• English
  • Login / Register

మే 2015 లో "ఫోర్డ్ ఇండియా" 11,714 వాహనాలు విక్రయం

జూన్ 02, 2015 05:06 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: ఫోర్డ్ ఇండియా (దేశీయ అమ్మకాలను మరియు ఎగుమతి కలిపి) 2015 మే లో 11,714 వాహనాలను విక్రయించింది. వీటితో పోలిస్తే, గత ఏడాది 2014 మే నెలలో 12,288 వాహనాల అమ్మకాలు జరిగాయి. వ్యక్తిగత అమ్మకాల గురించి మాట్లాడటానికి వస్తే - దేశీయ మార్కెట్ లో మే 2015 లో 4,726 వాహనాలను విక్రయించగా, గత ఏడాది మే 2014 లో 6,053 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఎగుమతుల విషయానికి వస్తే, మే 2015 లో 6,988 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయగా గత ఏడాది 2014 ఇదే నెలలో 6,235 వాహనాలను ఎగుమతి చేసింది.

 

ఫోర్డ్ ఇండియా ఎంతో ఉత్సాహముతో ప్రవేశపెడుతున్న కొత్త ఫిగో ఆస్పైర్ ఒక కాంప్యాక్ట్ సెడాన్, ఇది ఒక నెల లేదా రెండు నెలలలో మీ ముందుకు రాబోతోంది. ఈ వాహనతయారి సంస్థ దీనిని దేశంలోని 25నగరాలలో ని 40 ప్రాంతాల్లో 10 వారాల క్రితం రోడ్ షోలో ప్రదర్శించి వివిధ షో రూంలలో ప్రవేశపెట్టారు. అంతేకాక, ఎంపిక చేసిన నగరాల్లోని ఫోర్డ్ డీలర్స్ రాబోయే కాంపాక్ట్ సెడాన్ ఫిగో ఆస్పైర్ బుకింగ్ రూ. 50,000 ఇనీషియల్ పేమెంట్ తీసుకోవడం మొదలు పెట్టారు.

షో రూంలలో ఉన్నటువంటి ఫిగో ఆస్పైర్ లను రోడ్ షోలో చూసి వాటి గురించి కస్టమర్ల నుండి వచ్చే స్పందనను చూశాక  మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాము  మరియు ఈ స్పందన ఇలాగే ఉండాలని మేము ఆశిస్తున్నాము అంటూ ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్,సేల్స్ మరియు సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా అన్నారు.

"ఫిగో ఆస్పైర్ దాని మంచి లుక్స్, సౌలభ్యం మరియు స్మార్ట్ టెక్నాలజీ తో చెప్పదగిన రీతిలో ఆధునిక భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా దీనిని రూపొందించారు మరియు ఇది ప్రతి విషయంలోను వినియోగదారుల యొక్క అంచనాలను మించి, కొన్ని నెలలలో మీ ముందుకు రాబోతోంది అని "అతను మరింత జోడించారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience