హోండా బీఆర్-వీ వచ్చే ఏడాది రానుంది, అని సీఈఓ తెలిపారు
హోండా బిఆర్-వి కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 27, 2015 12:52 pm ప్రచురించబడింది
- 13 Views
- 7 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
హోండా బీఆర్-వీ యొక్క రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్చ్ 2016 తరువాత వస్తుంది అని హోండా కార్ల ప్రెసిడెంట్ మరియూ సీఈఓ అయిన మిస్టర్. కత్సుషీ ఇనో గారు తెలిపారు. ఈ కారు బ్రయో వేదికగా నిర్మించబడింది మరియూ ఫోర్డ్ ఈకో స్పోర్ట్, మారుతి ఎస్-క్రాస్, హ్యుండై క్రేటా మరియూ రెనాల్ట్ డస్టర్ వంటి వాహనాలకు పోటీగా నిలవనుంది.
ఈ కారు బ్రయో వేదికన తయారు అయినా, బాడీ షెల్ వంటివి మొబిలియో ని పోలి ఉంటుంది. ముందు వైపు మరియూ వెనుక భాగాన పూర్తిగా మార్చబడింది. క్లాంషెల్ల్ బానెట్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తో డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ వంటి వాటితో ముందు వైపున అలంకరించబడింది. ఆధునిక టెయిల్‌ల్యాంప్ క్లస్టర్ తో పాటుగా దుడుకైన బంపర్ వెనుక వైపు కలిగి ఉంటుంది. ఇంకా వెడల్పుగా ఇంకా భారీగా కనపడేందుకు గాను దీనికి అన్ని వైపులా బాడీ క్లాడింగ్ ఇవ్వడం జరిగింది.
లోపల వైపున, బీఆర్-వీ కి కొత్త అంతర్ఘత అమరిక హోండా సిటీ మరియూ జాజ్ నుండి పునికి తెచ్చుకున్నదిగా ఉంటుంది. ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం, స్పోర్టీ అమరిక మరియూ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ తో పాటుగా మూడవ వరుస సీటింగ్ కూడా ఉంటుంది కానీ ఇది అంత గొప్పగా కుదరలేదు.
ఇందులో హోండా సిటీ ఇంకా మొబిలియో నుండి పునికి తెచ్చుకున్న 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిను ఉండగా, డీజిల్ మోటర్ ప్రస్తుతం ఉన్న 100bhp శక్తి ఇచ్చే 1.5-లీటర్ కాకుండా 120bhp శక్తిని ఇచ్చే 1.6-లీటర్ ఇంజిను అమర్చబడే అవకాశం ఉంది.
ధర పరంగా, ఇది దాదాపుగా రూ. 8 నుండి రూ. 13 లక్షల వరకు ఉండవచ్చును. ఈ వాహనం తపుకారా సముదాయంలో జాజ్ తో పాటుగా నిర్మించబడుతుంది.