హోండా బి ఆర్- వి: ఎంత ధర ను కలిగి ఉండవచ్చు?
హోండా బిఆర్-వి కోసం manish ద్వారా డిసెంబర్ 08, 2015 06:19 pm ప్రచురించబడింది
- 17 Views
- 14 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఈ హోండా బి ఆర్- వి అనునది, మొబిలియో ఆధారిత కాంపాక్ట్ ఎస్యువి మరియు ఈ హోండా వాహనం, ఈ విభాగంలో ఉండే హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ టెర్రినో, మహింద్రా స్కార్పియో అలాగే ఇటీవల విడుదల చేయబడిన మహింద్రా టియువి 300 వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ కారు, కొన్ని రోజుల క్రితం ఇండోనేషియన్ మార్కెట్ లో ప్రారంబించబడింది కానీ, భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడుతుందో ఆ ప్రారంభ తేదీను సంస్థ ఇప్పటికీ అధికారికంగా ఏ విధమైన ప్రకటనను ఇవ్వలేదు. ఈ బి ఆర్- వి వాహనం, సుమారు ఐ డి ఆర్ 226.5 మిలియన్ (భారతీయ రూపాయిలలో 10.93 లక్షలు) వద్ద ఇండోనేషియా మార్కెట్ వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ వాహనం, 2016 భారత ఆటో ఎక్స్పోలో రంగ ప్రవేశం చేస్తుంది అని భావిస్తున్నారు. భారత మార్కెట్లో, హోండా రాబోయే వాహనం యొక్క ధర ను దోహదం చేసే కొన్ని కారకాలను కలిగి ఉంది. అవి ఏంటో చూద్ద్దాం రండి.
హోండా యొక్క కాంపాక్ట్ ఎస్యువి అయిన ఈ హోండా బి ఆర్ - వి వాహనం, శక్తివంతమైన ఇంజన్ లతో రాబోతుంది. అవి వరుసగా, 1.5 లీటర్ ఐ- విటెక్ పెట్రోల్ మరియు 1.5 ఐ- డి టెక్ డీజిల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లూ, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ వాహనానికి, పెట్రోల్ అలాగే డీజిల్ ఇంజన్లు ప్రామాణికంగా అందించబడతాయి. మరోవైపు హోండా, ఈ వాహనం యొక్క పెట్రోల్ వేరియంట్ లకు ఒక కొత్త సివిటి ట్రాన్స్మిషన్ ను ఆప్షనల్ గా అందించింది. ఈ వాహనం కలిగి ఉన్న సౌకర్య లక్షణాల విషయానికి వస్తే, ఈ హోండా బి ఆర్ వి వాహనానికి, టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్లు, వెనుక ఏసి వెంట్ లతో కూడిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డి ఆర్ ఎల్ ఎస్, మడత వేయగల మూడవ వరుస సీటు, వెనుక పార్కింగ్ కెమెరా మరియు విధ్యుత్తు తో సర్ధుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు వంటి అంశాలు అందించబడ్డాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హోండా, బి ఆర్ వి మరియు మొబిలియో వాహనాల మధ్య గల గణనీయమైన ధర పరిది ను నిర్వహించుకుంటూ వచ్చింది. అంతేకాకుండా ఈ ఎస్యువి పరిచయంతో ఎంపివి వాహనాలకు ఏ రకంగా అమ్మకాల విషయంలో దెబ్బతగలదు అని చెప్పవచ్చు మరియు దీని యొక్క పోటీదారుడు అయిన హ్యుందాయ్ క్రెటా కు మాత్రం గట్టి పోటీను ఇస్తుంది. భారతదేశంలో ఈ హోండా బి ఆర్ వి వాహనం, 8.2 లక్షల వద్ద ప్రవేశపెట్టబడుతుంది. దీనితో పాటు ఈ మోడల్ సిరీస్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ యొక్క ధర, 12.1 లక్షలు ఉండవచ్చునని అంచనా.
ఇవి కూడా చదవండి: