• English
  • Login / Register

హోండా బిఆర్-వి రంగు పథకాలు బహిర్గతం

హోండా బిఆర్-వి కోసం manish ద్వారా అక్టోబర్ 09, 2015 05:17 pm ప్రచురించబడింది

  • 13 Views
  • 4 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హోండా ఇండోనేషియన్ మార్కెట్ కోసం బిఆర్-వి కాంపాక్ట్ క్రాస్ఓవర్ రంగు వివరాలు వెల్లడించింది. ఈ కారుని ఆరు సొగసైన రంగులలో అందిస్తున్నారు. రంగు పేర్లలో టఫేటా వైట్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మోడరన్ స్టీల్ మెటాలిక్, క్రిస్టల్ బ్లాక్ పెరల్, మిస్టీ గ్రీన్ పెరల్ మరియు పాషన్ రెడ్ పెరల్ ఉన్నాయి. కొత్త బిఆర్-వి లో సిల్వర్, గ్రీన్ మరియు ఎరుపు పెయింట్ పథకాలు కూడా అందిస్తుందని సంస్థ తెలిపింది. కారు 16 అంగుళాల అలాయ్ వీల్స్ తో అందించబడుతున్నది మరియు హ్యుందాయి క్రెటా కి పోటీగా ఉండబోతుంది.

హోండా బిఆర్-వి 1.6 లీటర్ i-DTEC మోటార్ తో అందించబడవచ్చు, ఇది ప్రస్తుతం భారతదేశం లో పరీక్ష చేయబడుతున్నది. అదే పవర్ప్లాంట్ యూరోప్ లో ఆచరణలో ఉంది మరియు 120ps శక్తిని మరియు 300Nm టార్క్ ని అందిస్తుంది. ఇదే కాకుండా, ఈ కారు హోండా సిటీ లో చూసిన అదే 1.5 లీటర్ i-VTEC మోటారు ని కలిగి ఉండవచ్చని ఊహిస్తున్నాము. ఈ ఇంజిన్ 6000rpm వద్ద 120ps శక్తిని మరియు 4,600rpm వద్ద 145Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ ఎంపికలు సివిటి లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉండవచ్చని అంచనా. 

ఇండోనేషియన్ ధరలకి ఏమైనా సూచనలు ఉంటే, అప్పుడు ఈ కారు రూ.11 లక్షల ధరకే రావచ్చు, రూ. 10.80-12.40 లక్షల ధర మధ్యలో ఉండవచ్చు. కొలత పరంగా, కారు 4,455mm పొడవు, 1,735mm వెడల్పు, 2,660mm ఎత్తు మరియు 200mm వీల్బేస్ ని కలిగి ఉంటుంది. కార్ల తయారీదారుడు బీఅర్-వి అంచనా ప్రకారం 2016 ఏప్రిల్ లో తపుకరా, రాజస్థాన్ కర్మాగారం వద్ద ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Honda బిఆర్-వి

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience