2016 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఆవిషకరించబడనున్న డాట్సన్ Go-క్రాస్
డాట్సన్ గో క్రాస్ కోసం sumit ద్వారా డిసెంబర్ 03, 2015 03:45 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
నిస్సాన్ సొంతమైన కారు బ్రాండ్ డాట్సన్, 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో తొలిసారి భారతదేశం లో డాట్సన్ గో-క్రాస్ వాహనాన్ని ప్రదర్శించనున్నది. ఇది 2015 టోక్యో మోటార్ షోలో గో+ షేర్ చేసుకున్న ప్లాట్‌ఫార్మ్ మీద బహిర్గతమైనది.
ఈ కారు 5-సీటర్ మరియు 7-సీటర్ రెండు వెర్షనలలో ప్రారంభించబడుతుంది. అయితే, ముందుగా ప్రారంభించబడవచ్చని అంచనా. GO-క్రాస్ వాహనం GO + తో కొన్ని లక్షణాలను పంచుకున్నపటికీ నవీకరించబడిన అంశాలు ప్రస్తుత మార్కెట్ దృష్టాంతంతో కలిపి డాట్సన్ యొక్క తాజా సమర్పణను GO + మరియు GO కన్నా ఖరీదైనదిగా చేస్తాయని భావిస్తున్నారు.
GO-క్రాస్ కాకుండా, డాట్సన్ దాని ప్రవేశ స్థాయి హ్యాచ్‌బ్యాక్ గురించి కూడా చర్చ చేస్తుంది మరియు ఇది నిస్సాన్-రెనాల్ట్ అలయన్స్ యొక్క CMF యొక్క అదే ఆ ప్లాట్‌ఫార్మ్ పైన తయారు కావచ్చు. రెనాల్ట్ క్విడ్ కూడా అదే వేదిక ఉపయోగించుకుంది. ఈ డాట్సన్ వాహనం దాని ప్రవేశ స్థాయి వేరియంట్ కి వివిధ భాగాలు చేర్చి నవీకరించాలని చూస్తోంది. దీని డిజైన్ ఇండిపెండెంట్ గా ఉండి ఏ ఇతర హ్యాచ్‌బ్యాక్ ని పోలి ఉండదు. Redi-GO పేరు కలిగిన కారు ఇప్పటికే 2014 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో బహిర్గతమైనది, కానీ దీని యొక్క మెరుగైన వెర్షన్ 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో లో ప్రదర్శింపబడుతుందని భావిస్తున్నారు. ఇది ఒక ప్రవేశ స్థాయి హ్యాచ్ కనుక డాట్సన్ గో క్రింద ఉంచబడుతుంది.
ఇంకా చదవండి