హెచ్ ఆర్ వి క్రాస్ ఓవర్ ను ఆటో ఎక్స్పో వద్దకు తీసుకురాబోతున్న హోండా
హోండా బిఆర్-వి కోసం saad ద్వారా ఫిబ్రవరి 04, 2016 11:16 am ప్రచురించబడింది
- 19 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విసృత వాహనాలను తీసుకొస్తుంది.
హోండా చివరికి మొబిలియో ఆధారిత క్రాస్ఓవర్ అయిన బిఆర్-వి వాహనాన్ని బహిర్గతం చేసింది. ఈ విభాగంలో ఈ కాంపాక్ట్ ఎస్యువి, ఇదే విభాగంలో ఉండే నిస్సాన్ టెర్రినో, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి ఎస్ క్రాస్ మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఈ ఎంపివి మొబిలియో వాహనం , బి ఆర్ వి వాహనం ఆధారంగా ఉంది, కానీ తరువాత ఈ వాహనం ఒకేసారిగా పునః రూపొందించిన డి ఆర్ ఎల్ ఎస్ తో, మార్పు చేయబడిన ముందు భాగంతో, ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్స్ తో అలాగే డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో వచ్చింది. మొత్తంమీద, హోండా బిఆర్-వి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది మరియు సౌందర్యం పరంగా చూసినట్లైతే క్రెటా వంటి వాహనానికి సమంగా పోటీ పడుతంది.
ఈ వాహనం యొక్క అంతర్గత భాగం విషయానికి వస్తే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా వెనుక ఏసి వెంట్లు, టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ, మడత వేయగల మూడవ వరుస సీట్లు, విధ్యుత్తు తో నియంత్రించబడే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్ లు వంటి తదితర లక్షణాలతో ఆకట్టుకునే విధంగా వస్తుంది.
ఈ హోండా బి ఆర్ వి వాహనం, పెట్రోల్ మరియు డీజిల్ అను రెండు ఇంజన్ ఎంపికలతో రాబోతుంది. ముందుగా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వాహనానికి 1.5 లీటర్ ఐ విటెక్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 6600 ఆర్ పి ఎం వద్ద 120 పి ఎస్ పవర్ ను అదే విధంగా 4600 ఆర్ పి ఎం వద్ద 145 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ హోండా బి ఆర్ వి వాహనం, మడత వేయగల మూడవ వరుస సీటును కలిగి ఉన్నప్పటికీం, ఈ ఉత్పత్తులు ఆధారమ్హా, ఈ వాహనం యొక్క పెట్రోల్ ఇంజన్, క్రెటా వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది.
ఈ హోండా బి ఆర్ వి వాహనంలో, కాంపాక్ట్ సెడాన్ అయినటువంటి హోండా అమేజ్ మరియు హోండా జాజ్ హాచ్బాక్ వంటి వాహనాలలో ఉండే డీజిల్ ఇంజన్ ను అందించడం జరగనుంది. ఈ వాహనానికి, 1.5 లీటర్ ఐ డిటెక్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 3600 ఆర్ పి ఎం వద్ద 100 పి ఎస్ పవర్ ను అదే విధంగా 1750 ఆర్ పి ఎం వద్ద 200 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజన్లు, డ్రైవర్ కోసం సౌలభ్యాన్ని మరియు సౌకర్యవంతాన్ని అందించడం కోసం 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటాయి.
హోండా బిఆర్- వి యొక్క ప్రదర్శన వీడియో ను వీక్షించండి
0 out of 0 found this helpful