• English
  • Login / Register

వర్చువల్ రియాలిటీని మరింత సమర్థవంతంగా అందిచడానికి దృశ్య 360ఎస్ ను తీసుకున్న గిర్నార్‌సాఫ్ట్

డిసెంబర్ 23, 2015 09:51 am cardekho ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వీడియో తయారీ, వర్చువల్ రియాలిటీ రంగంలోదృశ్యఫ్ 360ఎస్ అనేది జనాదరణ కలిగినది

జైపూర్: తమ కస్టమర్లకోసం, కొత్త కొత్త కారుల వివరాలను కాల్పనిక వాస్తవికత (వర్చువల్ రియాలిటీ)లో మరింత సమర్థవంతంగా అందించడానికి కార్ దెఖో. కామ్, జిగ్ వ్హీల్స్. కామ్, గాడి. కామ్ లకు మాతృసంస్థ అయిన గిర్నార్‌సాఫ్ట్ ... ఈ రంగంలో ప్రఖ్యాతి గాంచిన దృశ్య 360ఎస్ ను తమ అనుబంధ సంస్థగా చేసుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా దృశ్య 360ఎస్ కి చెందిన అందరు ఉద్యోగులు ఇక గిర్నర్ సాఫ్ట్ లో చేరుతారు. ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ, వెబ్ డిసైనింగ్, వర్చువల్ రియాలిటీ సేవలు అందించడంలో ప్రసిద్ధికి ఎక్కిన దృశ్య360ఎస్ 2010లో శశాంక్ అడిగ స్థాపించారు. ఈ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా గిర్నర్ సాఫ్ట్ ఇక కార్ దెఖో. కామ్, జిగ్ వ్హీల్స్. కామ్, గాడి. కామ్ ల కోసం వర్చువల్ రియాలిటీ రూపొందించనుంది. అంతేకాకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రకటనలు రూపొందిచడానికి గిర్నర్ సాఫ్ట్.. శశాంక్ అడిగ, ఆయన టీమ్ నుంచి సలహాలు, సూచనలు కూడా పొందనుంది.

ఇందులో భాగంగా అడిగ.. గిర్నర్ సాఫ్ట్ స్ట్ర్యాటజీ డైరెక్టర్ రాహుల్ యాదవ్‌ను సంప్రదిస్తారు.

ఈ టేకోవర్ గురించి రాహుల్ యాదవ్ మాట్లాడుతూ " మా వెబ్‌సైట్ల ద్వారా ఇప్పటివరకు వినూతనమైన ఎన్నోఫీచర్లను అందించిన మేము.. మరో అడుగు ముందుకు వేయడానికి కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే దృశ్య 360ఎస్ ను మా సంస్థలో విలీనం చేసుకున్నాం. ఆ సంస్థ అందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, ఆ సాంకేతికతను మరింత అభివృద్ది చేయడం ద్వారా వినియోగదారులుకు అత్యున్నత సేవలను అందించగలమన్న నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు.

శశాంక్ అడిగ మాట్లాడుతూ... "డిజిటల్ మాద్యమంలో వర్చువల్ రియాలిటీని సృష్టించి వినియోగదారుడికి నిజంగా ఓ వస్తువును ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్ని కలిగించడం కోసమే దృశ్య 360ఎస్ ను స్థాపించాం. ఇప్పుడు గిర్నర్ సాఫ్ట్ తో మేము కలవడంతో మా సాంకేతిక పరిజ్ఞానికి వారి సాంకేతిక మౌలిక వసతులు తోడై వర్చువల్ రియాలిటీ వ్యాపారంలో ప్రపంచ శ్రేణి సేవలు అందించడానికి వీలు పడుతుంది" అని చెప్పారు.

తమ ఆద్వర్యంలోని కార్‌దేఖో.కాం , బైక్‌దేఖో.కాం , జిగ్ వీల్స్. కామ్, ట్రక్ దేఖో. కామ్, కంపనీల కస్టమర్లకు అత్యున్నత స్థాయిలో సేవలు అందించడానికి గిర్నర్ సాఫ్ట్ వర్చువల్ రియాలిటీని అభివృద్ది చేసే పనిలో పడింది. ఇక కార్ కార్‌దేఖో.కాం ఇటీవలే "ఫీల్ ద కార్" సదుపాయాన్ని ప్రారంబించింది. ఈ సదుపాయం ద్వారా వినియోగదారుడు కార్ ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు.

ఇంకా చదవండి

కార్దేఖో.కాం వారు జిగ్‌వీల్స్.కాం ని కొనుగోలు చేశారు - టైంస్ ఇంటర్నెట్ వారు గిర్‌నార్ సాఫ్ట్‌వేర్ లో పెట్టుబడి పెట్టారు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience