ఫోర్డ్ ఇండియా, వాట్ ద్రైవ్స్ యూ హ్యాప్పీ? అనే క్యంపెయిన్ ని ఈరోజు ప్రారంభిస్తుంది

ఫోర్డ్ ఆస్పైర్ కోసం raunak ద్వారా మే 27, 2015 03:53 pm సవరించబడింది

జైపూర్: ఫోర్డ్ ఇండియా తన ఫీగో ఏస్పైర్ అనే కాంపాక్ట్ సెడాన్ ని ప్రీ లాంచ్ చేయుటకై, "వాట్ డ్రైవ్స్ యూ?" అనే కొత్త కాంపెయిన్ ని ఆరంభించింది. కంపెనీ, అధికారికంగా తన ఏస్పైర్ కి బ్రాండ్ ఎంబాస్సడర్ గా, బహుముఖ ప్రగ్నాశాలి మరియూ గాయకుడు, డైరెక్టరు అయిన ఫరాన్ అక్తర్ ని ప్రకటించింది.

"వాట్ డ్రైవ్స్ యూ" క్యంపెయిన్ లో ఏముంది?

"వాట్ డ్రైవ్స్ యూ" క్యంపెయిన్ లో ప్రజలని వారి ఆశయాలను, కలలను మరియూ లక్ష్యాలను పంచుకోమని, మరియూ వాటికోసం ప్రతి రోజూ వారికి ప్రేరణ కలిగించే విషయం ( ' గో ఫర్దర్ ' అనే ఫోర్డ్ యొక్క నినాదాన్ని ఉద్దేసించి ) ఏమిటని అడుగుతారు. ఈ క్యాంపెయిన్లో పాల్గొనడానికి మీరు మీ కథలను www.whatdrivesyou.in కి పంపించాలి. దెశ వ్యాప్తంగా అందరి కథలను అందుకున్న తరువాతా, వాటిలోంచి పాల్గొనాదారులను ఎంపిక చేసిన వారికి ఎన్నో ఆశ్చర్యాలు ఉంటాయి. ఇది పది వారాల పాటు కొనసాగే క్యాంపెయిను మరియూ ఒక్క విజేతకి మొట్ట మొదటి ఫోర్డ్ ఫీగోఎ ఏస్పైర్ ని నడిపే అవకాశం కల్పిస్తారు. ఈ క్యాంపెయిను లో ఎనిమిది పాల్గొనేదారులను లక్ష రూపాయలతో ఒక్కొక్కరినీ బహుకరిస్తుంది.  మొత్తం మీద 56 పాల్గోనేదారులను ఎన్నో ప్రత్యేక బహుమానాలు ఇవ్వబడతాయి.

'ప్రతియొక్కరికీ వారి వారి వ్యక్తిగత మరియూ ఉద్యోగ పరంగా వారిని ప్రేరణ కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి. ఈ క్యంపెయిను ద్వారా, వారి ఆశయాలకు కొంతైనా చేరువ అవ్వగలుగుతారనే విషయం నన్ను ఎంతగానో ప్రేరణ కలిగించిన విషయం' అని ఫర్హాన్ అక్తర్ అన్నారు.

ఫోర్డ్ ఇండియా యొక్క మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్, రాజ్ సర్కార్ గారు, ' ఈరోజు ఇండియా ఎన్నో ఆశలతో, ఆశయాలతో ముందుకు సాగుతోంది. మా ఈ క్యంపెయిను, జీవితాలను మార్చే నూతన ఆలోచనలకు ఒక ప్రతీకగా జరుగుతోంది. ఫోర్డ్ ఫీగో ని తయారు చేయడానికి ప్రేరణగా నిలిచినటువంటి ఆలోచనలకు మరియూ ప్రేరణలను కనుగోనే ఒక ప్రయాణంగా ఇది నిలుస్తుంది.

“ ఫోర్డ్ ఇండియాలో, ఎప్పుడూ కొత్తదనం మరియు కొనుగోలుదారులు కోరుకునేవీ, విలువనిచ్చేవి ఉత్పత్తులను తయారు చేయాలి అని సదా ప్రయత్నిస్తూనే ఉంటాము. రోడ్ షోల ద్వారా, ఫీగో ఎస్పైర్ కి ఉన్న ఆకర్షనీయమైన రూపం, గొప్ప వెసులుబాటు మరియూ స్మార్ట్ పరికరాలతో పాటుగా, దీనిని సొంతం చేసుకోడంలోని ఆనందాన్ని హైలైట్ చేయబోతున్నాము,” అని సర్కార్ అన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఆస్పైర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience