అయిన హోండా బిఆర్- వి వాహనం, బహుశా ఫిబ్రవరి 5 నుండి 9 వరకు గ్రేటర్ నోయిడా లో జరుగనున్న రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ బి ఆర్ వి కారు, హ్యుందాయ్ క్రెటా, మారుతి ఎస్ -క్రాస్, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రనో మరియు ఇతర వాహనాలకు పోటీ ఇవ్వటానికి రాబోతుంది.
ఎంపివి తో పోలిస్తే ఈ కాంపాక్ట్ ఎస్యువి వాహనం, అనేక సౌందర్య అంశాలను కలిగి ఉంది. ఈ బి ఆర్ వి వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్లు, డి ఆర్ ఎల్ ఎస్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు పూర్తిగా పునః రూపకల్పన చేసిన ముందు భాగం వంటి అంశాలు అందించబడ్డాయి.
లోపలి భాగంలో కూడా బాహ్య భాగంలో అందించిన విధంగా అనేక అంశాలు అందించబడతాయి. ఈ బి ఆర్ వి లోపలి భాగం విషయానికి వస్తే, టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసి వెంట్లు, మడత సౌకర్యాన్ని కలిగిన మూడవ వరుస సీట్లు, వెనుక పార్కింగ్ కెమెరా, విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు వంటి అనేక సౌకర్య అంశాలను అందించడం జరిగింది.
హుడ్ క్రింది భాగం విషయానికి వస్తే, ఈ బి ఆర్ వి వాహనానికి 1.5 లీటర్ ఐ విటెక్ పెట్రోల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 6600 ఆర్ పి ఎం వద్ద 120 పి ఎస్ పవర్ ను అదే విధంగా 4600 ఆర్ పి ఎం వద్ద 145 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. క్రెటా పెట్రోల్ వేరియంట్ లో చూపించిన విధంగా ఈ హోండా బి ఆర్ వి వాహనం లో మూడవ వరుస సీటింగ్ అందించబడుతుంది. అంతేకాకుండా ఈ పెట్రోల్ ఇంజన్ అత్యంత శక్తివంతమైనది అని చెప్పవచ్చు.
ఈ వాహనం యొక్క డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ మరియు హోండా జాజ్ హాచ్బాక్ వాహనాలలో ఉండే డీజిల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ 1.5 లీటర్ ఐ డి టెక్ డీజిల్ ఇంజన్ అత్యధికంగా 3600 ఆర్ పి ఎం వద్ద 100 పి ఎస్ పవర్ ను అదే విధంగా 1750 ఆర్ పి ఎం వద్ద 200 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. హోండా, మెరుగైన శక్తి ని అందించడానికి ఇంజిన్ ను సర్దుబాటు చేయవలసిన అవసరం ఉంది కానీ, సర్ధుబాటు చేసిన ఇంజన్ ను అందించడం వలన, జపనీస్ తయారీదారుడు పోటీ విభాగంలో ముందంజలో ఉండే అవకాశం ఉంది.
ఈ రెండు పవర్ ప్లాంట్లు, హోండా యొక్క 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి.
ఇవి కూడా చదవండి: