హోండా అకార్డ్ 2016 లో విడుదల కానుంది; హోండా జాజ్ రూ.5.40 లక్షలు నుండి చెన్నై లో ప్రారంభించబడింది

published on జూలై 21, 2015 05:29 pm by bala subramaniam కోసం హోండా కొత్త అకార్డ్

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై: హోండా అకార్డ్ 2016 లో భారతదేశంలో ప్రారంభించబడుతుంది అని  హోండా కార్లు భారతదేశం లిమిటెడ్ (హెచ్సీఐఎల్) కి మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మిస్టర్ ఙానేష్వర్ సేన్ మీడియాతో మాట్లాడుతూ - చెన్నై లో కొత్త హోండా జాజ్ యొక్క విడుదల సందర్భంగా చెప్పారు. భారతదేశంలోకి కొత్త సివిక్ ని తీసుకువచ్చే ఆలోచన ఇప్పటికి అయితే లేదు అని చెప్పారు. కొత్త హోండా జాజ్ రూ.5.40 లక్షలు ఎక్స్-షోరూమ్ ధర నుండి చెన్నై లో ప్రారంభం చెయ్యబడింది.

కొత్త హోండా జాజ్ 1.2 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఒక 1.5-లీటర్ ఐ-డీటెక్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంటుంది. శక్తి / టార్క్ ఉద్గాతాలు వరుసగా 90 పీఎస్ / 110 ఎనెం మరియు 100 పీఎస్ / 200 ఎనెం గా ఉన్నాయి. పెట్రోలు ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఒక సీవీటీ గేర్బాక్స్ తో అందుబాటులో ఉంటుంది. డీజిల్ ఇంజిన్ మాత్రము 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. కొత్త జాజ్ ఇంధన వరుసగా డీజిల్, పెట్రోల్ మాన్యువల్ మరియు పెట్రోల్ సీవీటీ కోసం 27.3 కీ.మీ / లీటరుకి, 18.7 కీ.మీ / లీటరుకి మరియు 19 కీ.మీ / లీటరుకి గా ఉంది.

ఈ సందర్భంగా, హోండా కార్స్ భారతదేశం లిమిటెడ్ కి అధ్యక్షుడు & సీఈఓ అయిన మిస్టర్ కత్సుషి ఇనోయూ మాట్లాడుతూ, "జాజ్ 2001 లో మొదటి తరం ప్రారంభించినప్పటి నుండి 75 దేశాలలో అమ్మిన ఇప్పటికి 5.5 మిలియన్ పైగా యూనిట్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన విజయవంతమైన మోడల్. జాజ్ ప్రపంచవ్యాప్తంగా మా వ్యాపార పెంచడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది మరియు నేను భారతదేశం లో మా వినియోగదారులకు అదే విధంగా స్వీకరింపబడుతుంది అని నమ్మకంగా ఉన్నాను. "అని అన్నారు

2016 కల్లా 300,00 యూనిట్లకు పెంచుటకై  హెచ్సీఐఎల్ కంపెనీ వారు రూ.380 కోట్ల అదనపు పెట్టుబడి రాజస్థాన్ లో ఉన్న ప్లాంట్ యొక్క సామర్ధ్యాన్ని మరింతగా పెంచేందుకు వెచ్చిస్తున్నారు. మిస్టర్ ఇనోయూ మొత్తం డీలర్ నెట్వర్క్ 2016 సంవత్సరం నాటికి 200 నగరాల్లో 300 డీలర్షిప్ కి పెంచుతామని చెప్పారు. 

కొత్త హోండా జాజ్ వేరియంట్స్ మరియు ధరలు (ఎక్స్-షోరూమ్, చెన్నై): 

హోండా జాజ్ పెట్రోల్

జాజ్ ఈ - రూ.5.40 లక్షలు

జాజ్ ఎస్ - రూ.6.05 లక్షలు

జాజ్ ఎస్ వీ - రూ.6.56 లక్షలు

జాజ్ వీ - రూ.6.93 లక్షలు

జాజ్ వీ ఎక్స్ - రూ.7.42 లక్షలు 

జాజ్ ఎస్ సీవీటీ - రూ.7.10 లక్షలు

జాజ్ వీ సీవీటీ - రూ.7.98 లక్షలు  

హోండా జాజ్ డీజిల్

జాజ్ ఈ - రూ.6.62 లక్షలు

జాజ్ ఎస్ - రూ.7.28 లక్షలు

జాజ్ ఎస్ వీ - రూ.7.79 లక్షలు

జాజ్ వీ - రూ.8.26 లక్షలు

జాజ్ వీ ఎక్స్ - రూ.8.75 లక్షలు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా కొత్త Accord

Read Full News

trendingహైబ్రిడ్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
* న్యూఢిల్లీ అంచనా ధర
×
We need your సిటీ to customize your experience