• English
  • Login / Register

హోండా బీఆర్-వీ రేపు ఆవిష్కారం ఉండగా ఈరోజే కంటపడింది

హోండా బిఆర్-వి కోసం raunak ద్వారా ఆగష్టు 20, 2015 09:55 am సవరించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హోండా వారి రాబోయే ఎస్యూవీ అయిన బీఆర్-వీ అధికారిక ఆవిష్కారానికి మునుపే ఆన్లైన్ లో జరుగుతున్న గైకిండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షో 2015 లో దర్శనమిచ్చింది. జపనీస్ ఆటో తయారీదారి రేపు దీనిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. భారతదేశంలో విడుదల గురించి చెప్పాలంటే, హోండా వారి దీని ప్రస్తావన తీసుకురాకపోయినా ఇది బహుశా 2016 భారతీయ ఆటో ఎక్స్పో వచ్చే సంవత్సరం ఫిబ్రవరీలో జరిగే సందర్భంగా ఆవిష్కరించవచ్చు.

స్టైలు విషయానికి వస్తే, దీని తయారీ అచ్చం జూనులో వేసిన స్కెచ్ ఆధారంగానే జరిగింది. ఈ బీఆర్-వీ (బోల్డ్ రన్ అబౌట్ వెహికల్) బ్రైయో ని ఆధారంగా చేసుకుని తయారు అయిన అమేజె మరియూ మొబిలియో లాగానే ఉండవచ్చు కానీ దీని మీద ఎటువంటి ప్రకటన హోండా వారి నుండి రాలేదు. ఇకపోతే, ఈ ఫోటోలను చూస్తే, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, హోండా వారి H-షేప్ క్రోము గ్రిల్లు కనపడ్డాయి. డోర్లు మొబీలియో లో ఉన్నట్టుగానే ఉన్నాయి, ఒకవేళా అవే అయి ఉండవచ్చును కూడా. వెనుక వైపుగల ఫోటోలు ఎవీ దొరకలేదు కాకపోతే క్యాబిన్ మాత్రం మొబిలియో మరియూ అమేజ్ లాగా కాకుండా, కొత్తగా వచ్చే అవకాశం ఉంది.

ఇంజిను ఆప్షన్ల విషయానికి వస్తే, హోండా వారు ఇప్పటికే ఇది సిటీ/మొబిలియో లో ఉన్నట్టుగానే ఒక 1.5-లీటరు ఐ-వీటెక్ మోటరుతో వస్తుంది అని ధ్రువీకరించారు. కాకపోతే, భారతీయ మార్కెట్ కోసం వారు 1.5-లీటరు ఐ-డీటెక్ తో పాటుగా 1.5-లీటరు ఐ-వీటెక్ పెట్రోల్ కూడా అందించే అవకాశం ఉంది. కాబట్టి, ఇది మొబిలియో కి ఉన్నటువంటి ఇంజిన్ ఆప్షన్స్ తోనే ఇవ్వబడుతుంది మరియూ సిటీ కి ఉన్నట్టుగానే ఆటోమాటిక్ ఆప్షన్ తో కూడా రావొచ్చు.

was this article helpful ?

Write your Comment on Honda బిఆర్-వి

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience