• English
  • Login / Register

రూ. 4.09 లక్షల వద్ద గో నెక్స్ట్ లిమిటెడ్ఎడిషన్ ను ప్రారంభించిన డాట్సన్

ఆగష్టు 13, 2015 05:57 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:గో నెక్స్ట్ పరిమిత ఎడిషన్ రూ . 4.09 లక్షల వద్ద ఢిల్లీలో డాట్సన్ ద్వారా ప్రారంభించబడింది. ఈ పరిమిత ఎడిషన్ వేరియంట్ 1000 యూనిట్ల ఉత్పత్తిని తయారు చేసింది. భారతదేశం అంతటా 196 డాట్సన్ ఔట్లెట్లు డిసెంబర్ 2015 వరకు అందుబాటులో ఉంటుంది. గో నెక్స్ట్ యొక్క ఉపకరణాల ధర 20,000 కానీ దీని నామమాత్రపు ధర గో (టి) 5,000 వరకు పెంచడం జరిగింది. ఇది రిమోట్ సెంట్రల్ లాకింగ్, సైడ్ మౌల్డింగ్స్, క్రోమ్ ఎగ్జాస్ట్ ఫినిషర్, మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్ల వంటి లక్షణాలతో విలీనం చేయబడి ఉంటుంది. ఇంకా దీని అంతర్గత భాగాలు పునఃరూపకల్పన గేర్ లివర్ సరౌండ్ కలిగి ఉన్న రియర్ పార్సెల్ ట్రే మరియు డాష్బోర్డ్ కి ఒక పియానో నలుపు రంగు ఫినిషర్ వంటి వాటిని కలిగి ఉంది. ఇది కొత్త మైక్రాను పోలి ఉంది.

ఈ కారు యాంత్రికంగా ఎటువంటి మార్పుని పొందలేదు. ఇది 1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజన్ ని కలిగియుండి 68పి ఎస్ శక్తిని / 104Nm టార్క్ ని మరియు 20.63kmpl మైలేజ్ ని ఉత్తమంగా అందిస్తుంది. ఈ ఇంజిన్ ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో అమర్చబడి ఉంది. 

డాట్సన్ గో నెక్స్ట్ లిమిటెడ్ పండుగ ఎడిషన్, ప్రారంభం గురించి, నిస్సాన్ మోటార్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ" భారతదేశం లో అందరూ పండుగ సీజన్ కోసం కొనుగోలు నిర్ణయాలు చాలా వరకు ఆదా చేస్తారు. కలలను నెరవేర్చుకునేందుకు పండుగ సీజన్ సరైన సమయం .ఈ 'పరంపరను' కొనసాగించడం మరియు కొత్తదనాన్ని తీసుకురావడానికి, మేము డాట్సన్ గో లిమిటెడ్ ఫెస్టివల్ ఎడిషన్ అందిస్తున్నాము" అని అన్నారు. 

డాట్సన్ ఫెస్టివ్ ఎడిషన్ తో పాటు దక్షిణ భారత డీలర్షిప్ల వద్ద మూడు రోజుల కార్నివాల్ ని నిర్వహిస్తుంది. ఈ డీలర్షిప్లు పండుగ వాతావరణాన్ని అందిస్తాయి . ఈ సందర్భంగా కార్నివల్స్ ని మధ్య రాత్రుల వరకూ తెరిచేఉంచుతారు. ఈ సమయంలో వినియోగదారులు కార్లను బుకింగ్ చేసుకోవడం ద్వారా రూ.3500 నుండి రూ.12000 విలువ గల బంగారు బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience